‘‘ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లకు సుదీర్ఘమైన ప్రయాణం ఉంటోంది. ఈషా రెబ్బా, చాందినీ చౌదరిలాంటి వారు ఎప్పట్నుంచో సినిమాలు చేస్తున్నారు. కొందరు హీరోయిన్లు టాప్ లీగ్‌లో ఉండి, కొంతకాలం తర్వాత వెళ్లిపోతున్నారు. కానీ, తెలుగువారికి మాత్రం కెరీర్ పరంగా ఎక్కువ కాలం ఉంటోంది. ఇందుకు సంతోషంగా ఉంది’’ అని హీరోయిన్ అనన్య నాగళ్ల అన్నారు. యువ చంద్రకృష్ణ, అనన్య నాగళ్ల జంటగా, అజయ్ కీలక ΄పాత్రలో నటించిన చిత్రం పొట్టేల్’. సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది.
ఈ సందర్భంగా అనన్య నాగళ్ల మాట్లాడుతూ– ‘‘తమిళ, మలయాళ, కన్నడ పరిశ్రమల్లో అక్కడి స్థానిక హీరో యిన్లు 60–70 శాతం ఉంటే, మిగతావారు ఇతర పరిశ్రమలవారు ఉంటారు. కానీ మన దగ్గర 80 శాతం మంది ఇతర ఇండస్ట్రీ హీరోయిన్లు ఉన్నారు. కంటెంట్ బేస్డ్ చిన్న సినిమాలు, పరిమిత బడ్జెట్‌తో సినిమాలు చేసే దర్శక–నిర్మాతలు మాత్రమే తెలుగు హీరోయిన్లను ప్రిఫర్ చేస్తున్నారు.
పొట్టేల్’ సినిమాలో బుజ్జమ్మ అనే బలమైన తల్లి ΄పాత్ర చేశాను. నటనకు అవకాశం ఉండి, నాకు నచ్చిన ΄పాత్రలు చేస్తున్నాను. తోటి హీరోయిన్లతో ΄పోటీ గురించి ఆలోచించే సమయం లేదు. నాకు ఓ మంచి కమర్షియల్ సక్సెస్ ఉండి ఉంటే నా కెరీర్ మరింత బాగుండేది. కోవిడ్ టైంలో నాకు పెద్దగా చాన్స్‌లు రాలేదు. ఉద్యోగాన్ని మానేసి ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానని అప్పుడు పశ్చాత్తాప పడ్డాను. ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, ‘కథకళి, లేచింది మహిళా లోకం’ సినిమాలు చేస్తున్నా’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment