
అక్షయ్ కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘స్కై ఫోర్స్’ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. వీర్ పహారియా, సారా అలీఖాన్, నిమ్రత్ కౌర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ మూవీని దర్శక ద్వయం సందీప్ కెవ్లానీ– అభిషేక్ అనిల్ కపూర్ తెరకెక్కించారు. జియో స్టూడియోస్, మాడ్‍డాక్ ఫిల్మ్స్, లియో ఫిల్మ్స్ యూకే ప్రొడక్షన్స్ పతాకాలపై జ్యోతి దేశ్‍పాండే, అమర్ కౌశిక్, భౌమిక్, దినేశ్ విజన్ సుమారు రూ. 160 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు. 1965లో జరిగిన ఇండియా–పాకిస్తాన్ వార్ నేపథ్యంలో భారతదేశపు మొదటి వైమానిక దాడి సంఘటనల ఆధారంగా ‘స్కై ఫోర్స్’ సినిమాను తీశారు.
ఈ చిత్రంలో కమాండర్ కేవో అహుజా పాత్రలో అక్షయ్ కుమార్, టి. విజయ పాత్రలో వీర్ పహారియా నటించారు. దినేష్ విజయ్, జ్యోతీ దేశ్ పాండే, అమర్ కౌశిక్, సాహిల్ ఖాన్ నిర్మించిన ఈ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న విడుదల అయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్కై ఫోర్స్ స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ఈ చిత్రాన్ని చూడాలంటే రూ.249 అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఈ మూవీ కేవలం హిందీ వర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. సబ్‌టైటిల్స్‌తో ఇతర భాషల వారు కూడా చూడొచ్చు. స్కై ఫోర్స్ చిత్రానికి మౌత్ టాక్ పాజిటివ్‍గా వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 200 కోట్లకు వరకు కలెక్షన్లు రాబట్టింది.
1965లో జరిగిన భారత్ - పాకిస్థాన్ వైమానిక యుద్ధం నేపథ్యంలో స్కై ఫోర్స్ సినిమా ఉంటుంది. ఆ యుద్ధ సమయంలో కనిపించకుండా పోయిన భారత వైమానిక దళం స్క్వాడ్రన్ లీడర్ అజ్జమడ బొప్పయ్య దేవయ్యకు సంబంధించిన సాహస పోరాటాన్ని ఈ సినిమా కథకు స్ఫూర్తిగా తీసుకున్నారు. పాకిస్థాన్ వైమానిక స్థావరానికి గుండెకాయలాంటి సర్గోదపై భారత్ ప్రతీకార దాడికి దిగినప్పుడు ఏం జరిగింది..? అనేది ఈ మూవీలో చూపారు. ఆ యుద్ధంలో దేవయ్య ధైర్య సాహసాలు, అతని పోరాట పటిమను ప్రపంచానికి చాటి చెప్పారు.

విజయవంతంగా జరిగిన ఆ యుద్ధంలో రియల్ హీరో అజ్జమడ బొప్పయ్య దేవయ్య సాహసమనే చెప్పవచ్చు. ఆయన త్యాగం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని అధికారులు గుర్తుచేసుకుంటారు. ఆ పోరాటంలో పాల్గొన్న ఆయన మళ్లీ తిరిగిరాలేదు. కనుమరుగైపోయిన ఆయన పాకిస్థాన్ గడ్డపై ఏమయ్యాడో ఈ సినిమాలో చూడొచ్చు. ఆయన పాత్రలో వీర్ పహారియా నటించగా, ఆయన గురువైన వింగ్ కమాండర్ అహుజా పాత్రలో అక్షయ్ కుమార్ మెప్పించారు. అక్షయ్ పాత్రకి భారత వైమానిక దళ అధికారి, గ్రూప్ కెప్టెన్ ఓం ప్రకాశ్ తనేజా స్ఫూర్తి అని మేకర్స్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment