Pottel Movie
-
అనన్య నాగళ్ల పొట్టేల్ మూవీ.. ఓటీటీల్లో సడన్ ఎంట్రీ!
అనన్య నాగళ్ల, యువ చంద్ర కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన రూరల్ యాక్షన్ డ్రామా పొట్టేల్. ఈ ఏడాది అక్టోబర్ 25న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ రెండు నెలలైనా ఇప్పటికీ ఓటీటీకి రాలేదు. దీంతో ఇంకెప్పుడొస్తుందా అని ఆడియన్స్ ఎదురు చూశారు.అయితే ఈ చిత్రం ఇవాళ ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేసింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఈ రోజు నుంచే పొట్టేల్ మూవీ రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్‌లోనూ అందుబాటులోకి వచ్చేసింది. ఈ చిత్రం విడుదలైన దాదాపు ఎనిమిది వారాల తర్వాత డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో అడుగుపెట్టింది.(ఇది చదవండి: Pottel Review: ‘పొట్టేల్’ మూవీ రివ్యూ)పొట్టేల్ సినిమాను తెలంగాణ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 1980ల కాలం నాటి పరిస్థితులు ఎలా ఉండేవో ఇందులో చూపించారు. తన కూతురిని చదివించాలని తపన పడే ఓ తండ్రి, బలి ఇవ్వాలనుకున్న గొర్రె తప్పిపోవడం లాంటి కథనంతో రూపొందించారు. ఈ చిత్రంలో అజయ్, నోయల్, శ్రీకాంత్ అయ్యంగార్, ప్రియాంక శర్మ, తనస్వి, చత్రపతి శేఖర్ కీలకపాత్రలు పోషించారు. -
మీడియాకు క్షమాపణలు చెప్పిన నటుడు శ్రీకాంత్!
టాలీవుడ్ ప్రముఖ నటుడు శ్రీకాంత్ అయ్యంగర్.. మీడియాకు క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమయ్యారు. రెండు రోజుల క్రితం 'పొట్టేల్' సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా రివ్యూ రైటర్లపై దారుణమైన కామెంట్స్ చేశాడు. ఇక్కడ రాయలేని బాషలో మాట్లాడాడు. దీంతో నోటికొచ్చినట్లు వాగిన శ్రీకాంత్‌పై డిజిటల్ మీడియా జర్నలిస్టుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.(ఇదీ చదవండి: శ్రీకాంత్ అయ్యంగర్.. ఏంటీ నోటి దురుసు?)తన వ్యాఖ్యలపై శ్రీకాంత్ అయ్యంగర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అప్పటివరకు ఇతడు నటించిన సినిమాల ప్రెస్ మీట్స్‌కి హాజరు కాకూడదని నిర్ణయం తీసుకుంది. దీంతో శ్రీకాంత్.. రివ్యూ రైటర్లకు సారీ చెప్పేందుకు ముందుకు వచ్చాడు. నా మాటలతో మీకు బాధ కలిగించాను. త్వరలోనే క్షమాపణ చెబుతా అని వీడియో రిలీజ్ చేశాడు.నోటికొచ్చిందల్లా వాగే శ్రీకాంత్.. సారీ చెబితే అయిపోయేదానికి త్వరలో చెబుతా అని అనడం చూస్తుంటే వైరల్ కావాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నాడా అనిపిస్తుంది. మరి త్వరలో సారీతో పాటు ఏం చెబుతాడో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)త్వరలోనే మీ అందరికీ క్షమాపణలు చెప్తాను - శ్రీకాంత్ అయ్యంగార్ pic.twitter.com/V4Y5NqsoMV— Rajesh Manne (@rajeshmanne1) October 27, 2024 -
శ్రీకాంత్ అయ్యంగర్.. ఏంటీ నోటి దురుసు?
ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు ఉన్నారు. ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు చాలావరకు ఆచితూచి మాట్లాడుతుంటారు. కొందరు మాత్రం కనీసం ఏం మాట్లాడుతున్నామో అనే సోయి లేకుండా నోటికొచ్చినట్లు వాగుతుంటారు. ఇంకా చెప్పాలంటే వీళ్లకి కామన్ సెన్స్ ఉండదు. వయసులో పెద్దోళ్లే కానీ ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు. టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలు చేశాడు. రివ్యూ రైటర్లని దారుణంగా తిట్టాడు.ఈ శుక్రవారం 'పొట్టేల్' సినిమా రిలీజైంది. 1980ల్లో తెలంగాణలోని పల్లెల్లో పటేళ్ల ఆగడాలు, మూఢ నమ్మకాలు, చదువు ప్రాముఖ్యం లాంటి అంశాలతో తెరకెక్కించారు. కాన్సెప్ట్ బాగున్నప్పటికీ కొన్ని సీన్లు సాగతీతగా అనిపించాయి. ఇదే విషయాన్ని పలువురు రివ్యూయర్లు వ్యక్తపరిచారు. శనివారం సక్సెస్ మీట్ జరగ్గా.. దర్శకుడు సాహిత్ని అదే మీడియా పలు ప్రశ్నలు అడిగితే వాటికి ఈయన ఓపిగ్గా సమాధానమిచ్చారు. ఇక్కడివరకు బాగానే ఉంది.(ఇదీ చదవండి: స్టార్ హీరోతో నిశ్చితార్థం రూమర్స్.. హీరోయిన్ ప్రియాంక మోహన్ ఏమందంటే?)సక్సెస్ మీట్ చివరలో అక్కడికి వచ్చిన నటుడు శ్రీకాంత్ అయ్యంగర్.. రివ్యూయర్లని దారుణమైన పదజాలంతో తిట్టాడు. 'డ్రాగ్డ్గా ఉందన్నారు. షార్ట్ ఫిల్మ్ తీయడం కూడా రాని నా కొడుకులు వచ్చి రివ్యూ రాస్తారు. సినిమా తీయడం ఎంత కష్టమో రఫ్ ఐడియా కూడా లేని నా కొడుకులు. ప్రజలున్నారు. ప్రేక్షక దేవుళ్లు ఉంటారు. సినిమాని ముందుకు తీసుకెళ్తారు. శ్రమించి, కష్టపడి, చెమటోడ్చి సినిమాలు తీస్తూనే ఉంటాం' అని అన్నాడు.రివ్యూ వ్యక్తిగత అభిప్రాయం. డబ్బులు పెట్టి టికెట్ కొని చూసే ప్రతి ప్రేక్షకుడు రివ్యూయరే. సినిమా బాగుంటే బాగుందని చెబుతాడు. లేదంటే లేదని అంటాడు. సాగతీతగా అనిపిస్తే అదే బయటపెడతాడు. అలా కాదు మేం తీసింది కళాఖండం, మీకు బుర్రలేదు అని ఏకంగా రివ్యూయర్లనే తిడితే.. అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. శ్రీకాంత్ అయ్యంగర్ తీరు చూస్తే అలానే ఫీల్ అవుతున్నట్లు ఉన్నాడు. సినిమా తీసిన దర్శకుడే నీట్‌గా ఒక్కో ప్రశ్నకు సమాధానమిచ్చాడు. చివరలో పుడింగిలా వచ్చిన శ్రీకాంత్ అయ్యంగర్ మాత్రం నోటిదురుసుతో మాట్లాడాడు. దీనిబట్టి అర్థమైంది ఏంటంటే యాక్టింగ్ వస్తే సరిపోదు. మాట్లాడటం కూడా ఇతడికి రావాలేమో?(ఇదీ చదవండి: సినిమా హిట్.. ఏడాది తర్వాత డైరెక్టర్‌కి మరో కారు గిఫ్ట్) -
Pottel Review: ‘పొట్టేల్’ మూవీ రివ్యూ
టైటిల్: పొట్టేల్నటీనటులు: యువచంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్, ప్రియాంక శర్మ, నోయల్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులునిర్మాణ సంస్థ: నిసా ఎంటర్టైన్మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్నిర్మాతలు: నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగెదర్శకత్వం: సాహిత్ మోత్కూరిసంగీతం: శేఖర్ చంద్రసినిమాటోగ్రఫీ: మోనిష్ భూపతి రాజుఈ మధ్యలో కాలంలో బాగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకున్న చిన్న సినిమా ‘పొట్టేల్’. పెద్ద మూవీ స్థాయిలో ప్రమోషన్స్ చేపట్టారు. దానికి తోడు ఓ ప్రెస్మీట్లో అనన్య నాగళ్లను ఓ లేడి రిపోర్టర్ అడిగిన ప్రశ్న వివాదాస్పదంగా మారడంతో ‘పొట్టేల్’మూవీ గురించి పెద్ద చర్చే జరిగింది. మొత్తంగా ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాల్లో ‘పొట్టేల్’పైనే కాస్త హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాలతో నేడు (అక్టోబర్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చిన పొట్టేల్ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..1970-80 మధ్యకాలంలో సాగే కథ ఇది. తెలంగాణ-మహారాష్ట్ర బార్డర్లో ఉన్న ఓ చిన్న పల్లెటూరు గుర్రంగట్టు. అక్కడ పటేళ్లదే రాజ్యం. ఆ ఊరిలో 12 ఏళ్లకు ఒక్కసారి బాలమ్మ జాతర నిర్వహిస్తారు. ఆ జాతరలో పొట్టేల్ని బలి ఇవ్వడం ఆనవాయితీ. అయితే వరుసగా రెండు సార్లు జాతర సమయానికి బలి ఇచ్చే పొట్టేల్ చనిపోవడంతో ఆ ఊర్లో కరువు తాండవిస్తుంది. అలాగే ప్రజలు అనారోగ్య బారిన పడి చనిపోతుంటారు. ఈసారి జాతరకు ఎలాగైనా పొట్టేల్ని బలి ఇవ్వాలని, దాని కాపాడాల్సిన బాధ్యతను గొర్రెల కాపరి పెద్ద గంగాధరి (యువచంద్ర కృష్ణ)కు అప్పగిస్తారు. పటేల్(అజయ్) చేసే మోసాలన్నీ గంగాధరికి తెలుసు. తన అవసరాల కోసమే బాలమ్మ సిగం(పూనకం రావడం) వచ్చినట్లు నటిస్తున్నాడని.. ఆయన మాటలు నమ్మొదని చెప్పినా ప్రజలెవరు పట్టించుకోరు. భార్య బుజ్జమ్మ(అనన్య నాగళ్ల) మాత్రం గంగాధరి మాటలను నమ్ముతుంది. పటేళ్ల పిల్లల మాదిరే తన కూతురు సరస్వతికి కూడా చదువు చెప్పించాలనుకుంటాడు. ఇది పటేల్‌కు నచ్చదు. దీంతో ఊరి బడి పంతులు(శ్రీకాంత్ అయ్యంగార్)ని బ్రతిమిలాడి కూతురికి రహస్యంగా చదువు చెప్పిస్తాడు. ఇంతలో ఊరి జాతర దగ్గర పడుతుందనగా బాలమ్మ పొట్టేల్ కనిపించకుండా పోతుంది. గాంగాధరి తప్పిదం వల్లే పొట్టేల్ పోయిందని.. దాని తీసుకురావాల్సిన బాధ్యత అతనిదే అని పటేల్ ఆదేశిస్తాడు. అంతేకాదు బాలమ్మ పూనినట్లు నటిస్తూ.. పొట్టేల్ని తీసుకురాకుంటే ఈసారి జాతరలో గంగాధరి కూతురు సరస్వతిని బలి ఇవ్వాలని చెబుతాడు. ఊరి జనాలు కూడా ఇది బాలమ్మ ఆదేశం అని నమ్ముతారు. అసలు పొట్టేల్ ఎలా మాయం అయింది? కూతురు ప్రాణాలను కాపాడుకోవడం కోసం గంగాధరి ఏం చేశాడు. చివరకు పొట్టేల్ దొరికిందా లేదా? పటేల్ నిజస్వరూపం తెలిసిన తర్వాత ఊరి జనాలు ఏం చేశారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే?ఎంత మంచి కథ అయినా సరే తెరపై ఆసక్తికరంగా చూపిస్తేనే విజయం సాధిస్తుంది. రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడు ఆ కథ గురించే ఆలోచించాలి. ఆ పాత్రలతో కనెక్ట్ కావాలి. ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేస్తూ ఇవ్వాలనుకున్న సందేశాన్ని ఇచ్చేయాలి. ఇదంతా జరగాలంటే కథతో పాటు కథనాన్ని బలంగా రాసుకోవాలి. కథ బాగుండి.. దాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించపోతే ఆశించిన స్థాయిలో ఫలితం ఉండదు. పొట్టేల్ విషయంలో అదే జరిగినట్లు అనిపిస్తుంది. దర్శకుడు రాసుకున్న కథ.. ఇవ్వాలనుకున్న సందేశం చాలా బాగుంది. కానీ దాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించడంలో కాస్త తడబడ్డాడు.పేరుకు ఇది చిన్న సినిమానే కానీ కథ మాత్రం చాలా పెద్దది. 1970-80 కాలంలో ఉన్న పటేళ్ల పెత్తనం, మూఢ నమ్మకాలు, సమాజంలో ఉన్న అసమానతలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూనే చదువు యొక్క గొప్పదనాన్ని తెలియజేశాడు. సినిమా ప్రారంభంలోనే చాలా పాత్రలను పరిచయం చేశాడు. పటేల్ వ్యవస్థ బలంగా మారడానికి గల కారణాన్ని చూపించాడు. అలాగే బాలమ్మ జాతర నేపథ్యాన్ని కూడా ఓ యానిమేషన్ సీన్‌తో వివరించాడు. ఆ తర్వాత బుజ్జమ్మ, గంగాధరి లవ్‌స్టోరీ మొదలవుతుంది. అయితే దర్శకుడు చెప్పాలనుకునే కథ పెద్దగా ఉండడంతో ప్రేమకథను త్వరగా ముగించి మళ్లీ అసలు కథను ప్రారంభించాడు. కూతురు చదవు కోసం హీరో పడే కష్టాలు ఎమోషనల్‌కు గురి చేస్తాయి. కథ ప్రారంభం నుంచి మొదటి 30 నిమిషాలు ఆసక్తికరంగా సాగుతుంది. ఫ్లాష్ బ్యాక్, ప్రజెంట్ నెరేషన్లో కథనాన్ని సాగిస్తూ ప్రేక్షకుడు కథపై శ్రద్ధ చూపించేలా చేశాడు. అయితే హీరోహీరోయిన్ల మధ్య లవ్‌స్టోరీతో పాటు మరికొన్ని సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో హింస ఎక్కువైనట్లు అనిపిస్తుంది. హీరో ప్రతిసారి పటేల్ చేతిలో దెబ్బలు తింటూనే ఉంటాడు. అలాగే కొన్ని చోట్ల లాజిక్ మిస్ అయినట్లు అనిపిస్తుంది. మరికొన్ని చోట్ల కథను సాగదీసినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ సన్నివేశాలు మాత్రం ఆకట్టుకుంటాయి. హింసను తగ్గించి, కథనాన్ని మరింత వేగవంతంగా నడిపించి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో నటించినవారంతా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. గొర్రెల కాపరి గంగాధరిగా యువచంద్ర కృష్ణ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్లలో బాగా నటించాడు. అనన్య నాగళ్ల పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది. సెకండాఫ్‌లో ఆమె పాత్ర నిడివి తక్కువనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో విలన్‌గా నటించిన అజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. పటెల్ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశాడు. తెరపై ఓ డిఫరెంట్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఆయన కెరీర్లో ఇది గుర్తుండిపోయే పాత్ర అవుతుంది. శ్రీకాంత్ అయ్యంగార్, నోయల్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. శేఖర్ చంద్ర నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. - రేటింగ్: 2.75/5 -
చాలా పెద్ద కథ అనిపించింది: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా
‘‘΄పొట్టేల్’ సినిమా చూశాను.. చాలా బాగా నచ్చింది. కథ విన్నాక ఇది చిన్న కథ కాదు చాలా పెద్ద కథ అనిపించింది. సాహిత్ ఇంత అద్భుతంగా తీస్తాడని ఊహించలేదు. నాకు చాలా పెద్ద బడ్జెట్ మూవీలా కనిపించింది. నిర్మాతలు చాలాఫ్యాషన్తో తీశారు. అజయ్, యువ, అనన్య, నోయల్, జీవా అందరూ సూపర్‌గా నటించారు. యువ దర్శకులు ఎవరూ ఇటీవల పూర్తి స్థాయి గ్రామీణ నేపథ్యంలో సినిమా చేయలేదనుకుంటున్నాను. ఆ నేపథ్యంలో ‘రంగస్థలం’ చిత్రం తర్వాత నేను చూసిన సినిమా ‘΄పొట్టేల్’. ఈ సినిమాని అందరూ ప్రోత్సహించాలి’’ అని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కోరారు. యువ చంద్రకృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘΄పొట్టేల్’. సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యువ చంద్రకృష్ణ మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారి స్ఫూర్తితో మొదలైన నా జర్నీ ఇక్కడ వరకూ వచ్చింది.‘΄పొట్టేల్’లో చాన్స్ ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఇటీవల ఏ సినిమాకీ ΄పొందని అనుభూతిని ప్రేక్షకులు మా ‘΄పొట్టేల్’తో ΄పొందుతారు’’ అని సాహిత్ చెప్పారు. ‘‘చదువు విలువ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో తీసిన సినిమా ఇది’’ అన్నారు సురేష్ కుమార్. ‘‘΄పొట్టేల్’ లాంటి సినిమా తీసిన నా ఫ్రెండ్ సాహిత్ పేరు చాలా కాలం గుర్తుండిపోతుంది’’ అన్నారు నిశాంక్ రెడ్డి. -
ఐదేళ్ల కష్టం వృథా అయ్యింది.. ‘కమిట్మెంట్’ ప్రశ్నపై స్పందించిన అనన్య
‘పొట్టేల్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల జరిగిన ప్రెస్ మీట్లో హీరోయిన్ అనన్య నాగళ్లకు చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. క్యాస్టింగ్ కౌచ్‌ని ప్రస్తావిస్తూ.. ‘అవకాశాల కోసం హీరోయిన్లు కమిట్మెంట్ ఇవ్వాలట కదా .. మీకు ఇలాంటి అనుభవం ఎదురైందా?’అని ఓ మహిళా జర్నలిస్ట్ అనన్యను ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు షాకైన అనన్య.. సున్నితంగా సమాధానం ఇచ్చి అక్కడితో ఆ ఇష్యూని ఆపేసింది. అయితే ఆ తర్వాత సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్ అయింది. చాలా మంది అనన్యకు మద్దతుగా నిలుస్తూ కామెంట్స్ పెడుతున్నారు.తాజాగా ఈ వైరల్ వీడియోపై అనన్య స్పందించింది. సంస్కారం ఉన్నవాళ్లు ఇలాంటి ప్రశ్నలు అడగరంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఓ ఇంటర్వ్యూలో అనన్య మాట్లాడుతు..‘ఇంత డైరెక్ట్‌గా అలాంటి ప్రశ్నలు ఎలా అడుగుతారని ఇంటికి వెళ్లాక ఆలోచించాను. సంస్కారం అనేది ఉంటే ఇలాంటి ప్రశ్నలు అడగరు. మీడియా వాళ్లు చాలా మంది నాకు కాల్ చేసి ఈ ఇష్యూ గురించి మాట్లాడుతూ..ఒక తెలుగమ్మాయిని అలా అడగడం బాధగా ఉందని చెప్పారు. వాళ్లు నా గురించి చెబుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఒక తెలుగమ్మాయిని వాళ్లు ఇంతలా సపోర్ట్ చేస్తుండడం సంతోషంగా ఉంది. నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనేది నా కల. దాని కోసం ఐదేళ్లుగా ఇంట్లో వాళ్లతో ఫైట్ చేస్తున్నా. కానీ ఆ ఒక్క ప్రశ్నతో నా ఐదేళ్ల కష్టం వృథా అయిందనిపించింది. నేను ఇప్పుడు సక్సెస్ అయినా.. కమిట్మెంట్కు అంగీకరించాను కాబట్టి సక్సెస్ అయ్యానని అందరూ అనుకుంటారు. ఇప్పుడు మళ్లీ బంధువులందరూ ఇదే విషయం మా అమ్మను అడుగుతారు. ఆ జర్నలిస్ట్ ప్రశ్న వేసినప్పుడు నాకు ఇన్ని ఆలోచనలు రాలేదు. ఆమెకు సంస్కారం లేదా? ఇలాంటి ప్రశ్న వేసిందనుకున్నా ఇంటికి వెళ్లాక దీని గురించి ఎంతో ఆలోచించా. ఇంకా నయం ఆ ప్రెస్ మీట్‌కి మా అమ్మను రమ్మని చెప్పారు. తనే రానని చెప్పింది. వచ్చి ఉంటే చాలా బాధపడేది’అని అనన్య అన్నారు. కాగా అనన్య, అజయ్ కీలక పాత్రల్లో నటించిన ‘పొట్టేల్’చిత్రం అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘పోటెల్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
అందుకు సంతోషంగా ఉంది: అనన్య నాగళ్ల
‘‘ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లకు సుదీర్ఘమైన ప్రయాణం ఉంటోంది. ఈషా రెబ్బా, చాందినీ చౌదరిలాంటి వారు ఎప్పట్నుంచో సినిమాలు చేస్తున్నారు. కొందరు హీరోయిన్లు టాప్ లీగ్‌లో ఉండి, కొంతకాలం తర్వాత వెళ్లిపోతున్నారు. కానీ, తెలుగువారికి మాత్రం కెరీర్ పరంగా ఎక్కువ కాలం ఉంటోంది. ఇందుకు సంతోషంగా ఉంది’’ అని హీరోయిన్ అనన్య నాగళ్ల అన్నారు. యువ చంద్రకృష్ణ, అనన్య నాగళ్ల జంటగా, అజయ్ కీలక ΄పాత్రలో నటించిన చిత్రం పొట్టేల్’. సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది.ఈ సందర్భంగా అనన్య నాగళ్ల మాట్లాడుతూ– ‘‘తమిళ, మలయాళ, కన్నడ పరిశ్రమల్లో అక్కడి స్థానిక హీరో యిన్లు 60–70 శాతం ఉంటే, మిగతావారు ఇతర పరిశ్రమలవారు ఉంటారు. కానీ మన దగ్గర 80 శాతం మంది ఇతర ఇండస్ట్రీ హీరోయిన్లు ఉన్నారు. కంటెంట్ బేస్డ్ చిన్న సినిమాలు, పరిమిత బడ్జెట్‌తో సినిమాలు చేసే దర్శక–నిర్మాతలు మాత్రమే తెలుగు హీరోయిన్లను ప్రిఫర్ చేస్తున్నారు.పొట్టేల్’ సినిమాలో బుజ్జమ్మ అనే బలమైన తల్లి ΄పాత్ర చేశాను. నటనకు అవకాశం ఉండి, నాకు నచ్చిన ΄పాత్రలు చేస్తున్నాను. తోటి హీరోయిన్లతో ΄పోటీ గురించి ఆలోచించే సమయం లేదు. నాకు ఓ మంచి కమర్షియల్ సక్సెస్ ఉండి ఉంటే నా కెరీర్ మరింత బాగుండేది. కోవిడ్ టైంలో నాకు పెద్దగా చాన్స్‌లు రాలేదు. ఉద్యోగాన్ని మానేసి ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానని అప్పుడు పశ్చాత్తాప పడ్డాను. ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, ‘కథకళి, లేచింది మహిళా లోకం’ సినిమాలు చేస్తున్నా’’ అన్నారు. -
అలాంటిపాత్రలు రెగ్యులర్‌గా రావు: అజయ్
‘‘విక్రమార్కుడు’ సినిమా తర్వాత ఆ స్థాయిలో విలన్ వేషాలు నాకు తక్కువగానే వచ్చి ఉంటాయి. అవి కూడా చాలా వరకు రాజమౌళిగారి సినిమాల్లోనే ఉన్నాయి. టిట్ల (‘విక్రమార్కుడు’లో అజయ్పాత్ర) లాంటి క్యారెక్టర్స్ రెగ్యులర్‌గా రావు. ఇక ‘΄పొట్టేల్’ సినిమాలో నేను చేసిన పటేల్ క్యారెక్టర్లో చాలా షేడ్స్ ఉన్నాయి. నటుడిగా సంతోషం ఇచ్చినపాత్ర ఇది’’ అని అజయ్ అన్నారు. యువ చంద్రకృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘΄పొట్టేల్’. సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న రిలీజ్ అవుతోంది.ఈ చిత్రంలో పవర్ఫుల్ రోల్ చేసిన అజయ్ మాట్లాడుతూ– ‘‘సాహిత్ చెప్పిన కథ, నాపాత్ర బాగా నచ్చాయి. పటేల్పాత్రని అద్భుతంగా చేయాలనిపించింది.పాప చదువు కోసం ΄ోరాటం చేసే నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. మూఢ నమ్మకాలు, వాటిని అడ్డం పెట్టుకుని బతికే మనుషులు, మొండితనం, గ్రామదేవతల గురించి ఈ సినిమా ఉంటుంది. ఇందులోని కొన్ని సన్నివేశాలకు ప్రేక్షకులు విజిల్స్ వేస్తారు. డైరెక్టర్స్ కొరటాల శివ, సందీప్ రెడ్డి వంగాగార్లకి ఈ సినిమా చూపించాను... వారికి బాగా నచ్చింది. ఇక హిందీలో అజయ్ దేవగన్గారితో ‘సింగం ఎగైన్’ చేశాను. ‘పుష్ప–2 ది రూల్’ చేస్తున్నాను. అలాగే తమిళ, మలయాళ సినిమాలు కూడా చేస్తున్నాను’’ అన్నారు. -
పొట్టేల్ రియల్‌పాన్ ఇండియన్ మూవీ: సంయుక్తా మీనన్
‘‘పొట్టేల్’ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. ఈ కథ మీద డైరెక్టర్ సాహిత్ నాలుగేళ్లు పని చేయడం మామూలు విషయం కాదు. మంచి రైటింగ్, డైరెక్షన్ ఉంటేనే ఇంత అద్భుతమైన సినిమా తెరపైకి వస్తుంది. ఈ ట్రైలర్లో ఫస్ట్ షాట్ చూసినప్పుడు ఒక రియల్‌పాన్ ఇండియన్ ఫిల్మ్‌లా అనిపించింది’’ అని హీరోయిన్ సంయుక్తా మీనన్ అన్నారు. యువ చంద్రకృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్‌లో అజయ్ కీలకపాత్రలో నటించిన రూరల్ యాక్షన్ డ్రామా ‘పొట్టేల్’. సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించారు. నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన సంయుక్తా మీనన్ మాట్లాడుతూ– ‘‘నిశాంక్గారు ఈ సినిమా గురించి చెప్పినప్పుడు చాలా ΄ప్యాషన్నేట్ ప్రోడ్యూసర్ అనిపించింది. ఇలాంటి ΄ప్యాషన్ ఉన్న నిర్మాతలు పరిశ్రమకి కావాలి’’ అన్నారు. అనన్య నాగళ్ల మాట్లాడుతూ– ‘‘ట్రైలర్లో చూసింది ఒక శాతం మాత్రమే. ఈ చిత్రంలో గొప్ప కథ ఉంది’’ అని చెప్పారు. ‘‘చాలా ప్రేమించి ఈ చిత్రం చేశాం’’ అన్నారు యువ చంద్రకృష్ణ. ‘‘ప్రేక్షకుల స్పందన కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను’’ అని సాహిత్ మోత్కూరి పేర్కొన్నారు. ‘‘మంచి కంటెంట్‌తో నిర్మించిన ఈ చిత్రం పెద్ద సౌండ్ చేయబోతోంది. సాహిత్ అద్భుతంగా తీశాడు’’ అని నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే తెలిపారు. -
టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్.. అనన్య నాగళ్ల ఏమన్నారంటే?
అనన్య నాగళ్ల ప్రస్తుతం పొట్టేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తంత్ర, డార్లింగ్ సినిమాలతో అలరించిన అనన్య మరోసారి అభిమానులను అలరించనుంది. సాహిత్ మోతూకూరి డైరెక్షన్లో వస్తోన్న పొట్టేల్ మూవీలో అనన్య లీడ్ రోల్లో కనిపించనుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు.అయితే ఈవెంట్‌కు హాజరైన అనన్య నాగళ్లకు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఓ జర్నలిస్ట్ క్యాస్టింగ్ కౌచ్ గురించి అడిగింది. తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావాలంటే భయపడతారు? ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వాలంటే కమిట్మెంట్ అడుగుతారని టాక్ ఉంది.. మీకు ఇలాంటి అనుభవం ఎదురైందా? అని అనన్యను ప్రశ్నించింది.(ఇది చదవండి: అనన్య నాగళ్ల పొట్టేల్.. ట్రైలర్ వచ్చేసింది!)దీనిపై అనన్య మాట్లాడుతూ..'నాకైతే ఇలాంటి అనుభవం ఎదురుకాలేదు. మీరు తెలుసుకోకుండా వందశాతం ఉంటుందని ఎలా చెబుతున్నారు. ఇండస్ట్రీలో అలా జరుగుతుంది అని చెప్పడం వందశాతం తప్పు. అవకాశం రావడం కంటే ముందే కమిట్మెంట్ అనేది టాలీవుడ్లో లేదు. ఎక్కడైనా పాజిటివ్, నెగెటివ్ అనేది సమానంగా ఉంటాయి. మీకు అనుభవం లేకపోయినా ఎలా అడుగుతున్నారు.. నటిగా నేను చెబుతున్నా క్యాస్టింగ్ కౌచ్ పరిస్థితులైతే ఇండస్ట్రీలో లేవు' అని అన్నారు. కాగా.. అనన్య నటించిన పొట్టేల్ సినిమా ఈనెల 25న థియేటర్లలో సందడి చేయనుంది. కాస్టింగ్ కౌచ్ గురించి జర్నలిస్ట్ నోరు మూయించిన అనన్య 💥#AnanyaNagalla #Pottel #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/3hlxsVeu4c— Telugu FilmNagar (@telugufilmnagar) October 18, 2024 -
అనన్య నాగళ్ల పొట్టేల్.. ట్రైలర్ వచ్చేసింది!
అనన్య నాగళ్ల, యువచంద్ర కృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం పొట్టేల్. 1980లోని తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. బందం రేగడ్, సవారీ చిత్రాల ఫేమ్ సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మించారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే ఆ కాలంలో మూఢ నమ్మకాల నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కూతురికి చదివించాలని తండ్రిపడే తపన.. ఆ నాటి పరిస్థితులే కథాంశంగా తీసుకొస్తున్నట్లు అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రాన్ని నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా విడుదల చేస్తున్నారు. ఈనెల 25న థియేటర్లలో పొట్టేల్ సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీమందించారు. అజయ్, నోయెల్, ప్రియాంక శర్మ కీలక పాత్రలు పోషించారు. -
ఫ్లైట్‌లోనూ వదల్లేదు.. ఇలా కూడా చేస్తారా!
టాలీవుడ్ హీరోయిన్, తెలుగుమ్మాయి అనన్య నాగళ్ల వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఈ ఏడాదిలో ఇటీవలే తంత్ర, డార్లింగ్ లాంటి చిత్రాలతో ఫ్యాన్స్‌ను అలరించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పొట్టేల్ మూవీతో ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ చిత్రంలో యువ చంద్రకృష్ణ, అనన్య నాగళ్ల జంటగా నటిస్తున్నారు. సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రాన్ని నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ నిర్మించారు. కాగా.. పొట్టేల్ చిత్రాన్ని తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందించారు.అయితే ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మూవీ టీమ్. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో పొట్టేల్ చిత్రబృందం వచ్చినా ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఏకంగా వారు ప్రయాణించే ఫ్లైట్‌లోనే సినిమా ప్రమోషన్స్ నిర్వహించారు. ఫ్లైట్‌లో కూర్చుని ఉన్న ప్రయాణికులకు పొట్టేల్ మూవీ పోస్టర్లను అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'ఆడ చేస్తాం ఈడ చేస్తాం యాడైన చేస్తాం' అంటూ అనన్య నాగళ్ల వీడియోను ట్విటర్లో పంచుకుంది. కాగా.. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది.(ఇది చదవండి: ఎందుకింత నెగెటివిటీ?.. నెటిజన్స్‌పై మండిపడ్డ టాలీవుడ్ హీరోయిన్!)కాగా.. 2019లో విడుదలైన 'మల్లేశం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ, తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. ఆ తర్వాత పవన్ కల్యాణ్ చిత్రం 'వకీల్ సాబ్'తో మరింత ఫేమస్ అయింది. గతేడాది సమంత లీడ్ రోల్ పోషించిన శాకుంతల చిత్రంలోనూ అనన్య ఓ పాత్రలో అభిమానులను మెప్పించింది.ఆడ చేస్తాం ఈడ చేస్తాం యాడైన చేస్తాంPottel promotions in flight #ananyanagalla #pottelonoct25th pic.twitter.com/TwftS1dxBn— Ananya Nagalla (@AnanyaNagalla) October 17, 2024 -
దసరాకి పొట్టేల్
దసరాకి థియేటర్స్‌లోకి ‘పొట్టేల్’ రానుంది. యువ చంద్రకృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్‌లో సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పొట్టేల్’. నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె ఈ చిత్రాన్ని నిర్మించారు.గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని దసరా పండక్కి రిలీజ్ చేయనున్నట్లుగా గురువారం చిత్రయూనిట్ వెల్లడించింది. ‘‘పొట్టేల్’ సినిమా తెలంగాణ నేపథ్యంలో ఉంటుంది. దీంతో దసరాకు ఈ సినిమా రిలీజ్ అనేది అడ్వాంటేజ్ అవుతుందని ఆశిస్తున్నాం’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: మోనిష్ భూపతి రాజు.