ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు ఉన్నారు. ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు చాలావరకు ఆచితూచి మాట్లాడుతుంటారు. కొందరు మాత్రం కనీసం ఏం మాట్లాడుతున్నామో అనే సోయి లేకుండా నోటికొచ్చినట్లు వాగుతుంటారు. ఇంకా చెప్పాలంటే వీళ్లకి కామన్ సెన్స్ ఉండదు. వయసులో పెద్దోళ్లే కానీ ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు. టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలు చేశాడు. రివ్యూ రైటర్లని దారుణంగా తిట్టాడు.
ఈ శుక్రవారం 'పొట్టేల్' సినిమా రిలీజైంది. 1980ల్లో తెలంగాణలోని పల్లెల్లో పటేళ్ల ఆగడాలు, మూఢ నమ్మకాలు, చదువు ప్రాముఖ్యం లాంటి అంశాలతో తెరకెక్కించారు. కాన్సెప్ట్ బాగున్నప్పటికీ కొన్ని సీన్లు సాగతీతగా అనిపించాయి. ఇదే విషయాన్ని పలువురు రివ్యూయర్లు వ్యక్తపరిచారు. శనివారం సక్సెస్ మీట్ జరగ్గా.. దర్శకుడు సాహిత్‌ని అదే మీడియా పలు ప్రశ్నలు అడిగితే వాటికి ఈయన ఓపిగ్గా సమాధానమిచ్చారు. ఇక్కడివరకు బాగానే ఉంది.
(ఇదీ చదవండి: స్టార్ హీరోతో నిశ్చితార్థం రూమర్స్.. హీరోయిన్ ప్రియాంక మోహన్ ఏమందంటే?)
సక్సెస్ మీట్ చివరలో అక్కడికి వచ్చిన నటుడు శ్రీకాంత్ అయ్యంగర్.. రివ్యూయర్లని దారుణమైన పదజాలంతో తిట్టాడు. 'డ్రాగ్డ్‌గా ఉందన‍్నారు. షార్ట్ ఫిల్మ్ తీయడం కూడా రాని నా కొడుకులు వచ్చి రివ్యూ రాస్తారు. సినిమా తీయడం ఎంత కష్టమో రఫ్ ఐడియా కూడా లేని నా కొడుకులు. ప్రజలున్నారు. ప్రేక్షక దేవుళ్లు ఉంటారు. సినిమాని ముందుకు తీసుకెళ్తారు. శ్రమించి, కష్టపడి, చెమటోడ్చి సినిమాలు తీస్తూనే ఉంటాం' అని అన్నాడు.
రివ్యూ వ్యక్తిగత అభిప్రాయం. డబ్బులు పెట్టి టికెట్ కొని చూసే ప్రతి ప్రేక్షకుడు రివ్యూయరే. సినిమా బాగుంటే బాగుందని చెబుతాడు. లేదంటే లేదని అంటాడు. సాగతీతగా అనిపిస్తే అదే బయటపెడతాడు. అలా కాదు మేం తీసింది కళాఖండం, మీకు బుర్రలేదు అని ఏకంగా రివ్యూయర్లనే తిడితే.. అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. శ్రీకాంత్ అయ్యంగర్ తీరు చూస్తే అలానే ఫీల్ అవుతున్నట్లు ఉన్నాడు. సినిమా తీసిన దర్శకుడే నీట్‌గా ఒక్కో ప్రశ్నకు సమాధానమిచ్చాడు. చివరలో పుడింగిలా వచ్చిన శ్రీకాంత్ అయ్యంగర్ మాత్రం నోటిదురుసుతో మాట్లాడాడు. దీనిబట్టి అర్థమైంది ఏంటంటే యాక్టింగ్ వస్తే సరిపోదు. మాట్లాడటం కూడా ఇతడికి రావాలేమో?
(ఇదీ చదవండి: సినిమా హిట్.. ఏడాది తర్వాత డైరెక్టర్‌కి మరో కారు గిఫ్ట్)
Comments
Please login to add a commentAdd a comment