సినిమా హిట్ అయితే ఆ ఆనందంలో నిర్మాతలు.. సదరు హీరో, దర్శకులకు బహుమతులు ఇవ్వడం సాధారణమైన విషయం. అయితే మూవీ రిలీజైన ఏడాది దాటిపోయిన తర్వాత కూడా కారు బహుమతిగా ఇచ్చే నిర్మాతలు ఉంటారా? అంటే టాలీవుడ్‌లో ఉన్నారనిపిస్తోంది. ఆయనే సాహు గారపాటి. తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడికి మరో కారు గిఫ్ట్‌గా ఇచ్చారు.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8 ఎలిమినేషన్ ఓటింగ్.. డేంజర్ జోన్‌లో ఇద్దరు!)
అనిల్ రావిపూడి గత సినిమా 'భగవంత్ కేసరి'. గతేడాది దసరాకు రిలీజైంది. మరీ అద్భుతం కానప్పటికీ ఓ మాదిరిగా ఆడింది. ఇందులో బాలయ్య-శ్రీలీల.. తండ్రి కూతురు పాత్రల్లో నటించారు. ఈ సినిమా సక్సెస్ అయిన సందర‍్భంగా అప్పట్లోనే నిర్మాత సాహు గారపాటి.. అనిల్‌కి టయోటా వెల్‌ఫైర్ కారు బహుమతిగా ఇచ్చారు.
తాజాగా ఇప్పుడు మళ్లీ అదే మోడల్ మరో కారుని గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మార్కెట్‌లో ఈ కారు ధర కోటిన్నర రూపాయలు పైనే. ఇకపోతే అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేశ్‌తో సినిమా చేస్తున్నాడు. దీనికి 'సంక్రాంతికి వస్తున్నాం' అనే టైటిల్ అనుకుంటున్నారు. పేరుకి తగ్గట్టే ఇది సంక్రాంతి పండగకి రిలీజ్ అనుకుంటున్నారు.
(ఇదీ చదవండి: ఓవైపు విడాకుల రూమర్స్.. 10 ఫ్లాట్స్ కొన్న బచ్చన్ ఫ్యామిలీ)
Comments
Please login to add a commentAdd a comment