మరోసారి ఆర్టీసీ బస్సులో 'తండేల్‌'.. వివరాలు షేర్‌ చేసిన నిర్మాత | Thandel Movie Again Telecasted In APSRTC Bus, Bunny Vas Shared Video With Details Goes Viral | Sakshi
Sakshi News home page

మరోసారి ఆర్టీసీ బస్సులో 'తండేల్‌'.. వివరాలు షేర్‌ చేసిన నిర్మాత

Published Wed, Feb 12 2025 9:05 AM | Last Updated on Wed, Feb 12 2025 10:37 AM

Thandel Movie Again Telecast APSRTC Bus

నాగచైతన్య కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన తండేల్‌ సినిమాను పైరసీ వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే నిర్మాతలు బన్నీ వాసు, అల్లు అరవింద్‌ చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేశారు. కొద్దిరోజుల క్రితమే  పలాస నుంచి విజయవాడ వెళ్లిన ఆర్టీసీ బస్సులో ఈ సినిమాను  ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో చిత్ర యూనిట్‌ ఫైర్‌ అయింది. అయితే, తాజాగా మరోసారి ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులోనే ఈ సినిమాను ప్రదర్శించడంతో ఆ వార్త నెట్టింట వైరల్‌ అయింది. దీనిపై నిర్మాత బన్ని వాసు తన సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు.

ఫిబ్రవరి 11న విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్లే బస్సులో తండేల్‌ సినిమాను ప్రదర్శించినట్లు బన్నీ వాసు తెలిపారు. ఆ బస్సుకు సంబంధించిన వివరాలు  (AP 39 WB. 5566) షేర్‌ చేశారు. రెండోసారి ఏపీఎస్‌ ఆర్టీసీలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో అక్కినేని ఫ్యాన్స్‌ కూడా ఫైర్‌ అవుతున్నారు. ఏపీఎస్‌ ఆర్టీసీ ఛైర్మన్‌ ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని బన్నీ వాసు కోరారు. 'మా సినిమా పైరసీని రెండోసారి ప్రదర్శించారు. ఎంతో కష్టపడి సినిమా తీశాం. ఇలాంటి పనుల వల్ల చిత్ర పరిశ్రమకు నష్టం జరుగుతుంది. ఎంతోమంది క్రియేటర్స్‌ శ్రమను అగౌరవపరచడమే అవుతుంది.'  అని  వాసు పేర్కొన్నారు.

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తండేల్‌’(Thandel). అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్‌  అయింది. బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ రావడంతో సినిమా చూసేందుకు ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది. ఇలాంటి సమయంలో ఇలా పైరసీని ప్రొత్సాహిస్తే చిత్ర పరిశ్రమకు తీరని నష్టాన్ని తెచ్చినట్లు అవుతుందని చాలామందిలో అభిప్రాయం వ్యక్తమౌతుంది. సినిమా రిలీజైన రెండు రోజుల్లోనే పైరసీ ప్రింట్‌ బయటకు వస్తే సినిమా మనగుడ ఉండదని కూడా కొందరు హెచ్చరిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement