‘‘తండేల్’ మూవీ యాభై శాతం ఫిక్షన్ అయితే యాభై శాతం నాన్ ఫిక్షన్. రాజు, సత్య అనే ఫిక్షనల్ క్యారెక్టర్స్‌ని చందు అద్భుతంగా డిజైన్ చేశారు. మా సినిమా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే స్వచ్ఛమైన ప్రేమకథ. ఆ లవ్ స్టోరీ ద్వారా వాస్తవ ఘటనలను ప్రేక్షకులకు చూపిస్తున్నాం’’ అని నిర్మాత బన్నీ వాసు(Bunny Vasu) చెప్పారు. నాగచైతన్య, సాయి పల్లవి(sai Pallavi) జోడీగా నటించిన చిత్రం ‘తండేల్’(Thandel). చందు మొండేటి దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్‌పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా బన్నీ వాసు విలేకరులతో మాట్లాడుతూ–‘‘రచయిత కార్తీక్ రాసిన కథ నా క్లాస్ మేట్ భానుకి నచ్చింది. దీంతో కార్తీక్‌ని నా వద్దకు తీసుకొచ్చాడు.. నాకూ బాగా నచ్చడంతో కథ వినమని చందూగారికి చెప్పాను. ఆయనకి కూడా నచ్చడంతో చాలా పరిశోధన చేసి, పూర్తి కథని డెవలప్ చేశాం.
మత్సలేశ్యం అనే ఊరు ఆధారంగా తీసుకున్న కథ ‘తండేల్’. ఇక్కడి వారు గుజరాత్ పోర్ట్‌కి చేపల వేటకి వెళుతుంటారు. మెయిన్ లీడర్‌ని తండేల్ అంటారు. అలా మా మూవీకి ‘తండేల్’ టైటిల్ పెట్టాం. ఈ చిత్రంలో రాజు పాత్ర కోసం నాగచైతన్య మౌల్డ్ అయిన విధానం అద్భుతం.
ఈ చిత్రం కథ నాగార్జున గారికి బాగా నచ్చిందని చైతన్యగారు చెప్పారు. సాయి పల్లవి కూడా చైతన్యకి మ్యాచ్ అయ్యేలా నటించారు. ‘నమో నమశ్శివాయ..’ పాటలో చైతన్య, సాయి పల్లవి డ్యాన్స్ థియేటర్స్‌లో పూనకం తెప్పిస్తుంది. అరవింద్‌గారు ‘తండేల్’ చూసి, విజయంపై చాలా నమ్మకంగా ఉన్నారు. అందుకే ప్రమోషన్స్‌లో చాలా ఉత్సాహంగా, ఎంజాయ్‌మెంట్‌గా కనిపిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఇప్పటికే బ్లాక్ బస్టర్ అయింది. శ్యామ్‌దత్‌గారి విజువల్స్ అద్భుతంగా ఉంటాయి’’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment