‘‘΄పొట్టేల్’ సినిమా చూశాను.. చాలా బాగా నచ్చింది. కథ విన్నాక ఇది చిన్న కథ కాదు చాలా పెద్ద కథ అనిపించింది. సాహిత్ ఇంత అద్భుతంగా తీస్తాడని ఊహించలేదు. నాకు చాలా పెద్ద బడ్జెట్ మూవీలా కనిపించింది. నిర్మాతలు చాలాఫ్యాషన్‌తో తీశారు. అజయ్, యువ, అనన్య, నోయల్, జీవా అందరూ సూపర్‌గా నటించారు. యువ దర్శకులు ఎవరూ ఇటీవల పూర్తి స్థాయి గ్రామీణ నేపథ్యంలో సినిమా చేయలేదనుకుంటున్నాను. ఆ నేపథ్యంలో ‘రంగస్థలం’ చిత్రం తర్వాత నేను చూసిన సినిమా ‘΄పొట్టేల్’. ఈ సినిమాని అందరూ ప్రోత్సహించాలి’’ అని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కోరారు.
యువ చంద్రకృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘΄పొట్టేల్’. సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యువ చంద్రకృష్ణ మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారి స్ఫూర్తితో మొదలైన నా జర్నీ ఇక్కడ వరకూ వచ్చింది.
‘΄పొట్టేల్’లో చాన్స్ ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఇటీవల ఏ సినిమాకీ ΄పొందని అనుభూతిని ప్రేక్షకులు మా ‘΄పొట్టేల్’తో ΄పొందుతారు’’ అని సాహిత్ చెప్పారు. ‘‘చదువు విలువ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో తీసిన సినిమా ఇది’’ అన్నారు సురేష్ కుమార్. ‘‘΄పొట్టేల్’ లాంటి సినిమా తీసిన నా ఫ్రెండ్ సాహిత్ పేరు చాలా కాలం గుర్తుండిపోతుంది’’ అన్నారు నిశాంక్ రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment