స్టార్ హీరోతో నిశ్చితార్థం రూమర్స్.. హీరోయిన్ ఏమందంటే? | Priyanka Mohan Reacts On Rumours About Her Engagement With Jayam Ravi, Photos Goes Viral| Sakshi
Sakshi News home page

Priyanka Mohan Engagement Rumours: టాలీవుడ్ నుంచి వరస కాల్స్.. నాకేం అర్థం కాలేదు

Oct 26 2024 11:56 AM | Updated on Oct 26 2024 12:35 PM

Priyanka Mohan Reacts Jayam Ravi Engagement Rumours

కొన్నిరోజుల క్రితం తమిళ హీరో జయం రవి విడాకులు తీసుకున్నాడు. తన ప్రమేయం లేకుండా ఇదంతా జరిగిపోయిందని ఇతడి భార్య ఆర్తి చెప్పుకొచ్చారు. ఇదలా ఉంచితే జయం రవి.. హీరోయిన్ ప్రియాంక మోహన్‌ని నిశ్చితార్థం చేసుకున్నాడనే రూమర్‌తో పాటు దండలతో ఉన్న ఫొటో కూడా వైరల్ అయింది. దీంతో అందరూ అది నిజమే అనుకున్నారు.

(ఇదీ చదవండి: సినిమా హిట్.. ఏడాది తర్వాత డైరెక్టర్‌కి మరో కారు గిఫ్ట్)

అయితే అది 'బ్రదర్' సినిమాలోనిది అని తేలింది. జయం రవి, ప్రియాంక మోహన్ జంటగా నటించిన ఈ తమిళ మూవీ.. దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ప్రియాంక.. ఎంగేజ్‌మెంట్ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చింది.

'జయం రవి, నేను కలిసి 'బ్రదర్' సినిమా చేశాం. ప్రమోషన్‌లో భాగంగా మూవీ టీమ్ ఓ ఫొటో రిలీజ్ చేసింది. అందులో మేమిద్దరం మెడలో దండలు వేసుకుని ఉంటాం. దీంతో వెంటనే వైరల్ అయిపోయింది. అది చూసి మేం నిజంగానే నిశ్చితార్థం చేసుకున్నామని చాలామంది అనుకున్నారు. షూటింగ్స్‌తో బిజీగా ఉండటం వల్ల ఇది నా దృష్టికి రాలేదు. ఆ ఫొటో నిజమే అనుకుని టాలీవుడ్ ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారు. ఏం జరిగిందో అర్థం కాలేదు. అసలు విషయం తెలిసి అది సినిమాలో స్టిల్ అని క్లారిటీ ఇచ్చా. రిలీజ్ చేయడానికి వేరే ఫొటో ఏం దొరకలేదా అని మూవీ టీమ్‌ని తిట్టుకున్నా' అని ప్రియాంక మోహన్ చెప్పుకొచ్చింది. 

ఈ సంఘటన తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని ప్రియాంక చెప్పింది. అయితే జయం రవి విడాకుల చర్చ ఓ వైపు నడుస్తుండగానే ఈ ఫొటో వైరల్ అవడం దీనికి కారణమైంది. ఏదైతేనేం మూవీ ప్రమోషన్‌కి ఇది కాస్తోకూస్తో పనికొచ్చినట్లు ఉంది. 

(ఇదీ చదవండి: నటుడిగా 50 ఏళ్లు పూర్తి.. చిరంజీవి స్పెషల్ పోస్ట్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement