‘‘విక్రమార్కుడు’ సినిమా తర్వాత ఆ స్థాయిలో విలన్ వేషాలు నాకు తక్కువగానే వచ్చి ఉంటాయి. అవి కూడా చాలా వరకు రాజమౌళిగారి సినిమాల్లోనే ఉన్నాయి. టిట్ల (‘విక్రమార్కుడు’లో అజయ్‌పాత్ర) లాంటి క్యారెక్టర్స్ రెగ్యులర్‌గా రావు. ఇక ‘΄పొట్టేల్’ సినిమాలో నేను చేసిన పటేల్ క్యారెక్టర్‌లో చాలా షేడ్స్ ఉన్నాయి. నటుడిగా సంతోషం ఇచ్చినపాత్ర ఇది’’ అని అజయ్ అన్నారు. యువ చంద్రకృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘΄పొట్టేల్’. సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న రిలీజ్ అవుతోంది.
ఈ చిత్రంలో పవర్‌ఫుల్ రోల్ చేసిన అజయ్ మాట్లాడుతూ– ‘‘సాహిత్ చెప్పిన కథ, నాపాత్ర బాగా నచ్చాయి. పటేల్‌పాత్రని అద్భుతంగా చేయాలనిపించింది.పాప చదువు కోసం ΄ోరాటం చేసే నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. మూఢ నమ్మకాలు, వాటిని అడ్డం పెట్టుకుని బతికే మనుషులు, మొండితనం, గ్రామదేవతల గురించి ఈ సినిమా ఉంటుంది. ఇందులోని కొన్ని సన్నివేశాలకు ప్రేక్షకులు విజిల్స్ వేస్తారు. డైరెక్టర్స్ కొరటాల శివ, సందీప్ రెడ్డి వంగాగార్లకి ఈ సినిమా చూపించాను... వారికి బాగా నచ్చింది. ఇక హిందీలో అజయ్ దేవగన్‌గారితో ‘సింగం ఎగైన్’ చేశాను. ‘పుష్ప–2 ది రూల్’ చేస్తున్నాను. అలాగే తమిళ, మలయాళ సినిమాలు కూడా చేస్తున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment