
చాలామంది హీరోలు సినిమాలు చేస్తుంటారు. కానీ ప్రేక్షకుల మనసులు గెలుచుకునేది మాత్రం కొందరే. ఇలా జరగాలంటే ఆడియెన్స్ పల్స్ తెలియాలి. ఈ విషయంలో మాత్రం నాని టాప్ లో ఉంటాడేమో! ఎందుకంటే వరసపెట్టి హిట్స్ కొడుతూనే ఉంటాడు.
(ఇదీ చదవండి: భార్య పుట్టినరోజు.. ఎన్టీఆర్ లవ్లీ పోస్ట్)
తాజాగా నిర్మాతగానూ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. రెండు వారాల క్రితం 'కోర్ట్' సినిమాని రిలీజ్ చేయగా.. దీనికి అద్భుతమైన ఆదరణ వచ్చింది. కోర్ట్ రూమ్ డ్రామా అయినప్పటికీ.. కంటెంట్ హిట్ అయింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల వసూళ్ల మార్క్ దాటేసింది. మరోవైపు ఓవర్సీస్ లోనూ మిలియన్ డాలర్ వసూళ్లు సొంతం చేసుకుంది.
ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ మార్క్ అనేది చాలామంది హీరోలకు కల. స్టార్ హీరోలు దీన్ని ఇప్పటికే అందుకున్నారు కానీ మిడ్ రేంజ్ హీరోలకు మాత్రం ఇది అందని ద్రాక్షలానే మిగిలిపోయింది. నాని మాత్రం హీరోగా ఇప్పటికే పలు చిత్రాలతో మిలియన్ డాలర్స్ సాధించగా.. ఇప్పుడు నిర్మాతగానూ 'కోర్ట్'తో ఆ ఘనత సొంతం చేసుకున్నాడు. స్టార్స్ లేకుండా తీసిన ఈ మూవీ మిలియన్ డాలర్ అందుకోవడం నానికి చాలా స్పెషల్ అని చెప్పొచ్చు.
(ఇదీ చదవండి: పరువు పోతుందని భయపడ్డాను.. ఒకప్పటి హీరోయిన్ సుహాసిని)

Sticky for cinema
Comments
Please login to add a commentAdd a comment