Srikanth Iyengar
-
‘ఉద్వేగం’ మూవీ రివ్యూ
టైటిల్: ఉద్వేగంనటీనటులు: త్రిగుణ్, దీప్సిక, శ్రీకాంత్ అయ్యంగార్, సురేష్, పరుచూరి గోపాలకృష్ణ, శివ కృష్ణ, అంజలి తదితరులు నిర్మాతలు: జి శంకర్, ఎల్ మధుదర్శకుడు: మహిపాల్ రెడ్డిసంగీతం: కార్తిక్ కొడగండ్లసినిమాటోగ్రఫీ: జి.వి. అజయ్ కుమార్ఎడిటర్: జశ్వీన్ ప్రభువిడుదల తేది: నవంబర్ 29, 2024కథేంటంటే..మహీంద్రా (త్రిగుణ్) ఓ లాయర్. క్రిమినల్ కేసులు వాధించడంలో దిట్ట. కేసులుంటే కోర్టుకు వెళ్లడం లేదంటే ప్రియురాలు అమ్ములు(దీప్సిక)తో గడపడం..ఇదే మహీంద్ర దినచర్య. ఇలా జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో , ఓ గ్యాంగ్ రేప్ కేసు మహీంద్రా దగ్గరకు వస్తుంది. మొదట ఈ కేసు వాదించేందుకు మహీంద్రా నిరాకరిస్తాడు. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల మళ్లీ ఈ కేసును టేకాప్ చేస్తాడు. ఆ కేసులో ఏ2 అయిన సంపత్ తరపున వాదించేందుకు మహీంద్రా రంగంలోకి దిగుతాడు. ప్రత్యర్థుల తరపున వాదించేందుకు సీనియర్ లాయర్ ప్రసాద్(శ్రీకాంత్ అయ్యంగార్) రంగంలోకి దిగుతాడు.ఈ గ్యాంగ్ రేప్ మహీంద్రా జీవితంలో ఎలాంటి మలుపులు తిప్పింది? ఈ కేసులో ఎవరు గెలిచారు? చివరకు ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.ఎలా ఉందంటే.. కోర్డు డ్రామా సినిమాలు ఇప్పటికే చాలా వచ్చాయి. అన్నింటిలోనూ హీరో అమ్మాయిల తరపున వాదిస్తుంటాడు. కానీ హీరో బాధిత అమ్మాయిల తరపున కాకుండా నిదింతుడి తరపున వాదించడం అనేది ఈ సినిమాలో కొత్త పాయింట్. దర్శకుడు ఇలాంటి పాయింట్ ఎంచుకోవడంలోనే సగం సక్సెస్ అయ్యాడని చెప్పాలి. అయితే కథను ప్రారంభించిన విధానం కాస్త నెమ్మదిగా ఉంటుంది. అసలు కథను ప్రారంభించడానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. హీరో చేతికి గ్యాంగ్ రేప్ కేసు వచ్చిన తర్వాత కథపై ఆసక్తి పెరుగుతుంది. కోర్టు రూమ్ సన్నివేశాలు, ట్విస్ట్ లు ఆకట్టుకున్నాయి. అదే సమయంలో కొన్ని సన్నివేశాలు మరీ సినిమాటిక్‌గా, వాస్తవికానికి చాలా దూరంగా ఉన్నట్లు అనిపిస్తాయి. శ్రీకాంత్ అయ్యంగార్, త్రిగుణ్ మధ్య వచ్చే సన్నివేశాలను మరింత బలంగా రాసుకొని ఉంటే బాగుండేది. నిడివి తక్కువగా ఉండడం సినిమాకు కలిసొచ్చిందనే చెప్పాలి. ఎవరెలా చేశారంటే..లాయర్ మహీంద్రగా త్రిగుణ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. దీప్సిక తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. త్రిగుణ్ గురువు పాత్రలో పరుచూరి గోపాలకృష్ణ ఎప్పటిలాగే తన మార్క్ చూపించారు. జడ్జిగా సీనియర్ నటుడు సురేష్ చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. ఇక లాయర్ ప్రసాద్‌గా శ్రీకాంత్ అయ్యంగార్ ఎప్పటిమాదిరి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సీనియర్ నటుడు శివకృష్ణ కూడా తాను పోషించిన పోలీస్ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. కార్తిక్ కొడగండ్ల సంగీతం బాగుంది. జి.వి. అజయ్ కుమార్ కెమెరా పనితనం పర్వాలేదు. ఎడిటర్ జశ్వీన్ ప్రభు తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. రేటింగ్: 2.25/5 -
మీడియాకు క్షమాపణలు చెప్పిన నటుడు శ్రీకాంత్!
టాలీవుడ్ ప్రముఖ నటుడు శ్రీకాంత్ అయ్యంగర్.. మీడియాకు క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమయ్యారు. రెండు రోజుల క్రితం 'పొట్టేల్' సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా రివ్యూ రైటర్లపై దారుణమైన కామెంట్స్ చేశాడు. ఇక్కడ రాయలేని బాషలో మాట్లాడాడు. దీంతో నోటికొచ్చినట్లు వాగిన శ్రీకాంత్‌పై డిజిటల్ మీడియా జర్నలిస్టుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.(ఇదీ చదవండి: శ్రీకాంత్ అయ్యంగర్.. ఏంటీ నోటి దురుసు?)తన వ్యాఖ్యలపై శ్రీకాంత్ అయ్యంగర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అప్పటివరకు ఇతడు నటించిన సినిమాల ప్రెస్ మీట్స్‌కి హాజరు కాకూడదని నిర్ణయం తీసుకుంది. దీంతో శ్రీకాంత్.. రివ్యూ రైటర్లకు సారీ చెప్పేందుకు ముందుకు వచ్చాడు. నా మాటలతో మీకు బాధ కలిగించాను. త్వరలోనే క్షమాపణ చెబుతా అని వీడియో రిలీజ్ చేశాడు.నోటికొచ్చిందల్లా వాగే శ్రీకాంత్.. సారీ చెబితే అయిపోయేదానికి త్వరలో చెబుతా అని అనడం చూస్తుంటే వైరల్ కావాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నాడా అనిపిస్తుంది. మరి త్వరలో సారీతో పాటు ఏం చెబుతాడో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)త్వరలోనే మీ అందరికీ క్షమాపణలు చెప్తాను - శ్రీకాంత్ అయ్యంగార్ pic.twitter.com/V4Y5NqsoMV— Rajesh Manne (@rajeshmanne1) October 27, 2024 -
శ్రీకాంత్ అయ్యంగర్.. ఏంటీ నోటి దురుసు?
ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు ఉన్నారు. ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు చాలావరకు ఆచితూచి మాట్లాడుతుంటారు. కొందరు మాత్రం కనీసం ఏం మాట్లాడుతున్నామో అనే సోయి లేకుండా నోటికొచ్చినట్లు వాగుతుంటారు. ఇంకా చెప్పాలంటే వీళ్లకి కామన్ సెన్స్ ఉండదు. వయసులో పెద్దోళ్లే కానీ ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు. టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలు చేశాడు. రివ్యూ రైటర్లని దారుణంగా తిట్టాడు.ఈ శుక్రవారం 'పొట్టేల్' సినిమా రిలీజైంది. 1980ల్లో తెలంగాణలోని పల్లెల్లో పటేళ్ల ఆగడాలు, మూఢ నమ్మకాలు, చదువు ప్రాముఖ్యం లాంటి అంశాలతో తెరకెక్కించారు. కాన్సెప్ట్ బాగున్నప్పటికీ కొన్ని సీన్లు సాగతీతగా అనిపించాయి. ఇదే విషయాన్ని పలువురు రివ్యూయర్లు వ్యక్తపరిచారు. శనివారం సక్సెస్ మీట్ జరగ్గా.. దర్శకుడు సాహిత్ని అదే మీడియా పలు ప్రశ్నలు అడిగితే వాటికి ఈయన ఓపిగ్గా సమాధానమిచ్చారు. ఇక్కడివరకు బాగానే ఉంది.(ఇదీ చదవండి: స్టార్ హీరోతో నిశ్చితార్థం రూమర్స్.. హీరోయిన్ ప్రియాంక మోహన్ ఏమందంటే?)సక్సెస్ మీట్ చివరలో అక్కడికి వచ్చిన నటుడు శ్రీకాంత్ అయ్యంగర్.. రివ్యూయర్లని దారుణమైన పదజాలంతో తిట్టాడు. 'డ్రాగ్డ్గా ఉందన్నారు. షార్ట్ ఫిల్మ్ తీయడం కూడా రాని నా కొడుకులు వచ్చి రివ్యూ రాస్తారు. సినిమా తీయడం ఎంత కష్టమో రఫ్ ఐడియా కూడా లేని నా కొడుకులు. ప్రజలున్నారు. ప్రేక్షక దేవుళ్లు ఉంటారు. సినిమాని ముందుకు తీసుకెళ్తారు. శ్రమించి, కష్టపడి, చెమటోడ్చి సినిమాలు తీస్తూనే ఉంటాం' అని అన్నాడు.రివ్యూ వ్యక్తిగత అభిప్రాయం. డబ్బులు పెట్టి టికెట్ కొని చూసే ప్రతి ప్రేక్షకుడు రివ్యూయరే. సినిమా బాగుంటే బాగుందని చెబుతాడు. లేదంటే లేదని అంటాడు. సాగతీతగా అనిపిస్తే అదే బయటపెడతాడు. అలా కాదు మేం తీసింది కళాఖండం, మీకు బుర్రలేదు అని ఏకంగా రివ్యూయర్లనే తిడితే.. అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. శ్రీకాంత్ అయ్యంగర్ తీరు చూస్తే అలానే ఫీల్ అవుతున్నట్లు ఉన్నాడు. సినిమా తీసిన దర్శకుడే నీట్‌గా ఒక్కో ప్రశ్నకు సమాధానమిచ్చాడు. చివరలో పుడింగిలా వచ్చిన శ్రీకాంత్ అయ్యంగర్ మాత్రం నోటిదురుసుతో మాట్లాడాడు. దీనిబట్టి అర్థమైంది ఏంటంటే యాక్టింగ్ వస్తే సరిపోదు. మాట్లాడటం కూడా ఇతడికి రావాలేమో?(ఇదీ చదవండి: సినిమా హిట్.. ఏడాది తర్వాత డైరెక్టర్‌కి మరో కారు గిఫ్ట్) -
సారంగదరియా సినిమా రివ్యూ
టైటిల్: ‘సారంగదరియా’నటీనటులు: రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని, మొయిన్ మొహమద్ ,మోహిత్ పేడాడ, నీల ప్రియా, కదంబరి కిరణ్ తదిరతులునిర్మాణ సంస్థ: సాయిజా క్రియేషన్స్నిర్మాతలు: ఉమాదేవి, శరత్ చంద్ర, చల్లపల్లిదర్శకత్వం: పద్మారావు అబ్బిశెట్టి(పండు)సంగీతం: ఎం. ఎబెనెజర్ పాల్సిసిమాటోగ్రఫీ: సిద్ధార్థ స్వయంభువిడుదల తేది: జూలై 11, 2024కథమిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన కృష్ణ కుమార్(రాజా రవీంద్ర) ఓ ప్రైవేట్ కాలేజీ లెక్చరర్‌గా పని చేస్తుంటాడు. అతనికి ఇద్దరు కుమారులు, ఓ కూతురు సంతానం. పెద్ద కొడుకు అర్జున్(మెయిన్ మొహమద్) తాగుడుకు బానిసవుతాడు. రోజూ మద్యం తాగుతూ బార్లో గొడవపడుతుంటాడు. చిన్నోడు సాయి (మోహిత్) అమ్మాయిల చుట్టూ తిరుగుతూ.. చివరకు తమ ఏరియాలోనే ఉండే కాలేజీ అమ్మాయి ఫాతిమా(మధులత)ను ప్రేమలోకి దింపి, రొమాంటిక్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటాడు. కూతురు అనుపమ(యశస్విని) మాత్రం బుద్ధిగా చదువుకుంటూ.. బయటి ప్రపంచానికి దూరంగా ఉంటుంది. అనుపమ అంటే అదే కాలేజీలో చదువుతున్న రాజ్(శివచందు)కి చాలా ఇష్టం. తన ప్రేమను అంగీకరించాలంటూ ఆమె చుట్టూ తిరుగుతుంటాడు. అనుపమ మాత్రం అతన్ని దూరం పెడుతుంది. మిస్ బ్యూటీ క్వీన్ కావాలనేది ఆమె లక్ష్యం. అయితే ఓ రోజు కృష్ణకుమార్ ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతుండగా.. రాజ్ తండ్రి(కదంబరి కిరణ్)వచ్చి గొడవ చేస్తాడు. దీంతో అనుపమకు సంబంధించిన ఓ పెద్ద రహస్యం బయట పడుతుంది. అదేంటి? కృష్ణకుమార్ సొంత ఊరిని వదిలి వచ్చి వేరే చోట బతకడానికి గల కారణం ఏంటి? రెస్టారెంట్ పెట్టి మంచి బిజినెస్ చేసే అర్జున్.. తాగుడుకు ఎందుకు బానిసగా మారాడు? ఫాతిమాతో ప్రేమాయణం.. సాయి జీవితాన్ని ఎలా మార్చేసింది? మిస్ బ్యూటీ క్వీన్ పోటీల్లో పాల్గొనే క్రమంలో అనుపమకు ఎదురైన సమస్యలు ఏంటి? తనకు తండ్రి కృష్ణ కుమార్ ఎలా సపోర్ట్‌గా నిలిచాడు? కృష్ణకుమార్ ఫ్యామిలీకి సమాజం నుంచి ఎదురైన సమస్యలేంటి? వాటిని అధిగమించి తన పిల్లలను ఎలా ప్రయోజకులుగా మార్చుకున్నాడు? అన్నదే మిగతా కథ.ఎలా ఉందంటే?ఇదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీ. ‘సమానత్వం’ అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రంలో డైరెక్టర్ పండు మధ్య తరగతి కుటుంబంలోని కష్టాలను కొత్త కోణంలో చూపించాడు. ఇందులో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సమస్యలు మాత్రమే కాదు.. కులమత ప్రస్తావన, లింగ మార్పిడి ప్రస్తావన కూడా ఉంది. ట్రాన్స్ ఉమెన్స్‌ని సమాజం ఎలా చూస్తుంది? సొంతవాళ్ల నుంచే వాళ్లకు ఎలాంటి అవమానాలు ఎదురవుతాయి? అనేది చూపిస్తూనే.. వారిని ఎంకరేజ్ చేస్తే ఎలా రాణించగలరో ఇందులో చూపించారు. ఓ వైపు భావోద్వేగాలకు ప్రాధాన్యమిస్తూనే.. మరోవైపు మంచి సందేశాన్ని అందించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ పండు. ఒకే సినిమా ద్వారా నాలుగైదు సందేశాత్మక కథలను చెప్పాడు. ఇలాంటి సబ్జెక్ట్‌ను డీల్ చేయడం మాములు విషయం కాదు. తొలి సినిమాతోనే మంచి సందేశం అందించిన డైరెక్టర్ని అభినందించాల్సిందే. కానీ ఇలాంటి సందేశాత్మక సినిమాలను ఎంకరేజ్ చేసేందుకు ఆడియన్స్ అంతగా ఆసక్తి చూపించరు. అటు సరదాగా, ఇటు కమర్షియల్‌గా చెబితేనే సినిమా చూస్తామంటున్నారు. దర్శకుడు పద్మారావు ఆ కోణంలో సినిమా తీయాలని ప్రయత్నించాడు కానీ పూర్తిగా సఫలం కాలేకపోయాడు.విశ్లేషణకృష్ణకుమార్ కుటుంబ సభ్యులందరి గురించి వివరంగా చెప్పడంతో మూవీ కొంత సాగదీసినట్లు అనిపిస్తుంది. అర్జున్ పాత్ర ఎమోషనల్‌గా ఉంటే సాయి పాత్ర టీనేజ్ కుర్రాళ్లకు కనెక్ట్ అయ్యేలా చిల్‌గా ఉంటుంది. ఫస్టాఫ్ ఓకే అనిపిస్తుంది. రెండో భాగంలో ఏమైనా మెరుపులు ఉంటాయా? అంటే అక్కడ తడబాటే ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి సీన్‌ను డీటెయిల్‌గా చెప్పేందుకు ప్రయత్నించడంతో బోర్ కొట్టిన ఫీలింగ్ వస్తుంది. వరుసగా కష్టాలు ఎదురవడంతో సినిమా చూసే ప్రేక్షకుడికి ఓరకమైన నిస్సహాయత అలుముకున్న భావన రాక మానదు. అను పాత్ర యాక్టివ్‌గా ఉంటుంది.'ఇక్కడ చెప్పిన పాఠాలకే పరీక్షలు పెడతాం. కానీ, జీవితం పరీక్షలు పెట్టి గుణపాఠాలు చెబుతుంది' అన్న డైలాగ్ అదిరిపోయింది. క్లైమాక్స్‌లో అను తండ్రి గురించి చెప్పే డైలాగ్స్‌కు విజిల్ వేయాల్సిందే! తన స్పీచ్.. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, వివక్ష గురించి చర్చించేలా చేస్తుంది. ఎక్కువ సాగదీత వల్లే సినిమాలో ఎమోషన్ ఆశించినంత పండలేదు.నటీనటులుకృష్ణ కుమార్‌గా రాజా రవీంద్ర బాగా యాక్ట్ చేశాడు. ఎప్పుడూ పాజిటివ్, నెగెటివ్ రోల్స్ చేసే ఆయనకు తొలిసారి పూర్తి స్థాయి ఎమోషనల్ పాత్ర దక్కింది. ఆ అవకాశాన్ని ఆయన పూర్తిగా వాడుకున్నాడు. ప్లేబాయ్ తరహా పాత్రలో సాయి మెప్పించాడు. అనుగా యశస్వి ఆకట్టుకుంది. అర్జున్ పాత్రలో మెయిన్ మొహమ్మద్ లీనమైపోయి నటించాడు. మిగతా పాత్రలు పర్వాలేదనిపించాయి. -
రివ్యూ రైటర్లపై శ్రీకాంత్ అయ్యంగార్ ఆగ్రహం
సినిమా రివ్యూ రైటర్లపై నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ ఫైర్ అయ్యారు. ఎవరైనా ఏదైనా సాధించి ఇంకొకడి గురించి రాస్తే బాగుంటుందని వ్యాఖ్యానించాడు. యంగ్ హీరో కార్తికేయ నటించిన తాజా చిత్రం బెదురులంక 2012. క్లాక్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి, పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. హీరో కార్తికేయతో పాటు సినిమా టీమ్ అంతా ఈ ప్రోగ్రామ్‌కి హాజరైంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ.. ‘చావు కబురు చల్లగా చిత్రంలో కార్తికేయతో నటించే అవకాశం లభించింది. సూపర్ స్టార్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చూడడానికి చాలా బాగుంటాడు. క్రమశిక్షణతో పనిచేస్తాడు. వీటన్నింటినీ మించి ఒక మంచి నటుడు. బెదురులంక 2012లో అద్భుతంగా నటించాడు. ఇక మా అన్నయ్య అజయ్ ఘోష్ ఫెర్ఫార్మెన్స్‌కి వచ్చేసరికి ఆయన తిమింగల స్వరూపం. ఆయన దగ్గరు నేర్చుకొని, ఆయనతో నటించే అవకాశం నాకు దక్కింది. తెర వెనుక ఎంత కష్టపడ్డాం అనేది జనాలకు తెలియదు, తెరపై ఆడేదే జనాలకు తెలుసు. రివ్యూస్, గివ్యూస్ రాస్తారులెండి.. మనమేదైనా పీకుడు పనిచేసి, సాధించి ఇంకొకడు గురించి రాస్తే ఫర్వాలేదు. కెమేరా వర్క్ రాదని ఎవడో రాస్తే మనం ఇక్కడ ఎందుకుంటాం? కాంతార అనే సినిమాకు ఒక్క రివ్యూ లేదు. జనాలు దాన్ని హిట్టు చేయలేదా? ప్రేక్షకులకు చెప్పనవసరం లేదు.. వాళ్లకు ఒక విషయం నచ్చితే వాళ్లే థియేటర్లకు వచ్చి ఆదరిస్తారు. వాళ్లకు నచ్చకపోతే పట్టించుకోరు’ అని శ్రీకాంత్ అయ్యంగార్ చెప్పుకొచ్చారు.