నటీనటులకు ఒక్కొక్కరికీ ఒక్కో స్టైల్ ఉంటుంది. ఎవరి అభిప్రాయాలు వారికీ ఉంటాయి. కొందరు లోప్రొఫైల్‌ను మెయింటెయిన్ చేస్తే, మరొకరు హై ప్రొఫైల్‌ను మెయిన్‌టెయిన్ చేస్తుంటారు. ఇకచాలా మంది హంగులు, ఆర్భాటాలు చేస్తుంటారు. మరి అలాంటి వారిలో నటి సాయిపల్లవి (Sai Pallavi) ఏ కోవకు చెందుతుందో చూద్దాం. ఈమె సహజత్వానికి ప్రాముఖ్యత ఇస్తారన్నది అందరికీ తెలిసిందే. అదే సాయిపల్లవి కెరీక్‌కు ప్లస్ అయ్యిందేమో. ప్రేమమ్(Premam) అనే మలయాళ చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చి. తొలి చిత్రంలోనే పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ను సొంతం చేసుకున్న తమిళ భామ ఈమె.
ఆ చిత్రం సాయిపల్లవిని సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్‌ను చేసిందనే చెప్పాలి. ఆ తరువాత తెలుగులో ఈమె నటించిన చిత్రాలు 90 శాతంకు పైగా సక్సెస్ అయ్యాయి. తమిళంలోనూ మంచి పేరు తెచ్చుకుంది. కాగా తాజాగా తెలుగులో నటుడు నాగచైతన్య సరసన నటిస్తున్న తండేల్ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఇకపోతే తమిళంలో శివకార్తికేయన్‌కు జంటగా నటించిన అమరన్(Amaran) చిత్రం సంచన విజయాన్ని సాధించడంతో పాటూ సాయిపల్లవి నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి. కాగా తాజాగా రామాయణం చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది.
మంచి కథ అయితేనే నటించడానికి అంగీకరిస్తున్న సాయిపల్లవి ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ ప్రతి వారికి నచ్చేవి, నచ్చని విషయాలు ఉండటం సహజం అని చెప్పింది. కొన్ని భయాలు కూడా మనల్ని వెంటాడుతుంటాయని అంది. తనకు ఫొటోలు తీయడం అస్సలు నచ్చదని చెప్పింది. బయటకు వెళ్లినప్పుడు కొందరు సడన్‌గా సెల్‌ఫోన్‌లో తనను ఫొటోలు తీస్తుంటారని, అలాంటివి తనకు నచ్చవని చెప్పింది. అలాంటప్పుడు తాను చెట్టునో, సుందరమైన భవనాన్నో కాదనీ, జీవం ఉన్న మనిషిని కథా అని అనిపిస్తుందన్నారు. మీమ్మల్ని ఒక్క ఫొటో తీసుకోవచ్చా? అని అడిగి తీసుకుంటే ఎంత భాగుంటుందీ అని పేర్కొంది.
తన చుట్టూ చాలా మంచి ఉన్నప్పుడు లేదా అందరూ తననే చూస్తున్నప్పుడు కొంచెం భయంగానూ, కొంచెం బిడియంగానూ ఉంటుందని చెప్పింది. అదేవిధంగా తనను అభినందించినా అలానే ఉంటుందని, వెంటనే ఒకటి, రెండు, మూడు అని అంకెలు లెక్క పెట్టుకుంటానని చెప్పింది. అంతేకాకుండా హద్దులు మీరిన ఆలోచనలు చేస్తానని అంది. ఆ అలవాటును మానకోవడానికి నిత్యం ధ్యానం చేస్తున్నాననీ, ఇకపోతే తాను చాలా తక్కువ స్థాయిలో మేకప్‌ను వేసుకుని సాంప్రదాయ బద్ధంగా ఉండాలని ఆశిస్తానని నటి సాయిపల్లవి చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment