
మహా శివరాత్రి సందర్భంగా తండేల్ నుంచి 'నమో నమః శివాయ' ఫుల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, సాయిపల్లవి లీడ్ రోల్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. శ్రీకాకుళం జిల్లా డి మత్స్యలేశం గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా దర్శకుడు చందూ మొండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమాలో ఎంతో ప్రత్యేకత కలిగి ఉన్న ఈ పాటను ఫుల్ వీడియో విడుదల చేయడంతో నెట్టింట వైరల్ అవుతుంది.
జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రచించిన ఈ సాంగ్‌ను అనురాగ్ కులకర్ణి, హరిప్రియ పాడారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాటని నృత్య దర్శకుడు శేఖర్ నేతృత్వంలో కొనసాగింది. నాగచైతన్య, సాయిపల్లవితోపాటు, వెయ్యి మందికిపైగా డ్యాన్సర్లతో ఈ సాంగ్‌ను తెరకెక్కించారు. దక్షిణ కాశీగా పేరు పొందిన పురాతన శివాలయం శ్రీకాకుళంలోని శ్రీ ముఖలింగం. ప్రతి ఏటా అక్కడ నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలను స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమాలో ఈ పాటను తెరకెక్కించారు. అందుకోసం భారీ సెట్స్‌తో వేసి ప్రేక్షకులకు చూపించారు.
Comments
Please login to add a commentAdd a comment