
ఈ వారం రెండు మూడు సినిమాలు రిలీజైతే.. వీటిలో నాని నిర్మించిన 'కోర్ట్' మూవీ విజేతగా నిలిచిందని చెప్పొచ్చు. ఎందుకంటే దిల్ రుబా, ఆఫీసర్ ఆన్ డ్యూటీ అనే చిత్రాలతో పాటు డిప్లమాట్ అనే హిందీ మూవీ వచ్చింది గానీ 'కోర్ట్'నే జనాలు ఇష్టపడ్డారు. అయితే ఈ సినిమాలో జాబిలి పాత్ర చేసిన అమ్మాయి మాత్రం ప్రేక్షకుల మనసులు దోచేసింది. ఇంతకీ ఎవరీ ఈమె? ఫ్యామిలీ డీటైల్స్ ఏంటి?
పోక్సో కేసు బ్యాక్ స్టోరీతో తీసిన సీరియస్ సినిమా 'కోర్ట్'. ఇందులో చందు-జాబిలి పాత్రల్లో హర్ష రోషన్, శ్రీదేవి నటించారు. మూవీలో నటించిన ప్రియదర్శి, శివాజీ, రోహిణి.. ఇలా అందరూ చాలా చిత్రాల్లో నటిస్తున్నారు కాబట్టి వాళ్లెవరో తెలుసు. కానీ జాబిలి పాత్ర చేసిన శ్రీదేవి ఎవరా అని నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు.
(ఇదీ చదవండి: నితిన్ వల్లే ఐటం సాంగ్ చేశా.. ఇప్పటికీ ఇబ్బందిగా అనిపిస్తుంది: గుత్తా జ్వాల)
శ్రీదేవి పూర్తిపేరు శ్రీదేవి ఆపళ్ల. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ ఈమె సొంతూరు. 'కోర్ట్' మూవీలో జాబిలి పాత్ర కోసం ఎవరు సెట్ అవుతారా అని డైరెక్టర్ రామ్ జగదీశ్ వెతుకుతున్న క్రమంలోనే ఈమె చేసిన ఓ ఇన్ స్టా రీల్ ని ఫ్రెండ్ చూపించాడు. దీంతో ఈమెనే జాబిలి అని ఫిక్సయ్యాడు. పిలిపించి ఆడిషన్ చేసి సెలెక్ట్ చేశారు.
తెలుగమ్మాయి అందున పాత్ర డిమాండ్ చేసిననట్లు టీనేజ్ అమ్మాయిగా ఆకట్టుకునేలా నటించింది శ్రీదేవి. అది సంగతి. ఇకపోతే 'కోర్ట్' మూవీకి తొలిరోజే రూ.8.10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. మూవీకి అయిన బడ్జెట్ తక్కువే. అలానే ఓటీటీ రైట్స్, ఆడియో రైట్స్ రూపంలో ఇప్పటికే లాభాలు వచ్చేశాయి. ఇప్పుడు వసూళ్లు చూస్తుంటే నాని పంట పండినట్లే అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: తమన్నా బ్రేకప్.. విడి విడిగా వచ్చారు.. విడిపోయినట్లేనా!)
Comments
Please login to add a commentAdd a comment