Bhagavanth Kesari Movie
-
విజయ్ చివరి సినిమా రీమేక్? ఉన్నదంతా కక్కేసిన నటుడు.. అనిల్ అసహనం
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్. దీనికంటే ముందు ఆయన భగవంత్ కేసరి సినిమా (Bhagavanth Kesari Movie) చేశాడు. దీనికి అనిల్ రావిపూడి డైరెక్టర్. ఈయన కామెడీని పక్కన పెట్టి మొదటిసారి ఎమోషనల్ డ్రామా పండిచే ప్రయత్నం చేశాడు. తొలి ప్రయత్నంలోనే సక్సెసయ్యాడు. 2023లో వచ్చిన భగవంత్ కేసరి బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది.ఒకే సినిమాను ఐదుసార్లు చూసిన విజయ్‌అయితే ఈ సినిమాపై తమిళ స్టార్ విజయ్ (Vijay) మనసు పారేసుకున్నాడట! ఒకటీరెండు సార్లు కాదు ఏకంగా ఐదుసార్లు చూశాడట! ఈ విషయాన్ని తమిళ నటుడు వీటీవీ గణేశ్.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈవెంట్లో వెల్లడించాడు. గతేడాది చెన్నైలో హీరోను విజయ్ను కలిశాను. నాకు అనిల్ రావిపూడి ఫ్రెండ్ అని విజయ్‌కు తెలుసు. తన చివరి సినిమాను అనిల్‌ను డైరెక్ట్ చేయమని అడిగాడు. కానీ అందుకు అనిల్ ఒప్పుకోలేదు. భగవంత్ కేసరి సినిమాను విజయ్ ఐదుసార్లు చూశాడు.పెద్ద డైరెక్టర్లు క్యూలో ఉన్నా..తనకు ఈ మూవీ చాలా బాగా నచ్చింది. తనకోసం తమిళంలో ఈ సినిమా తీస్తావా? అని అనిల్ రావిపూడి (Anil Ravipudi)ని పిలిచి అడిగాడు. కానీ అందుకు అనిల్ ఒప్పుకోలేదు. తాను రీమేక్ చేయనని ముఖం చెప్పి వచ్చేశాడు. నలుగురైదుగురు పెద్ద డైరెక్టర్లు విజయ్ చివరి సినిమా చేసేందుకు లైన్లో నిల్చుంటే అనిల్ మాత్రం చేయనని చెప్పి వచ్చేశాడు అని చెప్పుకొచ్చాడు. ఇంతలో అనిల్ రావిపూడి మధ్యలో కలుగజేసుకుంటూ సినిమానే చేయను అనలేదు, రీమేక్ చేయనన్నాను అని క్లారిటీ ఇచ్చాడు.అప్పుడు నేనూ చూశాగణేశ్ మళ్లీ మాట్లాడుతూ.. విజయ్ ఆ సినిమాను అయిదుసార్లు ఎందుకు చూశాడా? అని నేనూ భగవంత్ కేసరి చూశాను. అప్పుడు నాకు.. అనిల్ బానే తీశాడనిపించింది అని చెప్పుకొచ్చాడు. దీంతో విజయ్ చివరి సినిమా ఏదై ఉంటుందన్న చర్చ మొదలైంది. అనిల్ రావిపూడి వద్దన్నప్పటికీ మరో డైరెక్టర్‌తో భగవంత్ కేసరి రీమేక్ చేస్తాడా? లేదా? ఇంత మంచి ఆఫర్‌ను అనిల్ ఎందుకు వదులుకున్నాడు? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే విజయ్ 69 వ సినిమాయే చివరి చిత్రమని అందరూ భావిస్తున్నారు. దీని తర్వాత విజయ్ పూర్తిగా రాజకీయాలకే పరిమితం కానున్నాడు.చదవండి: గేమ్ ఛేంజర్‌కు ఊహించని కలెక్షన్స్ .. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే? -
సినిమా హిట్.. ఏడాది తర్వాత డైరెక్టర్‌కి మరో కారు గిఫ్ట్
సినిమా హిట్ అయితే ఆ ఆనందంలో నిర్మాతలు.. సదరు హీరో, దర్శకులకు బహుమతులు ఇవ్వడం సాధారణమైన విషయం. అయితే మూవీ రిలీజైన ఏడాది దాటిపోయిన తర్వాత కూడా కారు బహుమతిగా ఇచ్చే నిర్మాతలు ఉంటారా? అంటే టాలీవుడ్లో ఉన్నారనిపిస్తోంది. ఆయనే సాహు గారపాటి. తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడికి మరో కారు గిఫ్ట్‌గా ఇచ్చారు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8 ఎలిమినేషన్ ఓటింగ్.. డేంజర్ జోన్లో ఇద్దరు!)అనిల్ రావిపూడి గత సినిమా 'భగవంత్ కేసరి'. గతేడాది దసరాకు రిలీజైంది. మరీ అద్భుతం కానప్పటికీ ఓ మాదిరిగా ఆడింది. ఇందులో బాలయ్య-శ్రీలీల.. తండ్రి కూతురు పాత్రల్లో నటించారు. ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా అప్పట్లోనే నిర్మాత సాహు గారపాటి.. అనిల్‌కి టయోటా వెల్ఫైర్ కారు బహుమతిగా ఇచ్చారు.తాజాగా ఇప్పుడు మళ్లీ అదే మోడల్ మరో కారుని గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మార్కెట్లో ఈ కారు ధర కోటిన్నర రూపాయలు పైనే. ఇకపోతే అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేశ్‌తో సినిమా చేస్తున్నాడు. దీనికి 'సంక్రాంతికి వస్తున్నాం' అనే టైటిల్ అనుకుంటున్నారు. పేరుకి తగ్గట్టే ఇది సంక్రాంతి పండగకి రిలీజ్ అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఓవైపు విడాకుల రూమర్స్.. 10 ఫ్లాట్స్ కొన్న బచ్చన్ ఫ్యామిలీ) -
భగవంత్ కేసరి మూవీ సక్సెస్.. దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్!
నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల కీలక పాత్రలో కనిపించింది. దసరా కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. థియేటర్ల అలరించిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీకి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీకి దక్కుతున్న ఆదరణతో చిత్రబృందం సంతోషంలో మునిగిపోయింది. తాజాగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ దర్శకుడికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. సినిమా సూపర్ హిట్ కావడంతో దర్శకుడు అనిల్ రావిపూడికి ఖరీదైన టొయోటా కారును బహుమతిగా అందించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ విషయాన్ని నిర్మాణసంస్థ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. #BhagavanthKesari Producers @Shine_Screens gifted a brand new Toyota Vellfire car to the sensational director @AnilRavipudi for the tremendous Success of #BlockBusterBhagavanthKesari 👌🔥#NandamuriBalakrishna @sahugarapati7 pic.twitter.com/wDeXaLfPs5 — manabalayya.com (@manabalayya) November 27, 2023 -
ఓటీటీలోకి వచ్చేసిన పెద్ద సినిమాలు, స్ట్రీమింగ్ అక్కడే!
థియేటర్లో సినిమాల సందడి ఎలా ఉన్నా ఓటీటీలు మాత్రం ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, కొత్త వెబ్ సిరీస్‌లతో కళకళలాడుతున్నాయి. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ సరికొత్త కంటెంట్‌ను అందించడంలో ఒకదానితో మరొకటి పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో ఓటీటీ ఆడియన్స్‌కు కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్నాయి. సినీప్రేమికుల కోసం ప్రతివారం కొత్త సినిమాలను మోసుకొస్తుంది ఓటీటీ. మరీ ముఖ్యంగా సినిమాలకు సెంటిమెండ్ డేగా చెప్పుకునే ఫ్రైడే రోజు భారీ చిత్రాలను రిలీజ్ చేస్తుంది. అలా ఈరోజు (నవంబర్ 24) నాలుగు పెద్ద సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. అవేంటో చూసేద్దాం.. లియో దళపతి విజయ్, త్రిష ప్రధాన పాత్రలో నటించిన చిత్రం లియో. బాక్సాఫీస్ దగ్గర రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని అభిమానులు తెగ ఎదురుచూశారు. అదిగో.. ఇదిగో.. అంటూ ఊరించిన లియో ఎట్టకేలకు నేడు ఓటీటీలో అడుగుపెట్టింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. భగవంత్ కేసరి నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం భగవంత్ కేసరి. హీరోయిన్ శ్రీలీల బాలయ్య కూతురిగా నటించింది. యాక్టింగ్‌తో పాటు యాక్షన్ సీన్స్‌లోనూ అదరగొట్టింది. దసరాకు రిలీజైన ఈ మూవీ ఓటీటీ డేట్ గురించి అనేక పుకార్లు వచ్చాయి. అయితే అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఈ మూవీ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ది విలేజ్ తమిళ స్టార్ ఆర్య తొలిసారి ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ది విలేజ్ అనే హారర్ వెబ్ సిరీస్ చేశాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగానే భయపెట్టింది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. చదవండి: ‘సౌండ్ పార్టీ’ మూవీ రివ్యూ -
ఓటీటీకి భగవంత్ కేసరి.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం 'భగవంత్ కేసరి'. ఈ చిత్రంలో పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల ప్రత్యేకపాత్రలో మెరిసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరెక్కించిన ఈ చిత్రం దసరా కానుకగా థియేటర్లలోకి వచ్చింది. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ రావడంతో వందకోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే బాలయ్య అభిమానుల అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధంగా ఉంది. కాగా.. ఇప్పటికే 'భగవంత్ కేసరి' డిజిటల్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకుంది. అక్టోబరు 19న ఈ మూవీ థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం నవంబర్ 24న స్ట్రీమింగ్ కానుంది. అయితే మొదట ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌పై చాలా సార్లు రూమర్స్ కూడా వచ్చాయి. ప్రస్తుతం అఫీషియల్‌గా ఓటీటీ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. దీంతో ఈ శుక్రవారమే భగవంత్ కేసరి కుటుంబంతో కలిసి చూసేయొచ్చు. #BhagavanthKesari - Tomorrow - @PrimeVideo pic.twitter.com/cV4nytvArq — Matters Of Movies (@MattersOfMovies) November 23, 2023 -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు
మరో వీకెండ్‌కి అంతా సిద్దమైపోయింది. కాకపోతే ఈసారి థియేటర్లలోకి వచ్చేవాటిలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాల్లేవు. కాబట్టి ఆటోమేటిక్‌గా అందరి చూపు ఓటీటీలపై పడుతుంది. దాన్ని క్యాష్ చేసుకునేలా ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 23 మూవీస్-వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కి సిద్ధమైపోయాయి. లిస్టులో చాలా ఉన్నప్పటికీ రెండు మూడు మాత్రమ తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. (ఇదీ చదవండి: Bigg Boss 7: శివాజీకి షాక్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ ఇద్దరేనా?) దసరా కానుకగా బిగ్ స్క్రీన్‌పై రిలీజైన దళపతి విజయ్ 'లియో' సినిమా.. ఈ శుక్రవారమే ఓటీటీలోకి రానుంది. దీంతో పాటే డీమన్(తమిళ), చావెర్(మలయాళ), పులిమడ, ఒడియన్ లాంటి తెలుగు డబ్బింగ్ లాంటి చిత్రాలు కూడా ఉన్నాయండోయ్. ఇవన్నీ పక్కనబెడితే శ్రీలీల కొత్త మూవీ 'భగవంత్ కేసరి' కూడా ఈ వీకెండ్లోనే ఓటీటీలోకి రానుందని అంటున్నారు. దిగువన లిస్ట్‌లో స్ట్రీమింగ్ కానుంది అని ఉన్న చిత్రాలు గురువారం రిలీజైనవి, మిగతావన్నీ మాత్రం శుక్రవారం స్ట్రీమింగ్ అయ్యేవని అర్థం. ఈ శుక్రవారం రిలీజయ్యే మూవీస్ జాబితా (నవంబరు 24th) అమెజాన్ ప్రైమ్ ద విలేజ్ - తమిళ వెబ్ సిరీస్ ఎల్ఫ్ మీ - ఇటాలియన్ మూవీ భగవంత్ కేసరి - తెలుగు సినిమా ఆహా డీమన్ - తమిళ సినిమా అన్‌స్టాపబుల్ లిమిటెడ్ ఎడిసన్ - ఎనిమల్ టీమ్ ఎపిసోడ్ సోనీ లివ్ సతియా సోతనాయ్ - తమిళ చిత్రం చావెర్ - మలయాళ మూవీ జియో సినిమా ద గుడ్ ఓల్డ్ డేస్ - తెలుగు వెబ్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) నెట్‌ఫ్లిక్స్ లియో - తెలుగు డబ్బింగ్ సినిమా ఏ నియర్లీ నార్మల్ ఫ్యామిలీ - స్వీడిష్ వెబ్ సిరీస్ ఐ డోన్ట్ ఎక్స్పెక్ట్ ఎనీవన్ టూ బిలీవ్ మీ - స్పానిష్ సినిమా లాస్ట్ కాల్ ఫర్ ఇస్తాంబుల్ - టర్కిష్ మూవీ గ్రాన్ టరిష్మో - ఇంగ్లీష్ చిత్రం ద మెషీన్ - ఇంగ్లీష్ సినిమా (నవంబరు 26) పులిమడ - తెలగు డబ్బింగ్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది) మై డామెన్ - జపనీస్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) మై లిటిల్ పోని మేక్ యూవర్ మార్క్: చాప్టర్ 6 (స్ట్రీమింగ్) ఈ విన్ ఒడియన్ - తెలుగు డబ్బింగ్ మూవీ బుక్ మై షో యూఎఫ్ఓ స్వీడన్ - స్వీడిష్ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ద నాటీ నైన్ - ఇంగ్లీష్ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది) జీ5 ద ఆమ్ ఆద్మీ ఫ్యామిలీ: సీజన్ 4 - హిందీ వెబ్ సిరీస్ ఎమ్ఎక్స్ ప్లేయర్ జోహ్రి - హిందీ సిరీస్ సైనా ప్లే కుడుక్కు 2025 - మలయాళ సినిమా (ఇదీ చదవండి: యాంకర్ రష్మీతో పెళ్లెప్పుడు? సుడిగాలి సుధీర్ షాకింగ్ కామెంట్స్!) -
ఓటీటీలోకి 'భగవంత్ కేసరి' సినిమా.. రిలీజ్ డేట్ ఫిక్స్?
బాలకృష్ణ, శ్రీలీల నటించిన సినిమా 'భగవంత్ కేసరి'. దసరా కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. వసూళ్లు బాగానే తెచ్చుకుంది గానీ ఓవరాల్‌గా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కొన్ని సీన్లు బాగానే ఉన్నప్పటికీ ప్రేక్షకులని అనుకున్నంత స్థాయిలో అలరించలేకపోయింది. అలాంటిది ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయిపోయిందట. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ ఐదు స్పెషల్!) 'భగవంత్ కేసరి'లో బాలకృష్ణతో పాటు శ్రీలీల కీలక పాత్ర చేసింది. యాక్టింగ్‌తో పాటు క్లైమాక్స్‌లో ఫైట్స్ కూడా చేసిన శ్రీలీల, అందరూ అవాక్కయ్యేలా చేసింది. దసరా సందర్భంగా రిలీజ్ కావడం వల్లనో ఏమో గానీ ఈ చిత్రాన్ని కలెక్షన్స్ అయితే రూ.100 కోట్లకు పైనే వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించారు. తాజాగా సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ప్రస్తుతానికి అయితే ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. ఇకపోతే థియేటర్లలో సినిమా విడుదల కావడానికి ముందే 'భగవంత్ కేసరి' డిజిటల్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకుంది. అక్టోబరు 19న ఈ మూవీ థియేటర్లలోకి రాగా.. ఐదు వారాల తర్వాత అంటే నవంబరు 23న 'భగవంత్ కేసరి' చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని అనుకుంటున్నారట. దీనిపై అధికారికంగా ప్రకటన రానప్పటికీ దాదాపు ఇదే డేట్ కన్ఫర్మ్ అని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న సిద్ధార్థ్ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
Bhagavanth Kesari Movie Success Meet: ‘భగవంత్ కేసరి’ విజయోత్సవ వేడుక (ఫొటోలు)
-
బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న భగవంత్ కేసరి చిత్రబృందం (ఫొటోలు)
-
Bhagavanth Kesari Success Meet: ‘భగవంత్ కేసరి’ మూవీ విజయోత్సవ యాత్ర (ఫోటోలు)
-
అబద్ధం చెప్పి దొరికిపోయిన శ్రీలీల.. ఆ హీరోకి ఆల్రెడీ ముద్దు!
శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ ట్రెండింగ్ హీరోయిన్. వయసు చిన్నదే కానీ వరసపెట్టి సినిమాలు చేస్తోంది. వాటిలో పవన్, మహేశ్ లాంటి స్టార్ హీరోల చిత్రాలు కూడా ఉన్నాయి. 'భగవంత్ కేసరి' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించిన శ్రీలీల.. తాజాగా ప్రమోషన్స్‌లో భాగంగా లిప్‌కిస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. కానీ ఇదే విషయంలో పూర్తిగా దొరికిపోయింది. (ఇదీ చదవండి: తల్లి చివరి కోరిక తీర్చబోతున్న మహేశ్‌బాబు.. త్వరలో శుభకార్యం!) శ్రీలీల ఏం చెప్పింది? ప్రస్తుతం టాలీవుడ్లో శ్రీలీల హవా నడుస్తోంది. డ్యాన్స్, గ్లామర్, యాక్టింగ్ అన్ని విషయాల్లోనూ ఆకట్టుకుంటున్న ఈమెకు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో యాంకర్ నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. తెలుగులో లిప్ కిస్ చేయాలంటే ఏ హీరోతో చేస్తారు? అని అడగ్గా.. 'నేను ఏ హీరోతో లిప్‌లాక్ సీన్లో నటించను. అలా చేయాల్సి వస్తే నా మొదటి ముద్దు నా భర్తకే ఇస్తాను' అని శ్రీలీల చెప్పింది. అబద్ధం చెప్పిందా? పెళ్లి చేసుకున్నాక భర్తనే ముద్దు పెట్టుకుంటానని చెప్పిన శ్రీలీల.. తను గతంలో ఇలాంటి సీన్ చేశానని మర్చిపోయి, పొరపాటున అబద్ధం చెప్పిసేంది. టీనేజ్‌లో ఉండగానే శ్రీలీలకు హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది. అలా కన్నడలో 2019లోనే 'కిస్' అనే చిత్రంలో నటించింది. దీన్ని తెలుగులో 'ఐ లవ్ యూ ఇడియట్' పేరుతో కొన్ని నెలల ముందు రిలీజ్ చేశారు. ఇందులో ఓ సీన్లో హీరోయిన్ ప్రేమని వ్యక్తపరుస్తుంది. ఆ తర్వాత హీరోని పెదాలపై ముద్దు కూడా పెట్టుకుంటుంది. దీంతో శ్రీలీల తాజా కామెంట్స్ అబద్ధమని తేలిపోయాయి. అలానే ఈ సీన్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7లో ఈసారి షాకింగ్ ఎలిమినేషన్.. క్రేజీ కంటెస్టెంట్ ఔట్?) -
నా మొదటి లిప్ లాక్ సీన్ ఎవరితో అంటే..: శ్రీలీల
ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న హీరోయిన్లలో శ్రీలీల టాప్‌లో కొనసాగుతున్నారు. యంగ్ హీరో నుంచి సీనియర్ హీరోల వరకు శ్రీలీలనే ఫస్ట్ ఛాయిస్ అనేలా తన ట్రెండ్ ఇండస్ట్రీలో కొనసాగుతుంది. రీసెంట్గా భగవంత్ కేసరిలో తన నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ చిత్రంలో బాలయ్య కూతురి పాత్రలో అద్భుతంగా నటించి ప్రశంసలను అందుకుంది. (ఇదీ చదవండి: చిరంజీవి- వశిష్ట సినిమాకు టైటిల్ అదిరిపోయింది) తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె పలు ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఆ సమయంలో ఆమెకు ఓ క్రేజీ ప్రశ్న ఎదురైంది. టాలీవుడ్లో లిప్ లాక్ సీన్ చేయాల్సి వస్తే ఎవరితో చేస్తారు అని అడగగా ఆమె తనదైన శైలిలో తెలివిగా ఆన్సర్ ఇచ్చింది. కాసేపు ఆలోచించిన శ్రీలీల నేను ఏ హీరోతో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించనని ఓపెన్‌గానే చెప్పేసింది. అలా చేయాల్సి వస్తే నా మొదటి లిప్ కిస్ నా భర్తకే ఇస్తానని చెప్పింది. అంటే తాను లిప్‌లాక్ సీన్లకు దూరం అని ఇలా చెప్పకనే చెప్పేసింది శ్రీలీల. తాజాగా పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న సినిమా 'ఆదికేశవ' త్వరలో విడుదలకు రెడీగా ఉంది. ఈ సినిమా నుంచి 'లీలమ్మో' అనే పాట లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్‌తో అదరగొట్టేసింది. మహేశ్‌బాబుతో గుంటూరు కారం, పవన్ కల్యాణ్‌తో ఉస్తాద్ భగత్ సింగ్, విజయ్ దేవరకొండ,నితిన్‌లతో ఓ సినిమా చేస్తోంది. ఇలా వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతుంది మన తెలుగు బ్యూటీ. -
'పదేళ్ల పనిని వారంలో చేశారు'.. ఆ డైలాగ్పై నటుడి ప్రశంసలు!
నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి చిత్రంపై ప్రశంసలు కురుస్తున్నాయి. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం దసరా కానుకగా థియేటర్లలో సందడి చేసింది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా కనిపించగా.. పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల ప్రత్యేక పాత్రలో కనిపించింది. అయితే ఈ మూవీలోని ఓ డైలాగ్ అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రబృందాన్ని నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. సినిమాలోని గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ డైలాగ్పై నటుడు రాహుల్ రవీంద్రన్ ట్వీట్ చేశారు. ఆ ఒక్క డైలాగ్‌తో ప్రజలకు మంచి సందేశాన్ని ఇచ్చారని కొనియాడారు. ఈ ట్వీట్‌కు అనసూయ రిప్ కూడా ఇచ్చింది. రాహుల్ తన ట్వీట్లో రాస్తూ.. 'ఈ చిత్రంలో ఒక్క డైలాగ్‌తో ప్రజలను చైతన్యవంతులను చేశారు. ఒక్క వారంలోనే మెసేజ్ అందరికీ చేరేలా చేశారు. మీడియా ద్వారా అయితే దాదాపు 10 ఏళ్లు పట్టేది. మాస్ మసాల సినిమాలో ఇలాంటి గొప్ప అంశాన్ని పెట్టినందుకు చిత్రబృందానికి కృతజ్ఞతలు. బాలకృష్ణ వల్లే ఇది సాధ్యమైంది. అత్యంత ప్రభావవంతంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. బాలయ్య పక్కన శ్రీలీల చూడటం అద్భుతంగా అనిపించింది.' అంటూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అయితే ట్వీట్‌కు అనసూయం సైతం స్పందించింది. ఈ సినిమా గురించి ఇంతకంటే గొప్పగా ఎవరూ చెప్పలేరంటూ రిప్లై ఇచ్చింది. The good touch-bad touch scene in #BhagavantKesari will achieve in a week what other mediums will take 10 years. Thank you for bringing this topic to mass masala cinema @AnilRavipudi garu and NBK garu🙌🏽🙌🏽 Communicated in such a simple and yet highly effective manner like only NBK… — Rahul Ravindran (@23_rahulr) October 23, 2023 -
Bhagavanth Kesari: 'భగవంత్ కేసరి' సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
భగవంత్ కేసరికి సీక్వెల్? అనిల్ రావిపూడి ఆసక్తికర కామెంట్స్
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం భగవంత్ కేసరి. సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్స్ కూడా బాగానే రాబడుతోంది. సోమవారం ఈ సినిమా విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సంద్భంగా అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముందుగా భగవంత్ కేసరి సినిమా కోసం తనతో కలిసి పని చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఈ సినిమాకు సీక్వెల్ తీసే ధైర్యం తనకు లేదన్నాడు. ఇప్పటికే భగవంత్ కేసరి సినిమా బరువును తనపై వేసుకుని నలిగిపోయానని, సీక్వెల్ గురించి తర్వాత చూద్దామని అన్నాడు. బాలయ్య బాబు శక్తినిస్తే అప్పుడు భగవంత్ కేసరి 2 తీస్తామని పేర్కొన్నాడు. సినిమా విషయానికి వస్తే.. ఈ మూవీలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. యంగ్ హీరోయిన్ శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో నటించింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించింది. చదవండి: ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ, స్ట్రీమింగ్ అప్పటినుంచే! -
బాలకృష్ణతో ఇంటర్వ్యూ అంటే మామూలుగా ఉండదు
-
రెండో రోజుకే చల్లబడ్డ భగవంత్ కేసరి కలెక్షన్స్
-
'భగవంత్ కేసరి'కి షాకిచ్చిన తారక్,మెగా ఫ్యాన్స్.. భారీగా నష్టాలు
తండ్రీకూతుళ్ల అనుబంధంతో పాటు సమాజంలో ఆడపిల్లను ఎలా పెంచాలి అనే కాన్సెప్ట్‌తో బాలకృష్ణ- శ్రీలీల నటించిన చిత్రం ‘భగవంత్ కేసరి’. మాస్ సినిమాలకు మొదటి ప్రయారిటీ ఇచ్చే బాలకృష్ణ ఈ సినిమాతో తన రూట్ మార్చుకున్నారు. మరోవైపు కామెడీ కంటెంట్‌తో సూపర్ హిట్స్ కొట్టిన డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ‘భగవంత్ కేసరి’తో తన స్ట్రాటజీలో మార్పులు చేసుకున్నారు. ఇలా భారీ అంచనాలతో అక్టోబర్ 19న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకాధరణ అంతగా లేదని తేలిపోయింది. విడుదలైన మొదటిరోజే భారీ ఎఫెక్ట్ ‘భగవంత్ కేసరి’ షూటింగ్ ప్రారంభం నుంచి ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ ఆకట్టుకున్నాయి. అలాంటప్పుడు ‘భగవంత్ కేసరి’ అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరుగుతాయని చిత్ర యూనిట్ అంచనా వేసింది. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా టికెట్లను మూడు రోజుల ముందే ఆన్లైన్లతో పాటు ఆఫ్‌లైన్ కూడా బుకింగ్స్ మొదలు పెట్టారు. కానీ ప్రేక్షకుల నుంచి అంతగా రెస్పాన్స్ రాలేదు. సినిమా మొదటి రెండు రోజులు అఖండ, వీరసింహారెడ్డి సినిమాల కంటే తక్కువగానే బుకింగ్స్ జరిగాయని తెలుస్తోంది. సినిమా విడుదలైన మొదటిరోజే హైదరాబాద్,విశాఖ,విజయవాడ లాంటి నగరాల్లో సోల్డ్ ఔట్ షోలు చాలా తక్కువగానే కనిపించాయి. అంతేకాకుండా ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో ఉన్న షోలు కూడా ఆశించిన స్థాయిలో లేవు. విడుదలైన మొదటిరోజే రెండు రోజులే ఇలా ఉంటే తర్వాత మాత్రం కనీసం 30 శాతం టికెట్లు కూడా సోల్డ్ కాలేదని స్పష్టంగా తెలుస్తోంది. బాలయ్యకు చెక్ పెట్టిన తారక్ ఫ్యాన్స్ బాలయ్య సినిమాకు మాస్ ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి. బి, సి సెంటర్లలో ఎక్కువ మంది థియేటర్లకు వెళ్లి టికెట్లు కొంటారు. అయినా సరే అక్కడ కూడా చాలా థియేటర్ల వద్ద బుకింగ్స్ డల్లుగానే ఉన్నాయని తెలుస్తోంది. దీనంతటికి కారణం జూ. ఎన్టీఆర్ అభిమానులని తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం జూ ఎన్టీఆర్‌పై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో ‘భగవంత్ కేసరి’ సినిమాకు వారు కూడా దూరం అయ్యారని తెలుస్తోంది. బాలయ్యకు, తారక్‌కు మధ్య విభేదాలు చాలా ఏళ్ల నుంచి ఉన్నప్పటికీ పలుమార్లు తారక్‌నే ఒకడుగు వెనక్కు తగ్గేవాడు. కానీ చంద్రబాబు అరెస్ట్ గురించి తారక్ స్పందించకపోవడంతో అసహనానికి గురైన బాలయ్య ఏకంగా తారక్‌పై మండిపడ్డాడు. బహిరంగంగానే తారక్‌ను సంబోదిస్తూ 'డోంట్ కేర్' అనేసి అవమానించాడు. దీంతో జూనియర్ అభిమానులకు కోపం రావడమే కాకుండా వాళ్లు పట్టుబట్టి ఈ సినిమాను బాయ్‌కాట్ చేసినట్లు సమాచారం. తారక్ ఫ్యాన్స్ ఎవరూ భగవంత్ కేసరి చూసేందుకు వెళ్లకండి అంటూ సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం చేశారు. 'డోంట్ కేర్ బాబాయ్' అని బాలయ్యకు ఇలా వార్న్ చేసిన తారక్ బాలకృష్ణ 'డోంట్ కేర్' అని చేసిన వ్యాఖ్యలకు జూ.ఎన్టీఆర్ ఒక అడుగు తగ్గి 'భగవత్ కేసరి'తో చెక్ పెడతాడని అందరూ ఆశించారు. సినిమా విడుదల సందర్భంగా 'ఆల్ ది బెస్ట్'తో ట్వీట్ చేస్తాడని నందమూరి ఫ్యాన్స్ ఆశించారు. కనీసం సినిమా విడుదలైన తర్వాత అయినా కంగ్రాట్స్ 'బాలయ్య బాబాయ్' అని చెబుతాడని కోరుకున్నారు. కానీ 'భగవంత్ కేసరి' విషయంలో అలాంటిదేమీ జరగలేదు. రీసెంట్గా తన బావమరిది నటించిన 'మ్యాడ్' సినిమా ట్రైలర్‌ను షేర్ చేసిన తారక్... బాబాయ్ చిత్రం గురించి మాత్రం ఎలాంటి ట్వీట్ చేయలేదు. ఇదే దారిలో నందమూరి కల్యాణ్ రామ్ కూడా నడిచారని తెలుస్తోంది. ఆయన కూడా 'భగవంత్ కేసరి' గురించి ఎలాంటి కామెంట్ చేయలేదు. ఇలా అన్నాదమ్ముళ్లు ఇద్దరూ 'డోంట్ కేర్' అనేసి బాలయ్యకు సిగ్నల్ పంపించేశారని తెలుస్తోంది. దీంతో తారక్ ఫ్యాన్స్ సత్తా ఎలా ఉంటుందో 'భగవంత్ కేసరి' విషయంలో తెలిసిపోయిందని టాక్ నడుస్తోంది. టీడీపీతో పొత్తు.. షాకిచ్చిన మెగా ఫ్యాన్స్ రాజమండ్రి జైలు వద్ద టీడీపీతో జనసేన పొత్తు ఉంటుందని పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాకు మెగా ఫ్యాన్స్, బాలయ్య ఫ్యాన్స్ ఒక్కటి అవుతారని అందరూ అంచనా వేశారు. కానీ సినిమాల వరకు వచ్చేసరికి అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. తారక్ ఫ్యాన్స్ ఏ విధంగా అయితే డోంట్ కేర్ అన్నారో మెగా ఫ్యాన్స్ కూడా పవన్ కల్యాణ్‌ను డోంట్ కేర్ అనేశారా..? అనే సందేహాలు వస్తున్నాయి. తారక్,మెగా ఫ్యాన్స్ ఎఫెక్ట్ భగవంత్ కేసరి చిత్రంపై భారీగానే పడినట్లు కనిపిస్తోంది. మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్‌లలో రెండో రోజుకు వచ్చేసరిగి ఒక్కసారిగా 60 శాతం డౌన్ అయ్యాయి. ఏదేమైనప్పటికి సినిమా క్లోజింగ్ సమయానికి భగవంత్ కేసరి చిత్రానికి నష్టాలు తప్పవని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
భగవంత్ కేసరి కలెక్షన్స్.. మొదటి రోజు కంటే తక్కువే!
నందమూరి బాలకృష్ణ పండల మీద గురి పెట్టాడు. సంక్రాంతికి వీరసింహారెడ్డితో పలకరించిన ఈయన భగవంత్ కేసరితో దసరా బరిలోకి దిగాడు. కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అనిల్ రావిపూడి తొలిసారి ఆ జానర్‌ను వదిలేసి ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను తెరకెక్కించాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై హరీశ్ పెద్ది, సాహు గారపాటి నిర్మించారు. తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించిన ఈ మూవీ అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భగవంత్ కేసరి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.32.33 కోట్లు రాబట్టింది. తాజాగా రెండు రోజుల కలెక్షన్స్‌ను వెల్లడించింది చిత్రయూనిట్. రెండో రోజు ఈ చిత్రం దాదాపు రూ.19 కోట్ల మేర రాబట్టింది. అంటే రెండు రోజుల్లో రూ.51.12 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు తెలిపింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ విడుదల చేసింది. మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు వసూళ్లు కొంత నెమ్మదించినట్లు కనిపిస్తోంది. మరి వీకెండ్లో అయినా భగవంత్ కేసరి పుంజుకుంటుందేమో చూడాలి! మరోపక్క టైగర్ నాగేశ్వరరావు, లియో సినిమాలు భగవంత్ కేసరి సినిమాకు గట్టి కాంపిటీషనే ఇస్తున్నాయి. ఈ పోటీని తట్టుకుని బాలకృష్ణ మూవీ బాక్సాఫీస్ దగ్గర నిలబడుతుందా? కలెక్షన్లు పెంచుకుంటుందా? లేదా? చూడాలి! A #BlockbusterDawath at the Box office 🔥#BhagavanthKesari Grosses 51.12 CR WORLDWIDE IN 2 DAYS 💥💥 - https://t.co/rrWPhVwU6B In cinemas now❤️🔥#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman @harish_peddi @sahugarapati7 @JungleeMusicSTH pic.twitter.com/puSAke2was — Shine Screens (@Shine_Screens) October 21, 2023 చదవండి: సింగర్ గీతా మాధురితో విడాకులు.. క్లారిటీ ఇచ్చిన నందు! -
కూతుర్ని బలిచ్చిన తండ్రి.. తల నరికిన కొడుకు. ‘దసరా’ సినిమా కథలివే!
దసరా పండుగ వచ్చిందంటే చాలు టాలీవుడ్లో ఆ సందడి, జోష్ వేరేలా ఉంటుంది. ఈ సీజన్ కోసం స్టార్ హీరోలందరూ ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ప్రతి దసరాకి కనీసం ఒకటి, రెండు బడా సినిమాలు అయినా బాక్సాఫీస్ బరిలోకి దిగుతాయి. కానీ ఈ సారి మాత్రం ఏకంగా ముగ్గురు స్టార్ హీరోలు దసరా బరిలోకి దిగారు. ఒకవైపు బాలకృష్ణ, మరోవైపు రవితేజ, ఇంకొక వైపు దళపతి విజయ్ .. ఎవరికి వాళ్లు తమ సినిమాలతో బాక్సాఫీస్‌పై దండయాత్ర ప్రారంభించారు. ఒక సినిమాలో తండ్రి కన్న కూతుర్ని నరబలి ఇస్తే.. మరో సినిమాలో తండ్రి తలను కన్న కొడుకు నరికేస్తాడు. ఇంకో సినిమాలో కూతుర్ని బలోపేతం చేస్తూనే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పాఠాలు చెబుతాడు. ఆ సినిమాలేంటి? ఎలా ఉన్నాయో? చదివేయండి కూతర్ని నరబలి ఇచ్చిన తండ్రి దళపతి’విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లియో’. ‘విక్రమ్’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన చిత్రమిది. అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. ఈ చిత్రంలో సొంత కూతుర్నే నరబలి ఇస్తాడు విలన్ ఆంటోని దాస్(సంజయ్ దత్). దీంతో అతని కొడుకు లియో(విజయ్) తండ్రిని ఎదురించి.. అతను నెలకొల్పిన పొగాకు ఫ్యాక్టరీని ధ్వంసం చేస్తాడు. లియో కూడా మరణిస్తాడు. కట్ చేస్తే.. 20 ఏళ్ల తర్వాత లియో పోలికలతో పార్తిబన్(విజయ్) కనిపిస్తాడు. అతని కోసం ఆంటోని హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ సినిమా ఎలా ఉంది? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) తండ్రి తల నరికిన ‘టైగర్’ రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. స్టువర్ట్పురం గజ దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ఇది. ఎదిమిదేళ్ల వయసులోనే తండ్రి తలను నరికేస్తాడు టైగర్. అతను ఎందుకలా చేశాడు? నాగేశ్వరరావు దొంగలా ఎలా మారాడు? ఈ సినిమా కొత్తగా చూపించిందేంటి? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ‘బ్యాడ్ టచ్’ పాఠం చెప్పిన కేసరి నందమూరి బాలకృష్ణ- అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన ‘భగవంత్ కేసరి’ అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందకు వచ్చింది. ఇందులో శ్రీలీల కీలక పాత్ర పోషించింది. ఆడ పిల్లలను సింహంలా పెంచాలనే సందేశంతో ఈ సినిమాను తెరకెక్కించాడు అనిల్ రావిపూడి. ఓ సన్నివేశంలో బాలయ్యతో స్కూల్ పిల్లలకు ‘గుడ్ టచ్-బ్యాడ్ టచ్’ పాఠం చెప్పించాడు. ఆ సీన్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఓవరాల్‌గా ఈ సినిమా ఎలా ఉంది? ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది?(పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘భగవంత్ కేసరి’ కోసం శ్రీలీలకు భారీ రెమ్యునరేషన్.. కాజల్ కంటే ఎక్కువే!
ప్రస్తుతం టాలీవుడ్లో శ్రీలీల హవా కొనసాగుతుంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరి హీరోలతో నటిస్తూ కెరీర్ పరంగా దూసుకెళ్తోంది. తాజాగా ఈ బ్యూటీ నటించిన ‘భగవంత్ కేసరి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇన్నాళ్లు హీరోయిన్గా అలరించిన శ్రీలీల.. ఈ చిత్రంలో కూతురు పాత్ర పోషించి మెప్పించింది. సినిమాకు మిశ్రమ స్పందన లభించినప్పటికీ.. ప్రతి ఒక్కరు శ్రీలీల నటనను మాత్రం పొగిడేస్తున్నారు. డ్యాన్స్ మాత్రమే కాదు యాక్షన్ కూడా ఇరగదీసిందని ప్రశంసలు కురిపిస్తున్నారు. శ్రీలీల ప్రయోగం ఫలించింది శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్లో బిజియెస్ట్ హీరోయిన్. ఆమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. డేట్స్ కుదరక చాలా సినిమాలు వదులుకుంది కూడా. అలాంటి శ్రీలీల భగవంత్ కేసరి లాంటి చిత్రం ఒప్పుకొని పెద్ద సాహసమే చేసింది. ఎందుకంటే హీరోయిన్గా రాణిస్తున్న తరుణంలో కూతురు లాంటి క్యారెక్టర్ చేయడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ శ్రీలీల ఆ ప్రయోగం చేసి సక్సెస్ సాధించింది. భగవంత్ కేసరిలో బాలయ్య తరువాత శ్రీలీల అభినయమే హైలెట్ అని పలు వెబ్సైట్లు తమ రివ్యూల్లో రాసుకొచ్చాయి. విజ్జీ పాప పాత్రలో ఆమె ఒదిగిపోయిందని, శ్రీలీలలోని రెండో కోణం ఈ సినిమా ద్వారా బయటకు వచ్చిందని అంటున్నారు. భారీ రెమ్యునరేషన్ భగవంత్ కేసరి కోసం శ్రీలీల భారీ రెమ్యునరేషనే పుచ్చుకుందంట. హీరోయిన్గా నటించిన కాజల్ కంటే ఎక్కువ పారితోషికం వసూలు చేసిందని టాక్ నడుస్తోంది. పెళ్లి తర్వాత అవకాశాలు తగ్గడంతో కాజల్ తన రెమ్యునరేషన్‌ని భారీగా తగ్గించిందట. భగవంత్ కేసరి కోసం రూ. 1.5 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీలీల మాత్రం రూ. 1.8 కోట్లు పారితోషికంగా పుచ్చుకున్నట్లు సమాచారం. కెరీర్ ప్రారంభంలో కేవలం ఐదు లక్షల రూపాలయలు మాత్రమే తీసుకున్న శ్రీలీల..ఇప్పుడు కోటిన్నరకు పైగా తీసుకుంటుందంటే ఈ అమ్మడు క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. (చదవండి: భగవంత్ కేసరి మూవీ రివ్యూ) -
Bhagavanth Kesari: 'భగవంత్ కేసరి' సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
క్షమాపణలు చెప్పిన 'భగవంత్ కేసరి' డైరెక్టర్
హీరో బాలకృష్ణ 'భగవంత్ కేసరి' సినిమా.. నిన్న(గురువారం) థియేటర్లలో రిలీజైంది. మరీ అంత సూపర్ అని చెప్పలేం గానీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బాలయ్య, శ్రీలీల యాక్టింగ్ బాగుందని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే తొలిరోజు కలెక్షన్స్ బాగానే వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.30 కోట్లకు పైనే గ్రాస్ వచ్చింది. దీంతో శుక్రవారం 'భగవంత్ కేసరి' సక్సెస్ మీట్ పెట్టారు. ఇందులోనే మాట్లాడుతూ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ విషయమై సారీ చెప్పాడు. (ఇదీ చదవండి: రెండోసారి తండ్రి అయిన 'బలగం' డైరెక్టర్ వేణు) ఇంతకీ ఏమైంది? భగవంత్ కేసరి సినిమాలో పోలీస్ అధికారి, ఖైదీ పాత్రల్లో బాలయ్య కనిపించాడు. అతడి పెంపుడు కూతురిగా శ్రీలీల నటించింది. గత సినిమాలతో పోలిస్తే శ్రీలీల ఇందులో సెటిల్డ్‌గా యాక్ట్ చేసింది. ఎమోషన్స్ సీన్స్‌తో పాటు క్లైమాక్స్‌లో యాక్షన్ సీన్స్ కూడా చేసి ఆశ్చర్యపరిచింది. అయితే ఇందులో శ్రీలీల పోషించిన విజ్జి పాత్ర తండ్రిగా శరత్ కుమార్ కాసేపు కనిపించారు. జైలర్ రోల్ చేశారు. కానీ ఆయన చనిపోయారని టీవీలో చెప్పినప్పుడు సీఐ అని స్క్రోలింగ్ వేస్తారు. తాజాగా ఇదే విషయాన్ని ఓ రిపోర్టర్ అనిల్ రావిపూడిని అడిగారు. అనిల్ ఏం చెప్పాడు? 'పెద్ద కమర్షియల్ సినిమాలో మీరు ఇంత చిన్న మిస్టేక్ గుర్తించడం గొప్ప విషయం. మీ సునిశీత పరిశీలన, సూక్ష్మ బుద్దికి హ్యాట్సాఫ్. జైలర్‌ని సీఐ అని న్యూస్ చెప్పడం మా తప్పే. మా వాళ్లు పొరపాటుగా అలా వేసి ఉంటారు. అందుకు క్షమాపణలు' అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. ఇకపోతే సినిమా బ్లాక్‌బస్టర్ అంటున్నారు గానీ తొలిరోజు వసూళ్లలో చిరు 'భోళా శంకర్'ని బాలయ్య దాటలేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. (ఇదీ చదవండి: మెగాస్టార్ పాన్ ఇండియా సినిమా.. రెండు నెలల్లో పూర్తి) భగవంత్ కేసరి విస్ఫోటనం🔥#BhagavanthKesari Grosses 32.33 Crores Worldwide on DAY 1 & emerges as a DASARA WINNER💥 - https://t.co/rrWPhVwU6B Enjoy #BlockbusterDawath in cinemas now❤️🔥#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman @sahugarapati7… pic.twitter.com/C8i2VTpeb5 — Shine Screens (@Shine_Screens) October 20, 2023 -
భగవంత్ కేసరి కలెక్షన్స్: చిరంజీవి డిజాస్టర్ మూవీని దాటలేకపోయిన బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం భగవంత్ కేసరి. అందాల చందమామ కాజల్ హీరోయిన్గా నటించింది. కుర్ర హీరోయిన్ శ్రీలీల.. బాలకృష్ణ కూతురి పాత్రను పోషించింది. దర్శకుడు అనిల్ రావిపూడి.. కామెడీ జానర్‌ను వదిలేసి ఎమోషనల్ కంటెంట్‌ను ఎంచుకున్నాడు. బాలయ్యను సరికొత్తగా తెరపై చూపించే ప్రయత్నం చేశాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై హరీశ్ పెద్ది, సాహు గారపాటి నిర్మించిన ఈ మూవీకి తమన్ సంగీతం అందించాడు. అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. తాజాగా ఈ మూవీ తొలి రోజు వసూళ్ల సంఖ్యను నిర్మాణ సంస్థ బయటపెట్టింది. భగవంత్ కేసరి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.32.33 కోట్లు రాబట్టిందని వెల్లడించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ విడుదల చేసింది. అయితే భగవంత్ కేసరి బాక్సాఫీస్ దగ్గర గట్టిగానే చప్పుడు చేశాడు.. కానీ మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ మొదటి రోజు కలెక్షన్స్‌ను మాత్రం బ్రేక్ చేయలేకపోయాడు. భోళా శంకర్ మొదటి రోజు రూ.33 కోట్లు రాబట్టగా భగవంత్ కేసరి మాత్రం రూ.32.33 కోట్ల దాకా వచ్చి అడుగు దూరంలో ఆగిపోయింది. హిట్ టాక్ ఉన్న భగవంత్ కేసరి.. డిజాస్టర్‌గా నిలిచిన భోళా శంకర్ వసూళ్లను బ్రేక్ చేయలేకపోయిందని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. భగవంత్ కేసరి విస్ఫోటనం🔥#BhagavanthKesari Grosses 32.33 Crores Worldwide on DAY 1 & emerges as a DASARA WINNER💥 - https://t.co/rrWPhVwU6B Enjoy #BlockbusterDawath in cinemas now❤️🔥#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman @sahugarapati7… pic.twitter.com/C8i2VTpeb5 — Shine Screens (@Shine_Screens) October 20, 2023 ....No caption needed #BhagavanthKesari #BholaaShankar pic.twitter.com/vTmX727xfn — KriShNaᴮᴼˢs (@Ramyaholic) October 20, 2023 చదవండి: ‘భగవంత్ కేసరి’ మూవీ రివ్యూ -
'భగవంత్ కేసరి'లో బిగ్‌బాస్-7 బ్యూటీ.. ఏకంగా మంత్రిగానే కీ రోల్
బాలకృష్ణ- అనిల్ రావిపూడి కాంబినేషన్లో 'భగవంత్ కేసరి' నేడు (అక్టోబర్ 19) విడుదలైంది. యాక్షన్ అండ్ ఎమోషనల్ కంటెంట్‌తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో బాలకృష్ణకు కూతురు పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీలీల నటించడం విషేశం అయితే. ఈ చిత్రంలో తెలుగు అమ్మాయి, బిగ్ బాస్ కంటెస్టెంట్ రతికారోజ్ కూడా ఒక కీలక పాత్రలో మెరిసింది. (ఇదీ చదవండి: ఈ కారణం వల్లే సూర్యతో పెళ్లి.. మొదటిసారి రివీల్ చేసిన జ్యోతిక) బిగ్‌బాస్ సీజన్ ఏడులో ఆమె కంటెస్టెంట్‌గా ఉన్న విషయం తెలిసిందే. కానీ సినిమా విడుదల వరకు ఆ సినిమాలో రతిక ఉన్నట్లు ఎక్కడా ఆమె చెప్పలేదు. కానీ సినిమా చూసిన ప్రేక్షకులు స్క్రీన్‌పై రతికాను చూసి సర్ప్రైజ్ అవుతున్నారు. ఇందులో రతికా రోజ్ ఓ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేగా కనిపించిడమే కాకుండా మంత్రిగా మెప్పించిందట. ఇంగ్లీషులో మాత్రమే మాట్లాడే మహిళా మంత్రిగా నవ్వులు పూయించిందట రతిక. ఆమె ఎక్కువ సేపు స్క్రీన్ మీద కనిపించకపోయినప్పటికీ ఉన్నంతసేపు ప్రేక్షకులను ఆకట్టుకుందనే టాక్ నడుస్తోంది. స్క్రీన్‌పై రతికా రోజ్ కనిపించగానే ఈలలతో థియేటర్ ఒక్కసారిగా దద్దరిల్లిపోయిందట. గతంలో నారప్ప, కార్తికేయ, దృశ్యం 2 తదితర చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన ఈ బ్యూటీకి దర్శకుడు కె.రాఘవేంద్రరావు అవకాశమిచ్చారు. స్వయంగా ఈ విషయాన్ని రతికనే ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. బిగ్ బాస్ ఏడో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన రతికా రోజ్.. నాలుగో వారంలోనే బయటకు వచ్చేసింది. కానీ పల్లవి ప్రశాంత్‌తో ఆమె గొడవ పడటంతో ఆయన ఫ్యాన్స్ రతికా రోజ్‌ను దారుణంగా ట్రోల్ చేయడమే కాకుండా ఆమెపై నెగటివిటీ వచ్చేలా సోషల్ మీడియాలో ప్రచారం చేశారని విమర్శలు ఉన్నాయి. -
ఓటీటీకి భగవంత్ కేసరి.. స్ట్రీమింగ్ అప్పుడే!
నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం‘భగవంత్ కేసరి’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల కీలక పాత్రలో కనిపించింది. అనిల్ రావిపూడి అంటే కామెడీ.. బాలయ్య అంటే మాస్. ఈ రెండింటికి భిన్నంగా భగవంత్ కేసరి సినిమా ఉంటుందని మొదటి నుంచే టాక్ వచ్చింది. దీంతో బాలయ్యను అనిల్ ఎలా చూపించారనే క్యూరియాసిటీ అభిమానుల్లో మొదలైంది. అక్టోబర్ 19న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: Bhagavanth Kesari : ‘భగవంత్ కేసరి’ మూవీ రివ్యూ) అభిమానుల భారీ అంచనాల మధ్య భగవంత్ కేసరి విడుదలైంది. ఉదయం నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది. ఇదిలా ఉండగా ఈ మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ రిలీజైన 50 రోజుల తర్వాతే ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు సమాచారం. దీని ప్రకారం డిసెంబర్ రెండో వారంలో భగవంత్ కేసరి స్ట్రీమింగ్కు వచ్చే అవకాశముంది. -
Bhagavanth Kesari : ‘భగవంత్ కేసరి’ మూవీ రివ్యూ
టైటిల్: భగవంత్ కేసరి నటీనటులు: బాలకృష్ణ, శ్రీలీల, కాజల్, అర్జున్ రాంపాల్ తదితరులు నిర్మాణ సంస్థ:షైన్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మాత: హరీశ్ పెద్ది, సాహు గారపాటి రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి సంగీతం: తమన్ సినిమాటోగ్రఫీ: రామ్ ప్రసాద్ ఎడిటర్: తమ్మిరాజు విడుదల తేది: అక్టోబర్ 19, 2023 ‘భగవంత్ కేసరి’ కథేంటంటే.. నేలకొండ భగవంత్ కేసరి (బాలకృష్ణ) వరంగల్ జైల్లో ఖైదీగా ఉంటాడు. అక్కడికి కొత్తగా వచ్చిన జైలర్ శ్రీకాంత్(శరత్ కుమార్).. భగవంత్ కేసరి గురించి తెలుసుకొని అతనికి దగ్గరవుతాడు. భగవంత్ కేసరికి సహాయం చేసిన కారణంగా శ్రీకాంత్ సస్పెండ్ అవుతాడు. వెళ్లే ముందు సత్ప్రవర్తన కారణంగా రిలీజ్ చేసే ఖైదీల లిస్ట్‌లో భగవంత్ కేసరి పేరు చేర్చుతాడు. దీంతో భగవంత్ జైలు నుంచి విడుదల అవుతాడు. బయటకు రాగానే జైలర్ శ్రీకాంత్ ఇంటికి వెళ్తాడు. అదే రోజు శ్రీకాంత్ రోడ్డు యాక్సిడెంట్లో మరణిస్తాడు. దీంతో అతని కూతురు విజ్జి పాప(శ్రీలీల) బాధ్యతను భగవంత్ కేసరి తీసుకుంటాడు. తండ్రి కోరిక మేరకు విజ్జి పాపను ఇండియన్ ఆర్మీలో చేర్పించాలనుకుంటాడు. మరోపక్క వ్యాపారవేత్త రాహుల్ సంఘ్వీ(అర్జున్ రాంపాల్) ప్రభుత్వాన్ని బెదిరించి ప్రాజెక్ట్ V ని దక్కించుకోవాలనుకుంటాడు. దానికి అడ్డుగా వచ్చిన ఉప ముఖ్యమంత్రి(శుభలేఖ సుధాకర్)ని హత్య చేసి.. అతని పీఏ దగ్గర ఉన్న ఆధారాల కోసం వెతుకుతుంటాడు. ఓ కారణంగా విజ్జి పాపను చంపేందుకు సంఘ్వీ మనుషులు ప్రయత్నిస్తారు. అప్పుడు భగవంత్ కేసరి ఏం చేశాడు? అసలు భగవంత్ కేసరి జైలుకు ఎందుకు వెళ్లాడు? ఆదిలాబాద్ ఊచకోత కేసు నేపథ్యం ఏంటి? రాహుల్ సింఘ్వీకి, కేసరికి మధ్య ఉన్న పాత వైరం ఏంటి? చివరకు విజ్జి పాప ఆర్మీలో చేరిందా? లేదా? అదేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘భగవంత్ కేసరి’ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. కామెడీ చిత్రాలను కమర్షియల్ పద్దతిలో తెరకెక్కించి హిట్ సాధించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటే.. కచ్చితంగా కామెడీ ఆశిస్తాం. మరోవైపు బాలయ్య సినిమా అంటే పంచ్ డైలాగ్స్, ఊరమాస్ ఫైట్స్ మస్ట్. కానీ తొలిసారి వీరిద్దరు తమ బలాలను వదిలి చేసిన ప్రయోగమే ‘భగవంత్ కేసరి’. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడే బాలయ్యను కొత్తగా చూడబోతున్నారని చెప్పాడు అనిల్ రావిపూడి. అన్నట్లుగానే బాలయ్యను తెరపై కొత్తగా చూపించాడు. అయితే కథ-కథనం విషయంలో మాత్రం కొత్తదనం లేదు. హీరో తన సొంతూరిని వదిలి దూరంగా బతకడం..దాని వెనుక విలన్ కారణంగా ఉండడం..ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ.. క్లైమాక్స్‌లో హీరో మళ్లీ వచ్చి విలన్ని చంపడం... ఈ తరహా కథతో తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. ‘భగవంత్ కేసరి’ కథ కూడా అలానే ఉంటుంది. కాకపోతే ట్రీట్మెంట్ కాస్త కొత్తగా అనిపిస్తుంది. దానికి కారణం బాలయ్య, శ్రీలీల అనే చెప్పాలి. తెరపై ఇంతవరకు వారిద్దరిని అలాంటి పాత్రల్లో చూడలేదు. అమ్మాయిలను సింహం లెక్క పెంచాలి అని చెబుతూ.. వారినికి కేవలం వంటింటికే పరిమితం చేయొద్దనే సందేశాన్ని ఈ చిత్రం ద్వారా ఇచ్చారు. ఆపదలో ఉన్న ముంబై కోర్టు న్యాయమూర్తి ఫ్యామిలీకి ఓ వ్యక్తి ‘భగవంత్ కేసరి’ కథ చెప్పే సీన్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. ప్రధాన పాత్రల పరిచయానికే దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఓ భారీ ఫైట్ సీన్‌తో హీరో ఇంట్రడక్షన్.. ఆ తర్వాత జైలర్ శ్రీకాంత్.. భగవంత్ కేసరిని కలవడం.. అతని కూతురు విజ్జికి భగవంత్‌తో మంచి బాండింగ్ ఏర్పడటం చూపించారు. అయితే ఇదంతా సాగదీతగా, రొటీన్‌గా అనిపిస్తాయి. జైలర్ శ్రీకాంత్ చనిపోయిన తర్వాత కథ కాస్త ఎమోషనల్‌గా టర్న్ తీసుకుంటుంది. ఈ క్రమంలో వచ్చే ‘ఉయ్యాలో ఉయ్యాల..’ సాంగ్ ఆడియన్స్‌కి రిలీఫ్ ఇస్తుంది. విలన్ మనుషులు విజ్జి పాప వెనుక పడడానికి గల కారణాన్ని కన్విన్సింగ్‌గా చూపించారు. అక్కడి నుంచి కథలో వేగం పెంచుకుంటుంది. ఫస్టాఫ్ స్లోగా అనిపించినా.. ఇంటర్వెల్ సీన్ మాత్రం సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితీయార్థంలో చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అనిల్ రావిపూడి కామెడీ టచ్‌తో బస్‌లో బాలయ్య చేసే యాక్షన్ సీన్ ఆకట్టుకుంటుంది. అలాగే స్కూల్లో బాలయ్య ఇచ్చే స్పీచ్ సందేశాత్మకంగా ఉంటుంది. విలన్ ఇంటికి వెళ్లి హీరో వార్నింగ్ ఇచ్చే సీన్ సినిమాటిక్‌గా అనిపించినా.. అక్కడ హీరో బాలయ్య కాబట్టి పర్వాలేదనిపిస్తుంది. హెలికాఫ్టర్లతో జాన్ విజయ్ వచ్చి కేసరికి సహాయం చేసే ఎపిసోడ్స్.. క్లైమాక్స్‌లో శ్రీలీల చేసే యాక్షన్ సీన్ థ్రిలింగ్‌గా అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే.. భగవంత్ కేసరి పాత్రలో బాలకృష్ణ ఒదిగిపోయాడు. పెప్పర్ అండ్ సాల్ట్ లుక్‌లో తెరపై కొత్తగా కనిపించాడు. తెలంగాణ యాసలో మాట్లాడుతూ.. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ తర్వాత బాగా పండిన పాత్ర శ్రీలీలది. విజ్జి పాప పాత్రలో ఆమె ఒదిగిపోయింది. తెరపై సరికొత్త శ్రీలీలను చూస్తాం. ఎమోషనల్ సీన్స్‌తో పాటు యాక్షన్స్ సన్నివేశంలో కూడా అదరగొట్టేసింది. కాజల్ పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు. సినిమాలో హీరోయిన్ ఉండాలి కాబట్టి ఆమె పాత్రను పెట్టినట్లుగా అనిపిస్తుంది. అర్జున్ రాంపాల్ విలనిజం అంతగా పండలేదు. శరత్ కుమార్, ఆడుకాలం నరేన్, వీటీవీ నగేష్, మురళీధర్ గౌడ్, రఘుబాబు, జయచిత్ర, రచ్చ రవి తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. తమన్ నేపథ్య సంగీతం బాగుంది. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. పాటల విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్‌ని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘భగవంత్ కేసరి’ మూవీ ట్విటర్ రివ్యూ
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. శ్రీలీల కీలక పాత్ర పోషించింది. అనిల్ రావిపూడి అంటే కామెడీ.. బాలయ్య అంటే మాస్. ఈ రెండింటికి భిన్నంగా ‘భగవంత్ కేసరి’ ఉంటుందని చిత్రబృందం మొదటి నుంచి వచ్చింది. దీంతో బాలయ్యను అనిల్ ఎలా చూపించారనే క్యూరియాసిటీ అభిమానుల్లో మొదలైంది. అందుకే ‘భగవంత్ కేసరి’పై బాలయ్య ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ అంచనాలు పెరిగాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ఈ చిత్రంపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్ 19) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. ట్విటర్లో ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. బాలయ్యను కొత్తగా చూపించినప్పటికీ.. నెరేషన్ చాలా ఫ్లాట్‌గా ఉందని అంటున్నారు. నటన పరంగా బాలయ్య పర్వాలేదనిపించినా.. అనిల్ రావిపూడి కథనం సరిగా లేదని కొంతమంది అభిప్రాయ పడుతున్నారు. శ్రీలీల అయితే తెరపై కొత్తగా కనిపించించిందని చెబుతున్నారు. Just Now Completed My show 🤩 Movie Mathram Excellent Ra ayya 💥💥 Thaman anna BGM ayithey Next Level🥵💥💥 Anil Anna New Version 🔥🔥 My Rating 3/5 #BhagavanthKesari #Balakrishna pic.twitter.com/5TxGl3Z7dY — Rebel Star (@Pranay___Varma) October 19, 2023 #BhagavanthKesari 🔥 I don’t care 👉#NBK #kcpd acting 👉#thaman BGM 👉#srileela pure innocent acting 👉different zoner script 👉 #AnilRavipudi direction👌Hittu bomma😍Kcpd babu🦁 @NBKTrends @MusicThaman @sreleelaa @AnilRavipudi @Nandamurifans pic.twitter.com/b2qNevmZgw — Shanmukh Koyyalamudi (@shanmukh_k_95) October 18, 2023 Anil Ravipudi gave a decent commercial film that’s not of typical Balayya style & not a typical Anil film either. Though a couple of ideas & emotions didn’t work👎 , majority action blocks were pure blast💥 so, Absolutely kakapoyina, to an extent KCPD🔥(2.75/5) #BhagavanthKesari pic.twitter.com/N4b1HZcVKC — Kittu (@Kalyanchowdaryy) October 18, 2023 Just finished watching #BhagavanthKesari movie, it was very nice movie and treat to watch #NandamuriBalakrishna garu with @AnilRavipudi way of present. I really enjoyed the movie. Especially the new dialogs #NBK Screen Presence and other artists performances Simply superb 👌 pic.twitter.com/DqN6fGlNUg — Murali Aari (@murali173) October 18, 2023 #BlockBusterBhagavanthKesari 🔥💥 @AnilRavipudi Unanimous B L O C K B U S T E R 💥🔥 Hatrick for #Balayya 🥁🥁#JaiBalayya 🔥🤙🤙 Happy ga velli movie chudandi.. Balayya Never Before, Archakam🥁#Balayya iche High peaks 💥🦁#BhagavanthKesari 🤙🤙🥁🥁 BhagavanthKesariOnOct19th pic.twitter.com/5TVQXt2kUu — ROHIT CHOWDARY K 🇮🇳 (@ROHITCHOWDARYK2) October 18, 2023 #BhagavanthKesari Review: Subtle yet MASS!#Balayya telangana dialect🔥#BalaKrishna & #SreeLeela bonding👌🏻#AnilRavipudi Dialogues💥 Story is routine but #NBK subtle acting, emotions & underlying msg itself is a worth Good Family Watch! Rating:3.25/5#BhagavanthKesariReview pic.twitter.com/nYN3Ac637l — World Cinema (Updates & Reviews) (@UrsWorldCinema) October 19, 2023 Just finished watching #BhagavanthKesari movie, it was very nice movie and treat to watch #NandamuriBalakrishna garu with @AnilRavipudi way of present. I really enjoyed the movie. Especially the new dialogs #NBK Screen Presence and other artists performances Simply superb 👌 pic.twitter.com/DqN6fGlNUg — Murali Aari (@murali173) October 18, 2023 -
సినిమా రిలీజ్‌కి ముందే రూ 3.5 కోట్లు నష్టం?
'భగవంత్ కేసరి' సినిమాతో బాలకృష్ణ.. ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యాడు. అందుకు తగ్గట్లే ప్రమోషన్స్ చేశారు. కానీ 'లియో' దెబ్బకు బాలయ్య చిత్రానికి అనుకున్నంతగా హైప్ రాలేదు. బుకింగ్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా కాదన్నట్లు చిత్ర నిర్మాతలు ఓ విషయంలో నష్టపోయారనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఇంతకీ ఏంటి విషయం? (ఇదీ చదవండి: విజయ్ 'లియో' దెబ్బకు వెనకబడిపోయిన బాలకృష్ణ!) బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబినేషన్లో తీసిన సినిమా భగవంత్ కేసరి. ట్రైలర్ బాగానే ఉన్నప్పటికీ ఓ మాదిరి అంచనాలే ఏర్పడ్డాయి. అక్టోబరు 19న థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీ కోసం బాలయ్య 'దంచవే మేనత్త' పాటని రీమిక్స్ చేశారు. తాజాగా ప్రమోషన్స్‌లో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ విషయాన్ని వెల్లడించాడు. రెండోవారం నుంచి ఈ పాటని సినిమాకు జోడీస్తామని అన్నాడు. కానీ ఇప్పుడీ విషయంలో వెనక్కి తగ్గినట్లు సమాచారం. తాజాగా 'భగవంత్ కేసరి' ప్రివ్యూ వేయగా.. సినిమా చూసినోళ్లు ఈ రీమిక్స్ పాట గురించి ప్రస్తావించారట. ఓవరాల్ మూవీలో ఇది సెట్ కాలేదని, అతికించినట్లు ఉందని అన్నారట. దీంతో ఈ పాటని సినిమాలో పెట్టే ఆలోచన పూర్తిగా విరమించుకున్నారట. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం ఈ సాంగ్ కోసం ఖర్చు చేసిన రూ.3.5 కోట్లు నిర్మాతలు నష్టపోయినట్లే. మరి ఇది నిజమా కాదా అనేది మరో వారం ఆగితే తెలిసిపోతుంది. (ఇదీ చదవండి: హీరో ప్రభాస్ పెళ్లి.. పెద్దమ్మ శ్యామలాదేవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్) -
విజయ్ దెబ్బకు వెనకబడిపోయిన బాలకృష్ణ!
ఈసారి దసరా బరిలో మూడు పెద్ద సినిమాలు. వీటిలో ఏది హిట్ అయినాసరే బాక్సాఫీస్ కళకళాలాడిపోవడం గ్యారంటీ. అందుకు తగ్గట్లే ఏ మూవీకి ఆ మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచారు. తమ సినిమాపై హైప్ తీసుకొచ్చేందుకు ఫుల్ బిజీగా ఉన్నారు. కానీ ఓ విషయంలో మాత్రం తమిళ హీరో విజయ్ కంటే తెలుగు హీరో బాలయ్య వెనకబడిపోయారు. ఇంతకీ ఏంటా విషయం? (ఇదీ చదవండి: 'లియో' మూవీ.. రెమ్యునరేషన్ ఎవరికెంత ఇచ్చారు?) ఈ శుక్రవారం రిలీజయ్యే సినిమాలు 'లియో', 'భగవంత్ కేసరి', 'టైగర్ నాగేశ్వరరావు'. ఈ మూడింటిలో మీరు ఏ సినిమాక వెళ్తారని అడిగితే దాదాపుగా 'లియో' అనే చెప్తారు. ఇదేదో మేం కల్పించి చెబుతున్న మాట అయితే కాదు. ఎందుకంటే విజయ్, బాలయ్య సినిమా టికెట్ల బుకింగ్స్ ఆన్లైన్లో ఓపెన్ చేశారు. అయితే అనుహ్యాంగా 'భగవంత్ కేసరి' కంటే 'లియో' బుకింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్‌లోని మల్టీప్లెక్స్‌ల్లో 'లియో', 'భగవంత్ కేసరి' సినిమాలకు సమంగా స్క్రీన్స్ లభించాయి. కానీ లోకేశ్ కనగరాజ్ క్రేజ్ దృష్ట్యా 'లియో' వైపు ప్రేక్షకులు మొగ్గుచూపుతున్నట్లు అనిపిస్తుంది. అదే టైంలో బాలయ్య సినిమా బుకింగ్స్ మాత్రం కాస్త నెమ్మదిగా సాగుతున్నాయి. ఇక 'టైగర్ నాగేశ్వరరావు' బుకింగ్స్ అయితే ఓకే అనిపిస్తుంది. మరి ఈ మూడింట్లో ఏది హిట్ అవుతుందో? ఏది ఫట్ అవుతుందో తెలియాలంటే వెయిట్ అండ్ సీ. (ఇదీ చదవండి: హీరో ప్రభాస్ పెళ్లి.. పెద్దమ్మ శ్యామలాదేవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్) -
Sreeleela Half Saree: అమ్మో ఏంటి ఈ అందం శ్రీలీల (ఫొటోలు)
-
శ్రీలీల ఎవరి అమ్మాయో తెలిస్తే అంటూ షాకిచ్చిన అనిల్ రావిపూడి
స్టార్ హీరోయిన్ శ్రీలీల వరుసగా స్టార్ హీరోలతో నటించే అవకాశాలు దక్కించుకోవడమే కాకుండా తన టాలెంట్‌తో డ్యాన్స్,నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావు అనే మాటకు చెక్ పెడుతూ టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా నేడు నిలిచింది. ఓ వైపు యంగ్ హీరోలతో ఆడిపాడుతూనే మరోవైపు 'భగవంత్ కేసరి'లో సీనియర్ హీరో బాలకృష్ణకు కుమార్తెగా నటించింది. ఇదొక్కటి చాలు ఆమె తీసుకునే నిర్ణయాలు ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయో చెప్పడానికి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 'భగవంత్ కేసరి'లో బాలకృష్ణకు ఏమాత్రం తగ్గకుండా తను నటించిదని ట్రైలర్లోనే అర్థం అవుతుంది. (ఇదీ చదవండి: ప్రేక్షకుల గుండెల్ని తాకిన నయని పావని.. ఈ కారణంతో నో రీ ఎంట్రీ) తాజాగా శ్రీలీల, అనిల్ రావిపూడి ఒక ఇంటర్వ్యూలో వారిద్దరి మధ్య ఉన్న బంధుత్వం ఎలాంటిదో రివీల్ చేశాడు. మొట్టమొదటిసారిగా, దర్శకుడు అనిల్ రావిపుడు తాను ఎప్పుడూ అందరితో పంచుకోని విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. స్టార్ హీరోయిన్ శ్రీలీల కుటుంబంతో ఆయనకు ఉన్న రిలేషన్‌షిప్‌ను మొదటిసారి బయటపెట్టాడు. శ్రీలీల అమ్మగారు డాక్టర్ స్వర్ణ సొంతూరు ఒంగోలు దగ్గరలో ఉన్న పొంగులూరు అని అదే ఊరు తన అమ్మమ్మగారిదని అనిల్ తెలిపాడు. శ్రీలీల తల్లి స్వర్ణ తనకు సిస్టర్ వరుస అవుతుందని ఆయన పేర్కొన్నాడు. ఆ లెక్కన అనిల్‌కు శ్రీలీల కోడలు అవుతుంది. భగవంత్ కేసరి సెట్స్‌లో అందరి ముందూ అనిల్ణు డైరెక్టర్ గారు అని పిలిచే శ్రీలీల.. ఎవరూ లేనప్పుడు మాత్రం 'మామయ్య' అంటూ ఆట పట్టించేదట. శ్రీలీల పుట్టింది తెలుగు గడ్డపైనే అయినా ఆమె పెరిగింది, చదువుకున్నదంతా బెంగళూరు, అమెరికాలోనే కానీ తన అమ్మమ్మ ఊరు అయిన పొంగులూరుకు ప్రతి ఏటా వస్తూనే ఉంటుందని అనిల్ తెలిపాడు. (అమ్మో ఏంటి ఈ అందం శ్రీలీల ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Bhagavanth Kesari Press Meet: బాలయ్య ‘భగవంత్ కేసరి’ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
ఒక ఓవర్ అయిపోయింది.. ‘భగవంత్ కేసరి’ కొత్తగా ట్రై చేశా: అనిల్ రావివూడి
‘ఇప్పటి వరకు నేను ఆరు సినిమాలు చేశాను. అంటే ఒక ఓవర్ అయిపోయింది. ఇకపై కొత్తగా ట్రై చేద్దామని అనుకున్నాను. కంప్లీట్ హానెస్ట్ ఇంటెన్స్ డ్రామా తో ఓ సినిమా చేయాలనిపించి..భగవంత్ కేసరి చేశాను. ఈ చిత్రం చాలా ఏళ్లు గుర్తిండిపోతుంది’ అని అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘భగవంత్ కేసరి’. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్ర పోషిస్తున్నారు. అక్టోబర్ 19న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా అనిల్ రావిపూడి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► నా గత సినిమాకు పూర్తి భిన్నంగా భగవంత్ కేసరి ఉంటుంది. కొత్తగా ఓ సినిమా ట్రై చేద్దామని ఇది చేశాను. దానికి బాలకృష్ణ రూపంలో నాకు సరైన ఆయుధం దొరికింది. కథ అద్భుతంగా కుదరడంతో పాటు మంచి స్టార్ కాస్ట్ దొరికింది. ఈ చిత్రం కచ్చితంగా చాలా ఏళ్లు గుర్తిండిపోతుంది. ► ‘సరిలేరు నీకెవ్వరు’ మహేష్ బాబు గారితో ఒక ఆర్మీ కథ చేయాలని ఫిక్స్ అయి చేశాం. ‘భగవంత్ కేసరి' లో చాలా గోల్స్ వున్నాయి, ఆర్మీకి పంపడంతో పాటు అమ్మాయిని స్ట్రాంగ్ ఎలా చేయాలనే క్యారెక్టరైజేషన్ కూడా వుంటుంది. అమ్మాయి కి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఎలా వీక్ అయ్యింది? ఎలా స్ట్రాంగ్ చేయాలి ? దాని బ్యాక్ డ్రాప్ గోల్ ఆర్మీని తీసుకున్నాం. 'అమ్మాయిని ఒక సింహంలా పెంచాలి' అనే అండర్ లైన్ బ్యూటీఫుల్ కంటెంట్ ఉంది. ► ఈ చిత్రానికి బ్రో ఐ డోంట్ కేర్ అనే టైటిల్ ని పరిశీలించాం. అయితే బాలయ్య బాబు టైటిల్ అంటే ఒక ఫోర్స్ ఉండాలి. బ్రో ఐ డోంట్ కేర్ కంటే ఏదైనా ఒక పేరు వుంటే ఎక్కువ కాలం గుర్తుండిపోతుంది. సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు ఇలా పేర్లు వునప్పుడు ఎక్కువ రోజులు ప్రేక్షకులతో సినిమా ట్రావెల్ అవుతుందని భగవంత్ కేసరి అని పెట్టాం. దీనికి నేలకొండ అనే పేరు చేర్చి ఎన్ బికే గా కాయిన్ చేయడంతో మరింత ఆకర్షణ వచ్చింది. ► భగవంత్ కేసరి లో ఎంటర్ టైన్మెంట్ చాలా సెటిల్ గా ఉంటుంది. ట్రీట్మెంట్ కూడా చాలా సహజంగా చేశాం. లార్జర్ దేన్ లైఫ్ యాక్షన్ సీక్వెన్స్ లు కూడా చాలా రియలిస్టిక్ గా చేశాం. అలాగే నా మార్క్ ఫన్ టింజ్ సినిమాలో అక్కడక్కడ టచ్ అవుతూనే ఉంటుంది. ► ఈ చిత్రంలో అర్జున్ రామ్ పాల్ విలన్‌గా చేశాడు. బాలయ్యకు ఎదురుగా నిలబడే పాత్ర అది. అర్జున్ రాం పాల్ గారిని ఓ శాంతి ఓం లో చూసిననప్పటినుంచి ఇష్టం. ఆయన వాయిస్, ప్రజన్స్ చాలా బావుటుంది. తెలుగులోకి తీసుకొస్తే బావుటుందని ఆయన కలవడం జరిగింది. ఆయన కూడా చాలా ఎక్సయిట్ అయ్యారు. అయితే ఆయన ముందే భాష విషయంలో ఒక నిర్ణయంతో ఉన్నారు. ప్రామ్టింగ్ చేయను నేర్చుకొని చెప్తా అన్నారు. ముందే డైలాగ్స్ ఇవ్వమని చెప్పారు. ప్రతి డైలాగుని బట్టిపట్టారు. ఆయనే స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పారు. ► ప్రస్తుతం నా దృష్టి మొత్తం భగవంత్ కేసరి విడుదల పైనే ఉంది. విడుదలైన తర్వాతే మరో సినిమా గురించి ఆలోచిస్తా. ఐతే ఏది చేసినా డిఫరెంట్ గా ఛాలెంజింగ్ గా చేయాలని ఉంది. -
నాడు చిరంజీవిపై ట్రోల్స్.. నేడు బాలకృష్ణను ఏమనాలి?
ఒక సినిమా విడుదలకు రెడీగా ఉందంటే ఆ సమయంలో పలు వేదికలపై చేసే హీరో ప్రసంగం కీలకం. కానీ బాలకృష్ణ సినిమాలకు అలాంటి పరిస్థితి వుండదు. ఆయన స్పీచ్ ఎక్కడో మొదలు పెట్టి ఎక్కడికో వెళ్లిపోతాడు. ఎంతో సమయం మాట్లాడినా సినిమాకు చెందిన సబ్జెక్ట్ గురించి మాత్రం అస్సలు మాట్లాడే ప్రసక్తే ఉండదు. ఒక్కోసారి తన సినిమాకు పనిచేసిన కొందరి టెక్నీషియన్ల పేర్లు కూడా ఆయనకు గుర్తుకు ఉండవు. ఆయన మాట్లాడే సమయంలో ఎవరైనా నవ్వినారు అనుకో చచ్చారే.. వారిపై అసహనంతో ఊగిపోవడం తప్ప బాలయ్య చేసేదేమీ లేదు. ఎల్లప్పుడూ రోజులు ఒకలా ఉండవు. ఓ రోజు వస్తుంది. బ్లడ్డు బ్రీడు పూచికపుల్లకూ కొరగావు. బూతులు, కోపాలు, తన్నులు. కొట్టడం వంటివి ఎల్లకాలమూ సాగవు. బాలయ్య ఇలా ఉన్నాడు కాబట్టే NTR వారసత్వాన్ని లోకేష్ భుజంపై చంద్రబాబు ఎప్పుడో పెట్టేశాడు. బాలయ్య నీతులకు మాత్రమే పరిమితం సీనియర్ ఎన్టీఆర్ గారు జీవించి ఉన్న రోజుల్లో ఆడవారికి ప్రథమ గౌరవం ఇచ్చేవారు అని తెలిసిందే. కానీ ఆయనకు వారసుడిగా ఉండాల్సిన బాలకృష్ణ.. కుమారుడిగా మాత్రమే మిగిలిపోయాడు. ఆడది కనిపిస్తే కడుపు అయినా చెయ్యాలి.. ముద్దు అయినా పెట్టాలి అని బాలయ్య చేసిన చిల్లర కామెంట్లు తెలుగు ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరు. ఈ వ్యాఖ్యలకు తోడు భగవంత్ కేసరి సినిమా వేదికపై బాలయ్య చేసిన 'గ్రౌండ్ ఫ్లోర్' కామెంట్లు వైరల్ అవుతున్నాయి. భగవంత్ కేసరి సినిమా వేదికపై కొడుకు గురించి మాటలు చెబుతూ తన చేతిని ఓ విధంగా ఊపారు. ఈ మధ్య ఇలా ఊపడం అన్నది బాలయ్యకు బాగా అలవాటు అయినట్లుంది. కొద్దిరోజుల క్రితం అసెంబ్లీలో కూడా అలాగే ఊపారు. కానీ పక్కన కూతురు వయసు ఉన్న శ్రీలీల లాంటి చిన్న అమ్మాయిని పెట్టుకుని ఇలాంటి చిల్లర చేష్టలు చేయడం బాలకృష్ణకే సాధ్యం అని చెప్పవచ్చు. నాడు చిరంజీవిపై ట్రోల్స్ భోళాశంకర్‌లో చెల్లెలిగా నటించిన కీర్తి సురేష్ చేతిని ఆఫ్ స్క్రీన్‌లో చిరంజీవి సరదాగా పట్టుకున్నారనే గదా మెగాస్టార్‌ను నీ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. మరి సినిమాలో కూతురిగా నటించిన శ్రీలీలతో హీరోగా రొమాన్స్ చేయాలని ఉందనే గ్రౌండ్ ఫ్లోర్ లాంటి వ్యాఖ్యలు చేసిన నిన్ను ఏమని అనాలి..? చెప్పు బాలయ్య అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. జైల్లో బావ.. స్టేజ్ పై బాలయ్య జైల్లో బావ.. స్టేజ్ పై బాలయ్య అంటే రాజకీయ స్టేజీపై అనుకునేరు.. కాదు.. కాదు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీని నడిపే నాయకుడెవరనే ప్రశ్న ఉత్పన్నమైంది. పార్టీని లోకేశ్ ముందుకు నడిపిస్తారని అందరూ అనుకున్నారు. తీరా చూస్తే, అందరి కంటే ముందు ఏకంగా రాష్ట్రాన్ని వదిలిపెట్టి సుమారు 30రోజుల పాటు ఢిల్లీలో దాక్కుని చెడ్డపేరు తెచ్చుకున్నాడు. ఈ లోపు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ యాక్టీవ్ అయ్యాడు. ఏకంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సీట్లో బాలయ్య ఆసీనులయ్యారు. తరుచూ చిల్లర వ్యాఖ్యలు చేస్తూ చెడ్డపేరు తెచ్చుకుంటున్న బాలకృష్ణ చేతిలోకి టీడీపీ పగ్గాలు ఎక్కడ వెళ్తాయోనని చంద్రబాబు గ్రహించారు. తన బుర్రకు పనిచెప్పి బ్రాహ్మణి, భువనేశ్వరిలను వెంటనే తెరపైకి తెచ్చారు. తెలంగాణలో ఊసేలేని తెలుగుదేశం పార్టీ బాధ్యతల్ని బాలయ్యకు కట్టబెట్టారు. దీంతో ఏపీ వైపు బాలయ్య కన్నెత్తి చూడకుండా జైళ్లో నుంచే చంద్రబాబు స్కెచ్ వేశాడు. జైల్లో ఉన్న తన బావ చంద్రబాబు పక్కాగా రాజకీయ చదరంగం ఆడుతూ బాలయ్యను ఏపీ నుంచి తప్పిస్తే... నందమూరి బాలకృష్ణ తన అజ్ఞానంతో స్టేజీలపై ఇలా చిల్లర వ్యాఖ్యలు చేసుకుంటూ కాలం గడిపేస్తున్నాడు. -
ఆ సంఘటన తర్వాత డాక్టర్ అవ్వాలని ఫిక్సయ్యా: శ్రీలీల
ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాటెండ్ హీరోయిన్ ఎవరని అంటే అందరు చెప్పే ఒకే ఒక పేరు శ్రీలీల. తనదైన అందం, అభినయంతో ఈ తెలుగు బ్యూటీ దూసుకెళ్తోంది. తొలి సినిమా పెళ్లి సందD బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోయినా.. శ్రీలీలకు మాత్రం యమ క్రేజీ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘ధమాకా’ తో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అరడజన్కు పైగా తెలుగు సినిమాలు ఉన్నాయి. అందులో బాలయ్యతో కలిసి నటించిన భగవంత్ కేసరీ అక్టోబర్ 19న విడుదల కాబోతుంది. ఆ తర్వాత వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’, మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’.. ఇలా రాబోయే 5 నెలల్లో నెలకో సినిమా శ్రీలీల నుంచి రాబోతుంది. ఇలా యాక్టర్‌గా ఇంత బిజీగా ఉన్న ఈ భామ త్వరలోనే డాక్టర్ కాబోతుంది. ప్రస్తుతం మెడిసిన్ చదువుతోంది. ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు చదువులోనూ రాణిస్తుంది. అంతేకాదు డాక్టర్ కావాలనేదే తన డ్రీమ్ అంటోంది. భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా శ్రీలీల మీడియాతో మాట్లాడుతూ.. తన స్టడీ, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.. యాక్టింగ్ స్కూల్‌ని వెళ్లలేదు మాములుగా నేను భరతనాట్యం మాత్రమే చేసేదాన్ని. యాక్టింగ్‌పై అవగాహన కూడా లేదు. భరత నాట్యం చేసేటప్పుడు నా డ్యాన్స్‌తో కథ చెప్పాల్సి వస్తుంది. ఎలాంటి డైలాగులు లేకుండా కథ చెప్పడం చాలా కష్టం. భరతనాట్యంలో అనుభవం ఉండడం వల్లే నాకు యాక్టింగ్ చేయడం పెద్ద కష్టమనించలేదు. నేను ఏ యాక్టింగ్ స్కూల్‌కి వెళ్లలేదు. రాఘవేంద్రరావు దయ వల్ల ‘పెళ్లి సందD’ లో అవకాశం రావడం..ఆ తర్వాత తెలుగు ప్రేక్షకుల ప్రేమతో నన్ను దగ్గరకు చేర్చుకోవడంతో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. నటిగా ఎంత బిజీగా ఉన్నా చదువును మాత్రం వదులుకోను. డాక్టర్ కావడమే నా లక్ష్యం. ఆ ఇన్సిడెంట్ నా మైండ్‌ని మార్చేసింది నేను డాక్టర్ అవ్వాలని నిర్ణయం తీసుకోవడానికి వెనక ఓ స్టోరీ ఉంది. మా ఇంట్లో అమ్మతో పాటు అన్నయ్య కూడా డాక్టరే. ఓ సారి నేను అమ్మమ్మ గారి ఇంటికి వెళ్లాను. అది మారుమూల గ్రామం. ఓ రోజు అమ్మమ్మ సడెన్‌గా కిందపడిపోయింది. ఏం చేయాలో తెలియదు. అందరితో పాటు నేను కూడా అక్కడే నిల్చోని చూస్తున్నా. కానీ అన్నయ్య వెంటనే వచ్చి అమ్మమ్మను పైకిఎత్తి వీపు భాగాన్ని పుష్ చేశాడు. దీంతో అమ్మమ్మ ప్రమాదం నుంచి బయటపడింది. అన్నయ్య మెడిసిన్ చదవుతున్నాడు కాబట్టి.. ఆ సమయంలో ఏం చేయాలో అది చేశాడు. కానీ నాకు సహాయం చేయాలని అనిపించినప్పటికీ ఎలా చేయాలో తెలియదు. ఆ రోజే ఫిక్సయ్యా.. నేను ఎప్పటికైనా డాక్టర్ అవ్వాలని. అందుకే మెడిసిన్ కోర్సు తీసుకున్నాను. యాక్టింగ్‌తో పాటు మెడిసిన్ కోర్స్ కూడా పూర్తి చేస్తాను. షూటింగ్స్‌తో బిజీగా ఉన్నా.. పరీక్షలు ఉంటే రాత్రివేళల్లో చదువుకుంటాను. ఇప్పటికీ ఒక సినిమా ఒప్పుకుంటే..దాని ఎఫెక్ట్ నా చదువుపై ఉంటుందని తెలుసు.కానీ మంచి పాత్రలు ఇప్పుడే వస్తున్నాయి. అందుకే కొంచెం కష్టమైనా ఒప్పుకుంటున్నాను. రాత్రివేళల్లో చదువుకుంటున్నాను’ అని శ్రీలీల చెప్పుకొచ్చింది. -
రవితేజ సినిమాకు ఇంత అన్యాయమా అంటూ ఫ్యాన్స్ ఫైర్
టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా 'టైగర్ నాగేశ్వరరావు' విడుదలకు రెడీగా ఉంది. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. సినిమా రన్‌టైమ్ 3.02 గంటలు ఉంది. నిడివి ఎక్కువగా ఉన్నా ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) 1970ల్లో స్టూవర్టుపురంలో పేరు మోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రంలో చాలా ఏళ్ల తర్వాత నటి రేణు దేశాయ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ అంచనాలతో విడుదల అవుతున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి థియేటర్ కష్టాలు ఏర్పడ్డాయి. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కేవలం 30 లోపు థియేటర్లే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి థియేటర్లు దొరకడం లేదని తెలుస్తోంది. ఈ సినిమా విడుదలకు ఒక్కరోజు ముందు అక్టోబర్ 19న విజయ్ 'లియో' థియేటర్లలోకి వస్తోంది. దీంతో తమిళనాడులోని అన్ని థియేటర్లు విజయ్ సినిమాకే ప్రథమ ప్రయారిటీ ఇచ్చాయి. దీంతో తమిళనాడులో రవితేజ చిత్రానికి కేవలం 30లోపు థియేటర్లు మాత్రమే మిగిలాయట. అవి కూడా అంత చెప్పుకోతగిన థియేటర్లు కాదని సమాచారం. ఇకపోతే కర్ణాటకలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో రవితేజ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తెలుగులోనూ రవితేజకు ఎదురుదెబ్బే... 'లియో' సినిమాను తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ విడుదల చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని ఈ సినిమా సుమారు రూ.22 కోట్లకు థియేట్రికల్ రైట్స్ విక్రయించారని టాక్ ఉంది. ఒక రకంగా విజయ్ కెరీర్లో ఇదే అత్యధిక తెలుగు బిజినెస్ అని సమాచారం. దీంతో తెలుగులో కూడా ‘లియో’కి అత్యధిక థియేటర్లు కేటాయింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 'లియో' సినిమా వల్ల బాలకృష్ణ 'భగవంత్ కేసరి' థియేటర్లు తగ్గించమని సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ గతంలో చెప్పారు. కానీ ఈ రెండు సినిమాలు విడుదలైన ఒక్కరోజు తర్వాత వస్తోన్న 'టైగర్ నాగేశ్వరరావు'కు మాత్రం భారీ దెబ్బే తగలబోతున్నట్లు తెలుస్తోంది. రవితేజ సినిమా కన్నా 'లియో'కే తెలుగులో ఎక్కువ థియేటర్లు ఇచ్చినట్లు సమాచారం. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నారు. తమిళనాడులో తెలుగు సినిమాకు థియేటర్లే ఇవ్వనప్పుడు అక్కడి సినిమాలకు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా థియేటర్లు కేటాయించడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాకు జరుగుతున్న అన్యాయాన్ని నిర్మాత అభిషేక్ అగర్వాల్ ప్రశ్నించాలని రవితేజ ఫ్యాన్స్ కోరుతున్నారు. -
బాలకృష్ణ.. నీ గ్రౌండ్ ఫ్లోర్ సంగతేంటి..?
ఒక ఎమ్మెల్యేగా ఉన్న నందమూరి బాలకృష్ణకు ఆమాత్రం ఉచ్చంనీచం తెలియదా..? ఎక్కడ ఎలా మాట్లాడాలో కూడా తెలియదా..? నాన్సెన్స్, బాలయ్యకు సంస్కారం లేదా..? అనే కామెంట్లు కొన్ని వేల సంఖ్యలో సోషల్‌మీడియాలో కనిపిస్తుంటాయి. ఆయన చిల్లర వ్యాఖ్యలు చేసిన ప్రతిసారి బాలయ్యను తప్పుపట్టడమే తప్పు. ఎక్కడ ఏం మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో, ఎంత పరిపక్వంగా మాట్లాడాలో తెలిస్తే తను బాలయ్య ఎందుకవుతాడు? బాలయ్య సక్కనోడయితే బాబు చేతిలోకి టీడీపీ వెళ్లేది కాదు, ఆయన సీఎం అయ్యేవాడు కాదు. ఇదీ అందరికీ తెలిసిన సత్యం. బాలకృష్ణ తాజా చిత్రం భగవంత్ కేసరి అక్టోబర్ 19న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో తన కూతురుగా యంగ్ హీరోయిన్ శ్రీలీల నటించడం విశేషం. కానీ ఈ విషయంలో బాలయ్య కొంతమేరకు బాగా హర్ట్ అయినట్లు ఉన్నాడు. ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిన శ్రీలీలకు తండ్రిగా నటించడం బాలయ్యకు నచ్చినట్లు లేదు. అందుకే తన మనుసులోని మాటను బహిరంగంగానే ఇలా చెప్పాడు. 'ఈరోజు పొద్దున్నే శ్రీలీలతో ఓ మాట అన్నాను. ఇద్దరం కలిసి నటించాం సరే. నువ్వు చిచ్చా...చిచ్చా అని నన్ను టార్చర్ పెట్టావ్. నెక్ట్స్ సినిమాలో మనం హీరోహీరోయిన్లుగా నటిద్దామని చెప్పాను. ఇదే మాట ఇంటికెళ్లి మా కుటుంబ సభ్యులతో చెప్పాను. నా కొడుకు మోక్షజ్ఞకు కోపమొచ్చింది. ఏం డాడీ, నేను హీరోగా రాబోతున్నాను, నువ్వు ఆవిడకు ఆఫర్ ఇస్తానంటావేంటి? నీకు గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా డాడీ అన్నాడు. నాకు కాసేపు అర్థంకాలేదు. నన్ను అంత మాట అన్నాడేంటని ఉండిపోయాను.' అని స్టేజీమీదే బాలయ్య అన్నాడు. చివరకు కుటుంబ పరువు తీస్తున్న బాలయ్య తను ఒక ఎమ్మెల్యే, సీనియర్ హీరో అనే విషయాన్ని బాలయ్య మరిచిపోయి చాలా కాలం అయింది. నోటికి ఏదొస్తే అది మాట్లాడటం ఇదేం ఆయనకు కొత్త కాదు. వేదికలపై ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేయడం ఆ తర్వాత నవ్వులపాలవడం ఆయనకు సహజమేనని తెలిసిందే. మా బ్లడ్ వేరు.. బ్రీడు వేరు అని ఎప్పుడూ చెప్పుకు తిరిగే బాలయ్య ఎప్పటి లాగే భగవంత్ కేసరి సినిమా వేదికపై తన స్పీచ్‌లో 'నాన్నగారు' చుట్టూ తిరిగి తిరిగి ఆఖరికి కుటుంబం పరువు తీసే వ్యాఖ్యలతో ముగిసింది. దీంతో ట్రోలర్స్ కు కావాల్సినంత స్టప్ను ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ అందించాడు. నీ గ్రౌండ్ ఫ్లోర్ సంగతి ఏంటి? ఏ కార్యక్రమంలో చూసినా బాలకృష్ణ తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ గురించి కనీసం రెండు మాటలు అయినా మాట్లాడుతాడు. ఎందుకంటే ఆ పేరు మాత్రమే బాలయ్యకు గౌరవం తెస్తుంది. అందుకే చంద్రబాబు నుంచి బాలయ్య వరకు నేటికీ అన్నగారి పేరు పదేపదే జపిస్తుంటారు. ఇలాంటి నేపథ్యంలో తన కొడుకు మోక్షజ్ఙ తనను 'ఏం గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా' అని తిట్టాడని బాలయ్య చెప్పడం ఒక విధంగా తన కొడుకు పరువుతో పాటు నందమూరి కుటుంబం పరువును తీయడమేనని పలువురు కామెంట్లు చేస్తున్నారు. బాలయ్యకు కొడుకు ఇచ్చే గౌరవం ఇదా..? అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. తండ్రిని పట్టుకుని ఏం గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా..? అని అడిగేంత సంస్కార హీనుడు బాలయ్య కొడుకు అని జనం నవ్వుకోరా అని కోందరు తప్పుబడుతున్నారు. తండ్రి బాటలోనే కుమారుడు కూడా రెడీ అవుతున్నాడా..? అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. -
హీరోయిన్ శ్రీలీలకు పెళ్లి? ఈ రూమర్స్‌లో నిజమెంత?
ప్రస్తుతం తెలుగు సినిమాల్లో సెన్సేషన్‌గా మారిపోయిన హీరోయిన్ శ్రీలీల. ఫస్ట్ సినిమాతో హిట్ కొట్టనప్పటికీ.. ఆ తర్వాత మాత్రం అరడజనుకు పైగా మూవీస్ ఒప్పుకొంది. దసరా నుంచి మొదలుపెడితే సంక్రాంతి వరకు నెలకో సినిమాతో ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అయిపోయింది. సరిగ్గా ఇలాంటి టైంలో ఈమె పెళ్లి చేసుకోనుందనే రూమర్స్ వచ్చాయి. (ఇదీ చదవండి: గిఫ్ట్ ఇచ్చిన సమంత.. అతడు తెగ మురిసిపోయాడు!) ఇంతకీ ఏం జరిగింది? 'ధమాకా'తో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న శ్రీలీల.. రీసెంట్గా 'స్కంద'తో ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ దసరాకి 'భగవంత్ కేసరి' సినిమాతో థియేటర్లలోకి రానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా బాలకృష్ణ కొడుకుతో ఓ ఫొటోలో ఈమె కనిపించింది. అంతే గాసిప్స్, రూమర్స్ అల్లేశారు. అతడితో పెళ్లికి రెడీ అయిందని న్యూస్ వైరల్ అయింది. శ్రీలీల క్లారిటీ అయితే ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో కుదురుకుంటున్న తనపై ఇలాంటి వార్తలు వచ్చేసరికి శ్రీలీల కాస్త డిస్ట్రర్బ్ అయినట్లు అయింది. పెళ్లి అంటూ వస్తున్న రూమర్స్‌లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చేసింది. ఇలాంటి వాటిని రాసేముందు నిజం తెలుసుకోవాలని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా భగవంత్ కేసరి తర్వాత ఆదికేశవ, ఎక్స్ట్రా, గుంటూరు కారం సినిమాలతో వరసగా శ్రీలీల థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: చై-సామ్ కలుస్తున్నారంటూ వార్తలు.. షాకిచ్చిన సమంత!)