అనన్య నాగళ్ల పొట్టేల్.. ట్రైలర్‌ వచ్చేసింది! | Ananya Nagalla Latest Movie Pottel Movie Trailer Out Now | Sakshi
Sakshi News home page

Pottel Movie Trailer: బిడ్డ కోసం తండ్రి పడే తపన.. ఎమోషనల్ ట్రైలర్‌ రిలీజ్!

Published Fri, Oct 18 2024 6:37 PM | Last Updated on Fri, Oct 18 2024 6:42 PM

Ananya Nagalla Latest Movie Pottel Movie Trailer Out Now

అనన్య నాగళ్ల, యువచంద్ర కృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం పొట్టేల్. 1980లోని తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. బందం రేగడ్‌, సవారీ చిత్రాల ఫేమ్‌ సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను నిశాంక్‌ రెడ్డి కుడితి, సురేష్‌ కుమార్‌ సడిగే నిర్మించారు.

తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే ఆ కాలంలో మూఢ నమ్మకాల నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కూతురికి చదివించాలని తండ్రిపడే తపన.. ఆ నాటి పరిస్థితులే కథాంశంగా తీసుకొస్తున్నట్లు ‍అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రాన్ని నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా విడుదల చేస్తున్నారు. ఈనెల 25న థియేటర్లలో పొట్టేల్ సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రానికి శేఖర్‌ చంద్ర సంగీమందించారు.  అజయ్, నోయెల్, ప్రియాంక శర్మ కీలక పాత్రలు పోషించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement