బాలకృష్ణ.. నీ గ్రౌండ్‌ ఫ్లోర్‌ సంగతేంటి..? | Balakrishna Degrade His Son Mokshagna | Sakshi
Sakshi News home page

Balakrishna: చివరకు ఈ విధంగా కుటుంబ పరువు తీస్తున్న బాలకృష్ణ

Published Thu, Oct 12 2023 7:17 PM | Last Updated on Thu, Oct 12 2023 7:23 PM

Balakrishna Degrade His Son Mokshagna - Sakshi

ఒక ఎమ్మెల్యేగా ఉ‍న్న నందమూరి బాలకృష్ణకు ఆమాత్రం ఉచ్చంనీచం తెలియదా..? ఎక్కడ ఎలా మాట్లాడాలో కూడా తెలియదా..? నాన్సెన్స్, బాలయ్యకు సంస్కారం లేదా..? అనే కామెంట్లు కొన్ని వేల సంఖ్యలో సోషల్‌మీడియాలో కనిపిస్తుంటాయి. ఆయన చిల్లర వ్యాఖ్యలు చేసిన ప్రతిసారి బాలయ్యను తప్పుపట్టడమే తప్పు. ఎక్కడ ఏం మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో, ఎంత పరిపక్వంగా మాట్లాడాలో తెలిస్తే తను బాలయ్య ఎందుకవుతాడు? బాలయ్య సక్కనోడయితే బాబు చేతిలోకి టీడీపీ వెళ్లేది కాదు, ఆయన సీఎం అయ్యేవాడు కాదు. ఇదీ అందరికీ తెలిసిన సత్యం.

బాలకృష్ణ తాజా చిత్రం భగవంత్ కేసరి అక్టోబర్‌ 19న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో తన కూతురుగా యంగ్‌ హీరోయిన్‌ శ్రీలీల నటించడం విశేషం. కానీ ఈ విషయంలో బాలయ్య కొంతమేరకు బాగా హర్ట్‌ అయినట్లు ఉన్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ అయిన శ్రీలీలకు తండ్రిగా నటించడం బాలయ్యకు నచ్చినట్లు లేదు. అందుకే తన మనుసులోని మాటను బహిరంగంగానే ఇలా చెప్పాడు.

'ఈరోజు పొద్దున్నే శ్రీలీలతో ఓ మాట అన్నాను. ఇద్దరం కలిసి నటించాం సరే. నువ్వు చిచ్చా...చిచ్చా అని నన్ను టార్చర్ పెట్టావ్. నెక్ట్స్ సినిమాలో మనం హీరోహీరోయిన్లుగా నటిద్దామని చెప్పాను. ఇదే మాట ఇంటికెళ్లి మా కుటుంబ సభ్యులతో చెప్పాను. నా కొడుకు మోక్షజ్ఞకు కోపమొచ్చింది. ఏం డాడీ, నేను హీరోగా రాబోతున్నాను, నువ్వు ఆవిడకు ఆఫర్ ఇస్తానంటావేంటి? నీకు గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా డాడీ అన్నాడు. నాకు కాసేపు అర్థంకాలేదు. నన్ను అంత మాట అన్నాడేంటని ఉండిపోయాను.' అని స్టేజీమీదే బాలయ్య అన్నాడు.

చివరకు కుటుంబ పరువు తీస్తున్న బాలయ్య
తను ఒక ఎమ్మెల్యే, సీనియర్‌ హీరో అనే విషయాన్ని బాలయ్య మరిచిపోయి చాలా కాలం అయింది. నోటికి ఏదొస్తే అది మాట్లాడటం ఇదేం ఆయనకు కొత్త కాదు. వేదికలపై ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేయడం ఆ తర్వాత నవ్వులపాలవడం ఆయనకు సహజమేనని తెలిసిందే. మా బ్లడ్‌ వేరు.. బ్రీడు వేరు అని ఎప్పుడూ చెప్పుకు తిరిగే బాలయ్య ఎప్పటి లాగే భగవంత్ కేసరి సినిమా వేదికపై తన స్పీచ్‌లో 'నాన్నగారు' చుట్టూ తిరిగి తిరిగి ఆఖరికి కుటుంబం పరువు తీసే వ్యాఖ్యలతో ముగిసింది. దీంతో ట్రోలర్స్ కు కావాల్సినంత స్టప్‌ను ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ అందించాడు.

నీ గ్రౌండ్‌ ఫ్లోర్‌ సంగతి ఏంటి?
ఏ కార్యక్రమంలో చూసినా బాలకృష్ణ తన తండ్రి సీనియర్‌ ఎన్టీఆర్‌ గురించి కనీసం రెండు మాటలు అయినా మాట్లాడుతాడు. ఎందుకంటే ఆ పేరు మాత్రమే బాలయ్యకు గౌరవం తెస్తుంది. అందుకే చంద్రబాబు నుంచి బాలయ్య వరకు నేటికీ అన్నగారి పేరు పదేపదే జపిస్తుంటారు. ఇలాంటి నేపథ్యంలో తన కొడుకు మోక్షజ్ఙ తనను 'ఏం గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా' అని తిట్టాడని బాలయ్య చెప్పడం ఒక విధంగా తన కొడుకు పరువుతో పాటు నందమూరి కుటుంబం పరువును తీయడమేనని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

బాలయ్యకు కొడుకు ఇచ్చే గౌరవం ఇదా..? అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. తండ్రిని పట్టుకుని ఏం గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా..? అని అడిగేంత సంస్కార హీనుడు బాలయ్య కొడుకు అని జనం నవ్వుకోరా అని కోందరు తప్పుబడుతున్నారు. తండ్రి బాటలోనే కుమారుడు కూడా రెడీ అవుతున్నాడా..? అని మరికొందరు చెప్పుకొస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement