శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం అమరన్. దీపావళికి థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. దాదాపు నెల రోజుల పాటు థియేటర్లలో రన్ అయింది. ఈ సినిమాకు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ మూవీ ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
అమరన్ ఈ రోజు నుంచే ఓటీటీ ప్రేక్షకులను అందుబాటులోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. సూపర్ హిట్ సినిమా కావడంతో ఓటీటీలోనూ అదరగొడుతుందేమో వేచి చూడాల్సిందే. కాగా.. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ మూవీని కమల్ హాసన్, మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు.
కథేంటంటే...
ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ ఇది. ఇందులో ముకుంద్ వరదరాజన్‌గా శివకార్తికేయన్ నటించగా.. అతని భార్య ఇందు రెబక్క వర్గీస్ పాత్రను సాయి పల్లవి పోషించారు. 2014 ఏప్రిల్ 25న మేజర్ ముకుంద్ వరదరాజన్ దక్షిణ కాశ్మీర్‌లోని ఒక గ్రామంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందారు. ఇది మాత్రమే బయటి ప్రపంచానికి తెలుసు. తమిళనాడుకు చెందిన ముకుంద్ వరదరాజన్ ఇండియన్ ఆర్మీలోకి ఎలా వచ్చాడు? కేరళ యువతి ఇందు(సాయి పల్లవి) తో ఎలా పరిచయం ఏర్పడింది? వీరిద్దరి పెళ్లికి ఎదురైన సమస్యలు ఏంటి? 44 రాష్ట్రీయ రైఫిల్స్ చీతా విభాగానికి కమాండర్‌గా ఆయన అందించిన సేవలు ఏంటి? ఉగ్రవాద ముఠా లీడర్లు అల్తాఫ్ బాబా, అసిఫ్ వాసీలను ఎలా మట్టుపెట్టాడు? దేశ రక్షణ కోసం తన ప్రాణాలను ఎలా పణంగా పెట్టాడు? అనేదే ఈ సినిమా కథ.
Comments
Please login to add a commentAdd a comment