
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయ తీరుపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏపీలో పవన్ చేస్తున్న పాలిటిక్స్‌పై తన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకున్నారు. సనాతన ధర్మం పేరుతో పవన్ చేస్తున్న రాజకీయంపై ఆయన పలుమార్లు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: శ్రీకాంత్ అయ్యంగర్.. ఏంటీ నోటి దురుసు?)
ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో పాల్గొన్న ప్రకాష్ రాజ్.. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ అంటే మీకెందుకు అంత కోపం? అని అడగ్గా.. పవన్ కల్యాణ్ మూర్ఖత్వంగా రాజకీయాలు చేస్తున్నాడు. విధ్వంస రాజకీయం చేస్తున్నాడు. అది నాకు నచ్చడం లేదు. అది మాత్రమే చెబుతున్నాను. ప్రజలు ఆయన్ను ఎన్నుకుంది ఇలాంటి పాలిటిక్స్ కోసం కాదు కదా? ప్రజల తరుపున పవన్‌ని అడిగేవారు కూడా ఉండాలి కదా! మతం పేరుతో రాజకీయం చేసి అయోధ్యలో (బీజేపీ) ఓడిపోయారు. ఇప్పుడు మన కొండ ఎక్కడానికి వచ్చారు. మత తత్వ రాజకీయాలు మన దక్షిణ భారతదేశంలో బలపడే అవకాశం ఉండదు' అని ప్రకాశ్ రాజ్ అన్నాడు.
తనకు సినిమా ఛాన్సులు రాకుండా ఎవరూ అడ్డుకోలేరని ప్రకాష్ రాజ్ ధీమా వ్యక్తం చేశాడు. సినిమాలు వస్తూనే ఉన్నాయి.. పనిచేస్తూనే ఉన్నాను ఎవరైనా ఆపగలరా అని అన్నాడు. తన వల్ల సినిమా ఇండస్ట్రీలో ఎవరూ ఇబ్బంది పడలేదని.. సమాజంలో జరిగే తప్పులను చూస్తూ నోరు మెదపకుండా ఉండలేనని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో తనకు సినిమా అవకాశాలు కోల్పోయినా ప్రశ్నించడం మాత్రం ఆపనని ప్రకాష్ రాజ్ బలంగా చెప్పారు.
(ఇదీ చదవండి: వీడియో షేర్ చేస్తూ 'సాయి పల్లవి'ని టార్గెట్ చేస్తుందెవరు..?)