నందమూరి బాలకృష్ణ పండల మీద గురి పెట్టాడు. సంక్రాంతికి వీరసింహారెడ్డితో పలకరించిన ఈయన భగవంత్ కేసరితో దసరా బరిలోకి దిగాడు. కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అనిల్ రావిపూడి తొలిసారి ఆ జానర్‌ను వదిలేసి ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై హరీశ్ పెద్ది, సాహు గారపాటి నిర్మించారు. తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించిన ఈ మూవీ అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
భగవంత్ కేసరి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.32.33 కోట్లు రాబట్టింది. తాజాగా రెండు రోజుల కలెక్షన్స్‌ను వెల్లడించింది చిత్రయూనిట్. రెండో రోజు ఈ చిత్రం దాదాపు రూ.19 కోట్ల మేర రాబట్టింది. అంటే రెండు రోజుల్లో రూ.51.12 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు తెలిపింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ విడుదల చేసింది. మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు వసూళ్లు కొంత నెమ్మదించినట్లు కనిపిస్తోంది. మరి వీకెండ్‌లో అయినా భగవంత్ కేసరి పుంజుకుంటుందేమో చూడాలి! మరోపక్క టైగర్ నాగేశ్వరరావు, లియో సినిమాలు భగవంత్ కేసరి సినిమాకు గట్టి కాంపిటీషనే ఇస్తున్నాయి. ఈ పోటీని తట్టుకుని బాలకృష్ణ మూవీ బాక్సాఫీస్ దగ్గర నిలబడుతుందా? కలెక్షన్లు పెంచుకుంటుందా? లేదా? చూడాలి!
A #BlockbusterDawath at the Box office 🔥#BhagavanthKesari Grosses 51.12 CR WORLDWIDE IN 2 DAYS 💥💥
— Shine Screens (@Shine_Screens) October 21, 2023
- https://t.co/rrWPhVwU6B
In cinemas now❤️🔥#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman @harish_peddi @sahugarapati7 @JungleeMusicSTH pic.twitter.com/puSAke2was
చదవండి: సింగర్ గీతా మాధురితో విడాకులు.. క్లారిటీ ఇచ్చిన నందు!
Comments
Please login to add a commentAdd a comment