టాలీవుడ్ హీరోయిన్, తెలుగుమ్మాయి అనన్య నాగళ్ల వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఈ ఏడాదిలో ఇటీవలే తంత్ర, డార్లింగ్ లాంటి చిత్రాలతో ఫ్యాన్స్‌ను అలరించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పొట్టేల్ మూవీతో ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ చిత్రంలో యువ చంద్రకృష్ణ, అనన్య నాగళ్ల జంటగా నటిస్తున్నారు. సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రాన్ని నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ నిర్మించారు. కాగా.. పొట్టేల్ చిత్రాన్ని తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందించారు.
అయితే ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మూవీ టీమ్. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో పొట్టేల్ చిత్రబృందం వచ్చినా ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఏకంగా వారు ప్రయాణించే ఫ్లైట్‌లోనే సినిమా ప్రమోషన్స్ నిర్వహించారు. ఫ్లైట్‌లో కూర్చుని ఉన్న ప్రయాణికులకు పొట్టేల్ మూవీ పోస్టర్లను అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'ఆడ చేస్తాం ఈడ చేస్తాం యాడైన చేస్తాం' అంటూ అనన్య నాగళ్ల వీడియోను ట్విటర్‌లో పంచుకుంది. కాగా.. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది.
(ఇది చదవండి: ఎందుకింత నెగెటివిటీ?.. నెటిజన్స్‌పై మండిపడ్డ టాలీవుడ్ హీరోయిన్!)
కాగా.. 2019లో విడుదలైన 'మల్లేశం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ, తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. ఆ తర్వాత పవన్ కల్యాణ్ చిత్రం 'వకీల్ సాబ్'తో మరింత ఫేమస్ అయింది. గతేడాది సమంత లీడ్ రోల్ పోషించిన శాకుంతల చిత్రంలోనూ అనన్య ఓ పాత్రలో అభిమానులను మెప్పించింది.
ఆడ చేస్తాం ఈడ చేస్తాం యాడైన చేస్తాం
Pottel promotions in flight #ananyanagalla #pottelonoct25th pic.twitter.com/TwftS1dxBn— Ananya Nagalla (@AnanyaNagalla) October 17, 2024
Comments
Please login to add a commentAdd a comment