
టాలీవుడ్ ప్రముఖ నటుడు శ్రీకాంత్ అయ్యంగర్.. మీడియాకు క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమయ్యారు. రెండు రోజుల క్రితం 'పొట్టేల్' సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా రివ్యూ రైటర్లపై దారుణమైన కామెంట్స్ చేశాడు. ఇక్కడ రాయలేని బాషలో మాట్లాడాడు. దీంతో నోటికొచ్చినట్లు వాగిన శ్రీకాంత్‌పై డిజిటల్ మీడియా జర్నలిస్టుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.
(ఇదీ చదవండి: శ్రీకాంత్ అయ్యంగర్.. ఏంటీ నోటి దురుసు?)
తన వ్యాఖ్యలపై శ్రీకాంత్ అయ్యంగర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అప్పటివరకు ఇతడు నటించిన సినిమాల ప్రెస్ మీట్స్‌కి హాజరు కాకూడదని నిర్ణయం తీసుకుంది. దీంతో శ్రీకాంత్.. రివ్యూ రైటర్లకు సారీ చెప్పేందుకు ముందుకు వచ్చాడు. నా మాటలతో మీకు బాధ కలిగించాను. త్వరలోనే క్షమాపణ చెబుతా అని వీడియో రిలీజ్ చేశాడు.
నోటికొచ్చిందల్లా వాగే శ్రీకాంత్.. సారీ చెబితే అయిపోయేదానికి త్వరలో చెబుతా అని అనడం చూస్తుంటే వైరల్ కావాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నాడా అనిపిస్తుంది. మరి త్వరలో సారీతో పాటు ఏం చెబుతాడో చూడాలి?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)
త్వరలోనే మీ అందరికీ క్షమాపణలు చెప్తాను - శ్రీకాంత్ అయ్యంగార్ pic.twitter.com/V4Y5NqsoMV
— Rajesh Manne (@rajeshmanne1) October 27, 2024