అనన్య నాగళ్ల పొట్టేల్ మూవీ.. ఓటీటీల్లో సడన్ ఎంట్రీ! | Ananya Nagalla's Latest Movie Pottel Streaming On This OTTs | Sakshi
Sakshi News home page

Pottel Movie: అనన్య నాగళ్ల పొట్టేల్ మూవీ.. రెండు ఓటీటీల్లో సడన్ ఎంట్రీ!

Published Fri, Dec 20 2024 6:03 PM | Last Updated on Fri, Dec 20 2024 6:17 PM

Ananya Nagalla's Latest Movie Pottel Streaming On This OTTs

అనన్య నాగళ్ల, యువ చంద్ర కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన రూరల్‌ యాక్షన్‌ డ్రామా పొట్టేల్. ఈ ఏడాది అక్టోబర్ 25న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ రెండు నెలలైనా ఇప్పటికీ ఓటీటీకి రాలేదు. దీంతో ఇంకెప్పుడొస్తుందా అని ఆడియన్స్‌ ఎదురు చూశారు.

అయితే ఈ చిత్రం ఇవాళ ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేసింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈ రోజు నుంచే పొట్టేల్ మూవీ రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్‌లోనూ అందుబాటులోకి వచ్చేసింది. ఈ చిత్రం విడుదలైన దాదాపు ఎనిమిది వారాల తర్వాత డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో అడుగుపెట్టింది.

(ఇది చదవండి: Pottel Review: ‘పొట్టేల్‌’ మూవీ రివ్యూ)

పొట్టేల్ సినిమాను తెలంగాణ రూరల్ బ్యాక్‍డ్రాప్‍లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 1980ల కాలం నాటి పరిస్థితులు ఎలా ఉండేవో ఇందులో చూపించారు. తన కూతురిని చదివించాలని తపన పడే ఓ తండ్రి, బలి ఇవ్వాలనుకున్న గొర్రె తప్పిపోవడం లాంటి కథనంతో రూపొందించారు. ఈ  చిత్రంలో అజయ్, నోయల్, శ్రీకాంత్ అయ్యంగార్, ప్రియాంక శర్మ, తనస్వి, చత్రపతి శేఖర్ కీలకపాత్రలు పోషించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement