'బెదరులంక 2012' విజయం జీవితంలో నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఈ కథ విన్న తొలి రోజు నుంచి ఏది అయితే కథలో వర్కవుట్ అవుతుంది? ప్రేక్షకులకు నచ్చుతుంది? అనుకున్నానో... వాటికి మంచి పేరు వచ్చింది. సెకండాఫ్ అంతా నవ్వుతూ ఉన్నామని, చివరి 45 నిమిషాలు నవ్వుతూనే ఉన్నామని ముక్త కంఠంతో అందరూ చెబుతున్నారు. సీరియస్ విషయాన్ని వినోదంతో చెప్పడం ఇంతకు ముందు చూడలేదు. అటువంటి కొత్త ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరించినప్పుడు మనం తీసుకునే నిర్ణయాలపై మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది’అని హీరో కార్తికేయ అన్నారు.
(చదవండి: బెదురులంక 2012’మూవీ రివ్యూ)
కార్తికేయ, నేహాశెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ‘బెదురులంక 2012’.లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆగస్ట్ 25న విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ.. ‘నేను థియేటర్లకు వెళ్లాను. హౌస్ ఫుల్ కావడం చూసి సంతోషం వేసింది. దర్శకుడు ఇతనే అని క్లాక్స్ ని పరిచయం చేయగా... అందరూ క్లాప్స్ కొట్టారు. ఇప్పుడు మేం హ్యాపీగా ఉన్నాం. మా సినిమా ట్రైలర్ విడుదల చేసిన రామ్ చరణ్ గారి, సపోర్ట్‌గా నిలిచిన మెగా ప్యాన్స్‌కి థ్యాంక్స్’ అని అన్నారు.
‘'బెదురులంక 2012'లో సెకండాఫ్ బావుందని, నవ్వుతున్నారని అంతా చెబుతున్నారు. ఈ విజయం వెనుక టెక్నీషియన్లు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా థాంక్స్. ఇప్పుడు స్క్రీన్స్ పెంచుతున్నారని చెబుతున్నారు. మా సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను’అని దర్శకుడు క్లాక్స్ అన్నారు. మా సినిమాను ఇంత పెద్ద హిట్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు’అని నిర్మాత బెన్నీ ముప్పానేని అన్నారు. ఈ సక్సెస్ మీట్‌లో నటులు శ్రీకాంత్ అయ్యంగార్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, ఆటో రామ్ ప్రసాద్‌తో పాటు చిత్రబృందంలోని కీలక సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment