'అమరన్‌' మూవీ ట్విటర్‌ రివ్యూ | 'Amaran' Movie Twitter Review | Sakshi
Sakshi News home page

'అమరన్‌' మూవీ ట్విటర్‌ రివ్యూ

Oct 31 2024 7:47 AM | Updated on Oct 31 2024 10:01 AM

'Amaran' Movie Twitter Review

వీర సైనికుడు ముకుంద్‌ వరదరాజన్‌ ఇతివృత్తంతో తెరకెక్కించిన చిత్రం అమరన్‌. కోలీవుడ్‌ నటుడు శివకార్తికేయన్‌, సాయి పల్లవి జోడిగా నటించిన ఈ సినిమా దీపావళి సందర్భంగా ప్రేక్షకులముందుకు వచ్చేసింది. రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వంలో రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌, సోని పిక్చర్స్‌ సంస్థలు కలసి నిర్మించిన ఈ చిత్రానికి జీవీ. ప్రకాశ్‌కుమార్‌ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్‌లతో పాటు ఇండియాలో కూడా ప్రీమియర్‌ షోలు వేశారు. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని ట్విట్టర్‌ వేదికగా పంచుకుంన్నారు.

ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా అంటేనే అందరిచూపు అటువైపే ఉంటుంది. అందుకే సినిమా అభిమానులు అందరూ అమరన్‌ సినిమావైపు పడింది.  శివ‌కార్తికేయ‌న్ ఆర్మీ మేజ‌ర్‌ పాత్ర‌లో అద‌ర‌గొట్టాడ‌ని నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి. ఇందు రెబెకా జాన్ పాత్ర‌లో సాయిప‌ల్ల‌వి నటన సినిమాకు బిగ్గెస్ట్ ప్ల‌స్‌పాయింట్‌ అని నెటిజ‌న్లు తెలుపుతున్నారు. మొదటి భాగంలో శివ‌కార్తికేయ‌న్‌, సాయిప‌ల్ల‌వి మధ్య వచ్చే ప్రతి సీన్‌ సూపర్‌ అంటూ మెంచుకుంటున్నారు.

ఈ సినిమా భారత ఆర్మీకి పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ అని ఒక నెటిజన్ ట్వీట్ చేశారు. దేశ సైనికుల ధైర్య సాహసాలను తెరపై చక్కగా దర్శకుడు ఆవిష్కరించారని కొనియాడారు. సినిమా చూస్తున్న ప్రతి భారతీయుడి గుండెల్లో దేశభక్తి కలిగించే చిత్రం అమరన్‌ అంటూ సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

ఓవర్సీస్‌, తమిళనాడులో చాలా చోట్ల 'అమరన్' సినిమాను ఒకరోజు ముందుగానే వేశారు. సినిమా బ్లాక్‌ బస్టర్‌ అంటూ చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ మూవీలో బ్లడ్ బాత్, ఆల్ఫా సన్నివేశాలు కిర్రాక్‌ అంటూ  ట్వీట్స్ చేస్తున్నారు.  'అమరన్'లో చాలా  సన్నివేశాలు ప్రేక్షకులకు  థ్రిల్ ఇస్తాయి. విజయ్ హీరోగా ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్‌ చేసిన 'తుపాకీ' సినిమాలో మెప్పించిన కొన్ని యాక్షన్ సీన్స్ లాంటివి ఇందులో కూడా ఉన్నాయంటూ హింట్‌ ఇస్తున్నారు. 

వార్‌ సీన్స్‌  కళ్లకు కట్టినట్లుగా దర్శకుడు చూపించాడని ప్రశంసలు వినిపిస్తున్నాయి. క్లైమాక్స్ ఎపిసోడ్ 15 నిమిషాల పాటు కన్నీళ్లను పెట్టిస్తుందని చాలామంది తెలుపుతున్నారు.  ఆ సీన్‌లో సాయిపల్లవి తన యాక్టింగ్‌తో ఇరగదీసిందని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement