తమిళ హీరో శివకార్తికేయన్ రాజ్‌కుమార్ పెరియసామి ’అమరన్’ తో ఒక్కసారిగా జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండియన్ ఆర్మీ రాజ్‌పుత్ రెజిమెంట్‌లో కమీషన్డ్ ఆఫీసర్‌గా ఉన్న మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కధగా తీసిన అమరన్ చిత్రం మంచి రివ్యూలను అందుకొని సూపర్‌హిట్‌గా నిలిచింది. దాంతో తమిళనాడులో మరో సూపర్ స్టార్ అవతరించినట్టేనని సినీ విశ్లేషకులు తీర్మానించేశారు. అందుకు తగ్గట్టే ఈ సినిమా తర్వాత శివకార్తికేయన్... అఖమురుగదాస్ వెంకట్ ప్రభు వంటి ప్రఖ్యాత దర్శకుల చిత్రాలకు సంతకం చేశాడు.
అలుపెరుగని యాత్ర...
ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా సినిమా ప్రపంచంలోకి ప్రవేశించిన శివకార్తికేయన్ సాధించిన విజయం...సాగించిన ప్రయాణం చాలా మందికి స్ఫూర్తి దాయకం. కాలేజీ రోజుల్లోనే స్టాండప్ కమెడియన్, మిమిక్రీ ఆర్టిస్ట్, షార్ట్ ఫిల్మ్ నటుడు..కూడా. ఆ తర్వాత తొలుత స్టార్ విజయ్ టీవీ వేదికగా.. 2011లో టీవీ షోలను హోస్ట్ చేయడం ద్వారా శివకార్తికేయన్ తన కెరీర్‌ను ప్రారంభించాడు నిదానంగా సినిమాల్లోకి వచ్చి మొదట్లో సహాయక పాత్రలను పోషించాడు, సినిమాల్లోకి వచ్చి పుష్కరకాలం పూర్తయిన తర్వాత గానీ అతనికి పెద్ద బ్రేక్ వచ్చిందని చెప్పాలి. ఈ నేపధ్యంలో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, శివకార్తికేయన్ మాట్లాడుతూ మూడేళ్ల క్రితం నటన నుంచి నిష్క్రమించాలని భావించినట్లు వెల్లడించాడు, అయితే తన భార్య ఆర్తి చెప్పిన స్ఫూర్తి దాయకమైన మాటలే తనని నటన కొనసాగించడానికి ప్రేరేపించాయంటూ చెప్పుకొచ్చాడు.
పరిశ్రమ మంచిదే...వ్యక్తులే....
సినిమా పరిశ్రమలో కొందరు వ్యక్తులతో తనకు సమస్యలు ఉన్నాయని ఒప్పుకున్నప్పటికీ, పరిశ్రమపై తనకు ఎటువంటి ఫిర్యాదులు లేవని శివకార్తికేయన్ స్పష్టం చేశాడు. ఆర్ధిక ఇబ్బందులతో సహా కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ.. తన నటనా ప్రయాణాన్ని కొనసాగించాలని నిశ్చయించుకున్నానన్నాడు. అయితే తన పోరాటాలు తన కుటుంబాన్ని ప్రభావితం చేయకూడదని ఎప్పుడూ కోరుకున్నానని, తన వారు సాధారణ జీవితాలను గడపాలని లక్ష్యంగా పెట్టుకున్నానన్నారు.
తన ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులతో భార్య, అత్తమామలు, పిల్లలపై భారం వేయకూడదని భావించానని చెప్పాడు. అయితే భార్య మాటలతో స్ఫూర్తి పొంది... అడ్డంకులను అధిగమించడానికి మార్గాలను అన్వేషించాలని నిర్ణయించుకున్నాడు. ఒక ఎంబిఎ గ్రాడ్యుయేట్ గా, అతను ఈ సవాళ్లను ఎలా అధిగమించాలో తెలుసుకోగలిగాడు.
కుమార్, చియాన్ తర్వాత నువ్వే...అన్న భార్య
ఇండస్ట్రీలో కొనసాగాలనే తన నిర్ణయంలో తన భార్య ఆర్తి ప్రోత్సాహం కీలక పాత్ర పోషించిందని ఈ అమరన్ హీరో వెల్లడించాడు. ‘ఇక్కడకి వచ్చేటప్పుము ’మీ దగ్గర ఏమీ లేదు, అయినా సరే మీరు ఇంత దూరం వచ్చారు. గత 20 ఏళ్లలో,కుమార్ (అజిత్) సార్ చియాన్ (విక్రమ్) సార్ తర్వాత, బయటి వ్యక్తి ఎవరూ ఈ పరిశ్రమలో పెద్దగా ఎదిగింది లేదు, కాని నువ్వు అది సాధించావ్. ’ఇది అంత తేలికైన పనిగా తీసిపారేయవద్దు.’మీ స్టార్‌డమ్ ప్రయోజనాలను మేం అనుభవిస్తున్నాం కాబట్టి,కొన్ని ప్రతికూల అంశాలను కూడా ఎదుర్కోగలం’’ అని తన భార్య చెప్పిందని ఆయన గుర్తు చేసుకున్నాడు.
సినీ పరిశ్రమలో తన ఎదుగుదల సమయంలో ఎదుర్కొన్న శత్రుత్వం సవాళ్ల గురించి కూడా శివకార్తికేయన్ చర్చించారు. ‘సామాన్యుడు‘ నుంచి విజయవంతమైన నటుడిగా తన ప్రయాణాన్ని కొందరు స్వాగతించగా, మరికొందరు బహిరంగంగా విమర్శించారని, పరిశ్రమలో అతని స్థానాన్ని ప్రశ్నిస్తూ వ్యాఖ్యలు చేశారని, గత ఐదేళ్లలో గణనీయమైన కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, ప్రయాణం కొనసాగించానని ఘర్షణ లేకుండా ముందుకు సాగాలని కోరుకున్నానన్నాడు..అయితే నేటి తన విజయం విమర్శకులకు ఖండన అనుకోనక్కర్లేదని, సహకరించిన కష్టపడి పనిచేసే తన చిత్ర బృందాలకుు, తన పట్ల అంకితభావంతో ఉన్న అభిమానులకు అతని కథ నుండి ప్రేరణ పొందిన వారికి వేడుకగా మాత్రమే అనుకోవాలని వినమ్రంగా చెబుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment