
సాక్షి, తిరుమల: తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన వేకువజాము 2.30 గంటలకు ఆలయానికి వచ్చారు. సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూ ప్రసాదాలు అందజేశారు. అలాగే తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని కూడా దర్శించుకున్నారు.
ఆయనకు ఆలయ సూపరింటెండెంట్ మాధవకుమార్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కుంకుమార్చన సేవలో ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. ఆశీర్వాద మండపంలో ఆయనకు ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.