
నెగటివ్ క్యారెక్టర్స్‌లో తనదైన విలనిజాన్ని పండించిన సోనూ సూద్ హీరోగా నటించిన బాలీవుడ్ చిత్రం 'ఫతే' సడెన్‌గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రానికి సోనూయే దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు.‘ఫతే’ మూవీకి రచయిత కూడా సోనూనే కావడం విశేషం. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌హీరోయిన్‌గా నటించింది. నసీరుద్దీన్ షా, విజయ్ రాజ్, నాగినీడు కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 10న థియేటర్స్‌లో ఈ మూవీ సందడి చేసింది.
సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఫతే చిత్రం సడెన్‌గా జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ప్రస్తుతం కేవలం హిందీ వర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, మరో వారంలోపు తెలుగు వర్షన్‌లో కూడా ఈ చిత్రం రానుందని తెలుస్తోంది. ఈ మూవీతోనే డైరెక్టర్‌గా అరంగేట్రం చేసిన సోనూ ప్రేక్షకులను మెప్పించాడు. సైబర్ క్రైమ్‌లో ఎదురయ్యే సవాళ్ల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సుమారు రూ. 50 కోట్ల బడ్జెట్‌తో ఫతే చిత్రాన్ని సోనూసూద్ భార్య సోనాలి సూద్ నిర్మించింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 30 కోట్ల లోపే కలెక్షన్స్ రాబట్టింది.

కథేంటి..?
సైబర్ నేరాలు ఎలా జరుగుతాయో ఈ చిత్రంలో చూపించారు. పంజాబ్‌లోని ఒక గ్రామంలో పాల వ్యాపారం చేస్తున్న ఫతేహ్ సింగ్ (సోనూసూద్) వద్ద పని చేసే వ్యక్తి లోన్ యాప్ నిర్వాహుకల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ సంఘటన ఫతేహ్‌లో తీవ్రమైన ఆవేదన ఏర్పడుతుంది. అతని ఆత్మహత్యకు కారణం లోన్ యాప్ అని తెలుసుకుని లోతుగా పరిశీలిస్తాడు. ఈ క్రమంలో ఇదే లోన్ యాప్ వల్ల చాలమంది మరణించారని తెలుసుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో తన ఇంట్లో నివసించే నిమ్రత్ కౌర్ (శివజ్యోతి రాజ్‌పుత్)ను ఓ సైబర్ క్రైమ్ ముఠా కిడ్నాప్ చేస్తుంది.
ఆమెను కాపాడే క్రమంలో ఫతేహ్‌కు అనేక సమస్యలు ఎదురౌతాయి. ఆమెను వారు ఎందుకు కిడ్నాప్ చేశారు..? ఆ లోన్ యాప్ సంస్థతో నిమ్రత్‌ను కిడ్నాప్ చేసిన ముఠాకు ఉన్న లింక్ ఏంటి..? పాల వ్యాపారం చేసే ఫతేహ్ గతమేంటి..? హ్యాకర్ ఖుషీతో (జాక్వెలైన్) ఫతేహ్‌కు ఉన్న సంబంధం ఏంటి..? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ చిత్రంలో మితిమీరిన హింస ఉంటుంది. సోనూసూద్ యాక్షన్ ఎపిసోడ్స్‌కు ఫిదా అవుతారు. ముఖ్యంగా సెకండాఫ్ బాగా నచ్చుతుంది.
Comments
Please login to add a commentAdd a comment