ఓటీటీకి భగవంత్‌ కేసరి.. స్ట్రీమింగ్ అప్పుడే! | Balakrishna Latest Bhagavanth Kesari Movie OTT Expected Release Date And Streaming Platform - Sakshi
Sakshi News home page

Bhagavanth Kesari OTT Partner: ఓటీటీకి భగవంత్‌ కేసరి.. పార్ట్‌నర్ ఫిక్స్!

Published Thu, Oct 19 2023 1:39 PM | Last Updated on Thu, Oct 19 2023 1:51 PM

Balakrishna Latest Movie Bhagavanth Kesari Ott Partner Amazon Prime - Sakshi

నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం‘భగవంత్‌ కేసరి’. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల కీలక పాత్రలో కనిపించింది. అనిల్‌ రావిపూడి అంటే కామెడీ.. బాలయ్య అంటే మాస్‌. ఈ రెండింటికి భిన్నంగా భగవంత్‌ కేసరి సినిమా ఉంటుందని మొదటి నుంచే టాక్ వచ్చింది. దీంతో బాలయ్యను అనిల్‌ ఎలా చూపించారనే క్యూరియాసిటీ అభిమానుల్లో మొదలైంది. అక్టోబర్ 19న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

(ఇది చదవండి: Bhagavanth Kesari : ‘భగవంత్‌ కేసరి’ మూవీ రివ్యూ)

అభిమానుల భారీ అంచనాల మధ్య భగవంత్‌ కేసరి విడుదలైంది. ఉదయం నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో  థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది. ఇదిలా ఉండగా ఈ మూవీ  ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ రిలీజైన 50 రోజుల తర్వాతే ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు సమాచారం. దీని ప్రకారం డిసెంబర్ రెండో వారంలో భగవంత్ కేసరి స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశముంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement