సూపర్ హిట్ సినిమా అమరన్ ఓటీటీ ప్రకటన వచ్చేసింది. శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా థియేటర్స్‌లో భారీ కలెక్షన్స్‌తో రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ హిట్ మూవీ నెట్‌ప్లిక్స్ ఓటీటీలోకి రానుంది. ఈమేరకు ఆ సంస్థ అధికారికంగా తెలుపుతూ ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించారు. దీపావళి కానుకగా విడుదలైన ఈ మూవీ ఓటీటీ విడుదల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్‌న్యూస్ వచ్చేసింది.
భారీ అంచనాల మధ్య విడుదలై అమరన్ మూవీ డిసెంబర్ 5న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. ఈమేరకు ఆ సంస్థ అధికారికంగా ప్రకటన చేసింది. తమిల్‌తో పాటు తెలుగు,మలయాళం, కన్నడ,హిందీ భాషలలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. అమరన్ చిత్రాన్ని సుమారు రూ. 120 కోట్లతో తెరకెక్కించారు. అయితే, ఇప్పటి వరకు రూ. 331 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తమిళ చిత్రాల జాబితాలో అమరన్ చేరింది. శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన “ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్” అనే పుస్తకంలోని “మేజర్ వరదరాజన్” చాప్టర్ ఆధారంగా తెరకెక్కించారు.
కథేంటంటే...
ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ ఇది. ఇందులో ముకుంద్ వరదరాజన్‌గా శివకార్తికేయన్ నటించగా.. అతని భార్య ఇందు రెబక్క వర్గీస్ పాత్రను సాయి పల్లవి పోషించారు. 2014 ఏప్రిల్ 25న మేజర్ ముకుంద్ వరదరాజన్ దక్షిణ కాశ్మీర్‌లోని ఒక గ్రామంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందారు. ఇది మాత్రమే బయటి ప్రపంచానికి తెలుసు. తమిళనాడుకు చెందిన ముకుంద్ వరదరాజన్ ఇండియన్ ఆర్మీలోకి ఎలా వచ్చాడు? కేరళ యువతి ఇందు(సాయి పల్లవి) తో ఎలా పరిచయం ఏర్పడింది? వీరిద్దరి పెళ్లికి ఎదురైన సమస్యలు ఏంటి? 44 రాష్ట్రీయ రైఫిల్స్ చీతా విభాగానికి కమాండర్‌గా ఆయన అందించిన సేవలు ఏంటి? ఉగ్రవాద ముఠా లీడర్లు అల్తాఫ్ బాబా, అసిఫ్ వాసీలను ఎలా మట్టుపెట్టాడు? దేశ రక్షణ కోసం తన ప్రాణాలను ఎలా పణంగా పెట్టాడు? అనేదే ఈ సినిమా కథ.
Comments
Please login to add a commentAdd a comment