గత ఏడాదిలో విడుదలైన రెండు సౌత్ ఇండియా సినిమాలకు అరుదైన గౌరవం దక్కింది. 2024లో తెలుగు సినిమా గామి, తమిళ మూవీ తంగలాన్ మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్‌డామ్ (International Film Festival Rotterdam) 2025కు ఈ రెండు చిత్రాలు అధికారికంగా ఎంపికయ్యాయి. ఈమేరకు అధికారికంగా ఇరు సినిమాల మేకర్స్ ప్రకటించారు. ఫిబ్రవరి 9వ తేదీ వరకూ జరగనున్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రాలను ప్రదర్శించనున్నారు. నెదర్లాండ్స్ వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో భారత సినిమాలకు చోటు దక్కడంతో నెట్టింటి ఫ్యాన్స్ అభినందనలు తెలుపుతున్నారు.
విశ్వక్ సేన్ (Vishwak sen), చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా విద్యాధర కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గామి’(Gaami). వి సెల్యూలాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దాదాపు ఆరేళ్లపాటు షూటింగ్ చేసి మరీ ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఇందులో విశ్వక్ సేన్ అఘోరాగా నటించడం విశేషం. టాక్ పరంగా పాజిటివ్ వచ్చినప్పటికీ డిఫరెంట్ మూవీస్ ఇష్టపడే ప్రేక్షకులు ఈ కథకు బాగా కనెక్ట్ అయ్యారు.
హరిద్వార్‌లో ఉండే అఘోరా శంకర్ (విశ్వక్ సేన్) వింత సమస్యతో బాధపడుతుంటాడు. దీంతో ఆ ప్రాంతం నుంచి నుంచి ఎక్కడికి వెళ్లడు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా శంకర్ తనున్న ప్రదేశాన్ని వీడి తన సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కుంటూ కాశీకి వెళతాడు. అక్కడ తన సమస్యకు పరిష్కారం దొరికే చోటు హిమాలయాలు అని తెలుస్తుంది. అక్కడ 36 ఏళ్లకు అరుదుగా దొరికే మాలి పత్రాలు కోసం శంకర్ అన్వేషిస్తూ బయలుదేరుతాడు. అదే సమయంలో అతనికి డాక్టర్ జాహ్నవి (చాందిని చౌదరి)తో పరిచయం అవుతుంది. వారిద్దరూ కలిసి చేసిన ప్రయాణంలో ఎదురైన చిక్కులు ఏంటి..? ఎన్నో ప్రమాదాలను దాటుకొని చివరకు వాళ్లు సాధించింది ఏంటి..? అనేదే గామి కథ. జీ5 ఓటీటీ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది.
తమిళ్ నుంచి తంగలాన్
తమిళ స్టార్ హీరో విక్రమ్, దర్శకుడు పా. రంజిత్ (Pa Ranjith) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం తంగలాన్ (Thangalaan). గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ విజయాన్ని నమోదుచేసింది. ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment