కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఆర్. అజయ్ జ్ఞానముత్తు వివాహ బంధంలో అడుగుపెట్టాడు. తన చిరకాల ప్రేయసి షిమోనా రాజ్‌కుమార్‌తో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. వారి పెళ్లి వేడుకులో కేవలం ఇరువురి కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఎలాంటి ప్రచారం లేకుండా అతికొద్దిమంది సమక్షంలో ఘనంగా పెళ్లి జరిగింది. అయితే, ఆయన సతీమణి షిమోనా గురించి వివరాలు ప్రకటించలేదు. కొత్త దంపతులను స్టార్ హీరో విక్రమ్ ఆశీర్వదించారు.
విభిన్నమైన హారర్ థ్రిల్లర్ కథాంశంతో ప్రేక్షకుల్ని మెప్పించిన ‘డిమోంటి కాలనీ’ చిత్రానికి ఆర్.అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. 2015లో వచ్చిన ఈ చిత్రానికి కొనసాగింపుగా గతేడాదిలో ‘డిమోంటి కాలనీ-2’ కూడా విడుదలైంది. హారర్ థ్రిల్లర్ సినిమాలు బాగా ఇష్టపడే వారికి ఆయన పరిచయమేనని చెప్పవచ్చు. విక్రమ్(Vikram) కథా నాయకుడిగా జ్ఞానముత్తు(Ajay Gnanamuthu) తెరకెక్కించిన చిత్రం ‘కోబ్రా’. 2022లో విడుదలైన ఈ మూవీ కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయమే అందుకుంది. ఇందులో విక్రమ్ గెటప్పుల విషయంలో డైరెక్టర్ క్రియేట్ చేసిన విధానం ప్రేక్షకులను ఫిదా చేసింది.
(ఇదీ చదవండి: డబ్బుల కోసం కోర్టుకు వెళ్లిన నటుడు దర్శన్)
జ్ఞానముత్తు 2010లో షార్ట్ ఫిల్మ్ మేకింగ్ షో, నాలయ అయ్యకునార్ సీజన్-1 లో పోటీలో పాల్గొన్నాడు. అందులో ఫైనలిస్టులలో ఒకరిగా జ్ఞానముత్తు నిలవడంతో గుర్తింపు పొందాడు. తరువాత అతను ప్రముఖ దర్శకుడు మురుగదాస్ వద్ద సహాయ దర్శకుడిగా చేరాడు. 7th సెన్స్, తుపాకి, వంటి సూపర్ హిట్ చిత్రాలకు ఆయన పనిచేశాడు.
Comments
Please login to add a commentAdd a comment