అనన్య నాగళ్ల ప్రస్తుతం పొట్టేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తంత్ర, డార్లింగ్ సినిమాలతో అలరించిన అనన్య మరోసారి అభిమానులను అలరించనుంది. సాహిత్ మోతూకూరి డైరెక్షన్‌లో వస్తోన్న పొట్టేల్ మూవీలో అనన్య లీడ్ రోల్‌లో కనిపించనుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు.
అయితే ఈవెంట్‌కు హాజరైన అనన్య నాగళ్లకు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఓ జర్నలిస్ట్ క్యాస్టింగ్ కౌచ్ గురించి అడిగింది. తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావాలంటే భయపడతారు? ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వాలంటే కమిట్‌మెంట్ అడుగుతారని టాక్ ఉంది.. మీకు ఇలాంటి అనుభవం ఎదురైందా? అని అనన్యను ప్రశ్నించింది.
(ఇది చదవండి: అనన్య నాగళ్ల పొట్టేల్.. ట్రైలర్ వచ్చేసింది!)
దీనిపై అనన్య మాట్లాడుతూ..'నాకైతే ఇలాంటి అనుభవం ఎదురుకాలేదు. మీరు తెలుసుకోకుండా వందశాతం ఉంటుందని ఎలా చెబుతున్నారు. ఇండస్ట్రీలో అలా జరుగుతుంది అని చెప్పడం వందశాతం తప్పు. అవకాశం రావడం కంటే ముందే కమిట్‌మెంట్ అనేది టాలీవుడ్‌లో లేదు. ఎక్కడైనా పాజిటివ్, నెగెటివ్ అనేది సమానంగా ఉంటాయి. మీకు అనుభవం లేకపోయినా ఎలా అడుగుతున్నారు.. నటిగా నేను చెబుతున్నా క్యాస్టింగ్ కౌచ్ పరిస్థితులైతే ఇండస్ట్రీలో లేవు' అని అన్నారు. కాగా.. అనన్య నటించిన పొట్టేల్ సినిమా ఈనెల 25న థియేటర్లలో సందడి చేయనుంది.
కాస్టింగ్ కౌచ్ గురించి జర్నలిస్ట్ నోరు మూయించిన అనన్య 💥#AnanyaNagalla #Pottel #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/3hlxsVeu4c
— Telugu FilmNagar (@telugufilmnagar) October 18, 2024
Comments
Please login to add a commentAdd a comment