సినిమా రివ్యూ రైటర్లపై నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ ఫైర్ అయ్యారు. ఎవరైనా ఏదైనా సాధించి ఇంకొకడి గురించి రాస్తే బాగుంటుందని వ్యాఖ్యానించాడు. యంగ్ హీరో కార్తికేయ నటించిన తాజా చిత్రం బెదురులంక 2012. క్లాక్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి, పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. హీరో కార్తికేయతో పాటు సినిమా టీమ్ అంతా ఈ ప్రోగ్రామ్‌కి హాజరైంది.
ఈ సందర్భంగా శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ.. ‘చావు కబురు చల్లగా చిత్రంలో కార్తికేయతో నటించే అవకాశం లభించింది. సూపర్ స్టార్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చూడడానికి చాలా బాగుంటాడు. క్రమశిక్షణతో పనిచేస్తాడు. వీటన్నింటినీ మించి ఒక మంచి నటుడు. బెదురులంక 2012లో అద్భుతంగా నటించాడు. ఇక మా అన్నయ్య అజయ్ ఘోష్ ఫెర్ఫార్మెన్స్‌కి వచ్చేసరికి ఆయన తిమింగల స్వరూపం. ఆయన దగ్గరు నేర్చుకొని, ఆయనతో నటించే అవకాశం నాకు దక్కింది. తెర వెనుక ఎంత కష్టపడ్డాం అనేది జనాలకు తెలియదు, తెరపై ఆడేదే జనాలకు తెలుసు.
రివ్యూస్, గివ్యూస్ రాస్తారులెండి.. మనమేదైనా పీకుడు పనిచేసి, సాధించి ఇంకొకడు గురించి రాస్తే ఫర్వాలేదు. కెమేరా వర్క్ రాదని ఎవడో రాస్తే మనం ఇక్కడ ఎందుకుంటాం? కాంతార అనే సినిమాకు ఒక్క రివ్యూ లేదు. జనాలు దాన్ని హిట్టు చేయలేదా? ప్రేక్షకులకు చెప్పనవసరం లేదు.. వాళ్లకు ఒక విషయం నచ్చితే వాళ్లే థియేటర్లకు వచ్చి ఆదరిస్తారు. వాళ్లకు నచ్చకపోతే పట్టించుకోరు’ అని శ్రీకాంత్ అయ్యంగార్ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment