
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్ చేశారు. నిన్న తిరుపతిలో జరిగిన వారాహి డిక్లరేషన్ సభలో సనాతన ధర్మం గురించి పవన్ కామెంట్స్ చేశారు. తాజాగా దీనిపై ప్రకాశ్ రాజ్ తనదైన స్టైల్లో స్పందించారు. 'మీరు సనాతన ధర్మ పరిరక్షణలో ఉండండి.. సమాజ రక్షణలో మేముంటాం'.. జస్ట్ ఆస్కింగ్.. ఆల్ ది బెస్ట్' అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
(ఇది చదవండి: పవన్ కల్యాణ్‌కి ప్రకాష్ రాజ్ మరో సూటి ప్రశ్న)
కాగా.. తిరుపతి లడ్డు వ్యవహారం మొదలైనప్పటి నుంచి ప్రకాశ్ రాజ్ వరుస పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అంతకుముందే కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ కదా ?. … ఇక చాలు… ప్రజల కోసం చెయ్యవలసిన పనులు చూడండి అంటూ ఘూటుగా ఇచ్చిపడేశారు. నిన్న తిరుమల డిప్యూటీ సీఎం పవన్.. వారాహి డిక్లరేషన్ పేరుతో సనాతన ధర్మాన్ని కాపాడాతానంటూ ఆవేశంగా మాట్లాడారు. దీంతో ప్రకాశ్ రాజ్ మరోసారి పవన్‌కు చురకలంటించారు.
సనాతన ధర్మ రక్షణలో మీరుండండి. సమాజ రక్షణలో మేముంటాం.
జస్ట్ ఆస్కింగ్. 🙏🏿🙏🏿🙏🏿 All the Best #justasking— Prakash Raj (@prakashraaj) October 4, 2024