శివ కార్తికేయన్- సాయిపల్లవి జోడిగా నటించిన 'అమరన్' తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 31న విడుదలవుతోంది. మేజర్ ముకుందన్ జీవితంలోని కొన్ని సంఘటనలను తీసుకుని ఈ చిత్రాన్ని పూర్తి ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు రాజ్‌కుమార్ పెరియస్వామి తెరకెక్కించాడు. అయితే, ఈ సినిమా విడుదల నేపథ్యంలో కొందరు సాయిపల్లవిని టార్గెట్ చేస్తూ నెట్టింట తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
సాయి పల్లవి నటించిన 'విరాట పర్వం' సినిమా వచ్చి రెండేళ్లు దాటింది. అయితే, ఆ సమయంలో ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ నుంచి కొంత భాగాన్ని కట్ చేసి కొందరు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. నక్సల్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గురించి ఆమె ఇలా చెప్పారు. 'పాకిస్తాన్‌లో ఉన్న వాళ్లు.. మన జవాన్లు టెర్రరిస్ట్‌లు అని అనుకుంటారు. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాం.. వాళ్లకు ఏమైనా హాని చేస్తామని భావిస్తారు. అదే సమయంలో మనకు కూడా వాళ్లు అలానే కనిపిస్తారు. ఈ రెండింటి మధ్య మనం చూసే విధానం మారిపోతుంది. ఇందులో ఎవరు రైట్..? ఎవరు రాంగ్..? అని నేను చెప్పలేను.’ అని ఆమె అన్నారు. ఇప్పుడు ఈ వీడియోను కొందరు పనికట్టుకొని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మన జవాన్లను టెర్రరిస్ట్‌లతో పోల్చిందంటూ ఆమెను తప్పు పడుతున్నారు.
బాలీవుడ్ వాళ్లే టార్గెట్ చేస్తున్నారా..?
'అమరన్' మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రీసెంట్‌గా సాయి పల్లవి మాట్లాడుతూ.. బాలీవుడ్ నుంచి ఓ వ్యక్తి వచ్చి తన ఇమేజ్‌ను మరింత పెంచుతామంటూ పీఆర్ ఏజెన్సీ వారు సంప్రదించారని తెలిపింది. అయితే, దానిని తాను రిజక్ట్ చేశానని ఆమె చెప్పారు. అలాంటి అవసరం తనకు లేదని చెప్పినట్లు తెలిపారు. దీంతో ఇప్పుడు వారే సాయి పల్లవిని టార్గెట్ చేస్తున్నారని తెలుస్తోంది. ‘రామాయణ’ సినిమాతో బాలీవుడ్‌కి ఆమె ఎంట్రీ ఇస్తున్నారు. కొందరు ఈ వీడియోను షేర్ చేస్తూ.. సీత పాత్రలో సాయి పల్లవిని తొలగించాలంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇలా కావాలనే బాలీవుడ్ పీఆర్ టీమ్ వాళ్లు సాయి పల్లవిని టార్గెట్ చేశారని తెలుస్తోంది.
The whole hatred towards #SaiPallavi is due to bad subtitle by the TV channel.
She clearly says “Pakistan people will think our Soldiers as Terrorists bacause they think we are harming, Likewise for us too…May be perspective I am not sure…”
pic.twitter.com/GH9V4LTxAa— Sathyamoorthy V (@sathyaonX) October 26, 2024
Comments
Please login to add a commentAdd a comment