భగవంత్‌ కేసరికి సీక్వెల్‌? అనిల్‌ రావిపూడి ఆసక్తికర కామెంట్స్‌ | Anil Ravipudi Interesting Comments On Bhagavanth Kesari Movie | Sakshi
Sakshi News home page

Bhagavanth Kesari Movie: భగవంత్‌ కేసరికి సీక్వెల్‌? తీసే ధైర్యం లేదన్న డైరెక్టర్‌

Published Tue, Oct 24 2023 1:12 PM | Last Updated on Tue, Oct 24 2023 1:37 PM

Anil Ravipudi Interesting Comments on Bhagavanth Kesari Movie - Sakshi

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం భగవంత్‌ కేసరి. సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించాడు. దసరా కానుకగా అక్టోబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం. పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్స్‌ కూడా బాగానే రాబడుతోంది. సోమవారం ఈ సినిమా విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ సంద్భంగా అనిల్‌ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ముందుగా భగవంత్‌ కేసరి సినిమా కోసం తనతో కలిసి పని చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఈ సినిమాకు సీక్వెల్‌ తీసే ధైర్యం తనకు లేదన్నాడు. ఇప్పటికే భగవంత్‌ కేసరి సినిమా బరువును తనపై వేసుకుని నలిగిపోయానని, సీక్వెల్‌ గురించి తర్వాత చూద్దామని అన్నాడు.

బాలయ్య బాబు శక్తినిస్తే అప్పుడు భగవంత్‌ కేసరి 2 తీస్తామని పేర్కొన్నాడు. సినిమా విషయానికి వస్తే.. ఈ మూవీలో బాలకృష్ణ రెండు డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటించాడు. యంగ్‌ హీరోయిన్‌ శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో నటించింది. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించింది.

చదవండి: ఓటీటీలో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ, స్ట్రీమింగ్‌ అప్పటినుంచే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement