బిగ్‌బాస్ 8 ఎలిమినేషన్ ఓటింగ్.. డేంజర్ జోన్‌లో ఇద్దరు! | Bigg Boss 8 Telugu 8th Week Elimination Details | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Telugu: ఆ ఇద్దరిలో ఒకరా లేదా వెళ్లేపోయేది ఆమెనా?

Oct 25 2024 11:07 AM | Updated on Oct 25 2024 11:25 AM

Bigg Boss 8 Telugu 8th Week Elimination Details

బిగ్‌బాస్ 8వ వారం కూడా చివరకొచ్చేసింది. ఈసారి ఆరుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. ఓజీ క్లాన్ నుంచి నిఖిల్, విష్ణుప్రియ, ప్రేరణ, పృథ్వీ.. రాయల్ క్లాన్ నుంచి నయని పావని, మెహబూబ్ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఎవరికి వాళ్లు గేమ్స్ పరంగా తమ బెస్ట్ ఇచ్చేందుకు చాలా ప్రయత్నిస్తున్నారు. కానీ డేంజర్ జోన్‌లో మాత్రం ఇద్దరు ఉన్నారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ కావొచ్చు?

లెక్క ప్రకారం ఈసారి ఏడుగురు నామినేట్ అయ్యారు. కానీ మెగా చీఫ్ గౌతమ్ తన సూపర్ పవర్ ఉపయోగించి, హరితేజ నుంచి తప్పించాడు. మిగిలిన వాళ్లలో నిఖిల్.. ఓటింగ్‌లో ఎప్పుడు అగ్రస్థానంలో ఉంటాడు. ఈసారి మాత్రం అతడిని ప్రేరణ దాటిపోయినట్లు కనిపిస్తుంది. చెప్పాలంటే విన్నర్ రేసులోనూ ఈమె ఉందని టాక్ నడుస్తోంది.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు)

ఓటింగ్ పరంగా చూసుకుంటే తొలి రెండు స్థానాల్లో ప్రేరణ, నిఖిల్ ఉండగా.. తర్వాతి స్థానాల్లో ప్రేమ పక్షులు పృథ్వీ, విష్ణుప్రియ ఉన్నారు. చివరి రెండు స్థానాల్లో మెహబూబ్, నయని ఉన్నారు. గేమ్స్ పరంగా మెహబూబ్ అంతంత మాత్రమే కనిపిస్తుండగా.. గొడవల్లో తప్పితే నయని ఎక్కడా కనిపించట్లేదు. అంతా చూస్తుంటే వీళ్లిద్దరిలో ఒకరు వెళ్లిపోవడం గ్యారంటీ అనిపిస్తుంది. మరోవైపు గంగవ్వని బయటకు పంపే సూచనలు కనిపిస్తున్నాయి.

అప్పుడెప్పుడో 2022లో చేసిన ఓ వీడియో కారణంగా గంగవ్వతో పాటు రాజు అనే యూట్యూబర్‌పై పోలీస్ కేసు నమోదైంది. దీని విచారణలో భాగంగా గంగవ్వని ఎలిమినేట్ చేసి బయటకు తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈసారి మాత్రం రాయల్ క్లాన్ నుంచి ఒకరు ఎలిమినేట్ కావడం పక్కా అనిపిస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి?

(ఇదీ చదవండి: 'నరుడి బ్రతుకు నటన' సినిమా రివ్యూ)

Advertisement
 
Advertisement
Advertisement