Moksajna Teja
-
నాడు చిరంజీవిపై ట్రోల్స్.. నేడు బాలకృష్ణను ఏమనాలి?
ఒక సినిమా విడుదలకు రెడీగా ఉందంటే ఆ సమయంలో పలు వేదికలపై చేసే హీరో ప్రసంగం కీలకం. కానీ బాలకృష్ణ సినిమాలకు అలాంటి పరిస్థితి వుండదు. ఆయన స్పీచ్ ఎక్కడో మొదలు పెట్టి ఎక్కడికో వెళ్లిపోతాడు. ఎంతో సమయం మాట్లాడినా సినిమాకు చెందిన సబ్జెక్ట్ గురించి మాత్రం అస్సలు మాట్లాడే ప్రసక్తే ఉండదు. ఒక్కోసారి తన సినిమాకు పనిచేసిన కొందరి టెక్నీషియన్ల పేర్లు కూడా ఆయనకు గుర్తుకు ఉండవు. ఆయన మాట్లాడే సమయంలో ఎవరైనా నవ్వినారు అనుకో చచ్చారే.. వారిపై అసహనంతో ఊగిపోవడం తప్ప బాలయ్య చేసేదేమీ లేదు. ఎల్లప్పుడూ రోజులు ఒకలా ఉండవు. ఓ రోజు వస్తుంది. బ్లడ్డు బ్రీడు పూచికపుల్లకూ కొరగావు. బూతులు, కోపాలు, తన్నులు. కొట్టడం వంటివి ఎల్లకాలమూ సాగవు. బాలయ్య ఇలా ఉన్నాడు కాబట్టే NTR వారసత్వాన్ని లోకేష్ భుజంపై చంద్రబాబు ఎప్పుడో పెట్టేశాడు. బాలయ్య నీతులకు మాత్రమే పరిమితం సీనియర్ ఎన్టీఆర్ గారు జీవించి ఉన్న రోజుల్లో ఆడవారికి ప్రథమ గౌరవం ఇచ్చేవారు అని తెలిసిందే. కానీ ఆయనకు వారసుడిగా ఉండాల్సిన బాలకృష్ణ.. కుమారుడిగా మాత్రమే మిగిలిపోయాడు. ఆడది కనిపిస్తే కడుపు అయినా చెయ్యాలి.. ముద్దు అయినా పెట్టాలి అని బాలయ్య చేసిన చిల్లర కామెంట్లు తెలుగు ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరు. ఈ వ్యాఖ్యలకు తోడు భగవంత్ కేసరి సినిమా వేదికపై బాలయ్య చేసిన 'గ్రౌండ్ ఫ్లోర్' కామెంట్లు వైరల్ అవుతున్నాయి. భగవంత్ కేసరి సినిమా వేదికపై కొడుకు గురించి మాటలు చెబుతూ తన చేతిని ఓ విధంగా ఊపారు. ఈ మధ్య ఇలా ఊపడం అన్నది బాలయ్యకు బాగా అలవాటు అయినట్లుంది. కొద్దిరోజుల క్రితం అసెంబ్లీలో కూడా అలాగే ఊపారు. కానీ పక్కన కూతురు వయసు ఉన్న శ్రీలీల లాంటి చిన్న అమ్మాయిని పెట్టుకుని ఇలాంటి చిల్లర చేష్టలు చేయడం బాలకృష్ణకే సాధ్యం అని చెప్పవచ్చు. నాడు చిరంజీవిపై ట్రోల్స్ భోళాశంకర్‌లో చెల్లెలిగా నటించిన కీర్తి సురేష్ చేతిని ఆఫ్ స్క్రీన్‌లో చిరంజీవి సరదాగా పట్టుకున్నారనే గదా మెగాస్టార్‌ను నీ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. మరి సినిమాలో కూతురిగా నటించిన శ్రీలీలతో హీరోగా రొమాన్స్ చేయాలని ఉందనే గ్రౌండ్ ఫ్లోర్ లాంటి వ్యాఖ్యలు చేసిన నిన్ను ఏమని అనాలి..? చెప్పు బాలయ్య అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. జైల్లో బావ.. స్టేజ్ పై బాలయ్య జైల్లో బావ.. స్టేజ్ పై బాలయ్య అంటే రాజకీయ స్టేజీపై అనుకునేరు.. కాదు.. కాదు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీని నడిపే నాయకుడెవరనే ప్రశ్న ఉత్పన్నమైంది. పార్టీని లోకేశ్ ముందుకు నడిపిస్తారని అందరూ అనుకున్నారు. తీరా చూస్తే, అందరి కంటే ముందు ఏకంగా రాష్ట్రాన్ని వదిలిపెట్టి సుమారు 30రోజుల పాటు ఢిల్లీలో దాక్కుని చెడ్డపేరు తెచ్చుకున్నాడు. ఈ లోపు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ యాక్టీవ్ అయ్యాడు. ఏకంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సీట్లో బాలయ్య ఆసీనులయ్యారు. తరుచూ చిల్లర వ్యాఖ్యలు చేస్తూ చెడ్డపేరు తెచ్చుకుంటున్న బాలకృష్ణ చేతిలోకి టీడీపీ పగ్గాలు ఎక్కడ వెళ్తాయోనని చంద్రబాబు గ్రహించారు. తన బుర్రకు పనిచెప్పి బ్రాహ్మణి, భువనేశ్వరిలను వెంటనే తెరపైకి తెచ్చారు. తెలంగాణలో ఊసేలేని తెలుగుదేశం పార్టీ బాధ్యతల్ని బాలయ్యకు కట్టబెట్టారు. దీంతో ఏపీ వైపు బాలయ్య కన్నెత్తి చూడకుండా జైళ్లో నుంచే చంద్రబాబు స్కెచ్ వేశాడు. జైల్లో ఉన్న తన బావ చంద్రబాబు పక్కాగా రాజకీయ చదరంగం ఆడుతూ బాలయ్యను ఏపీ నుంచి తప్పిస్తే... నందమూరి బాలకృష్ణ తన అజ్ఞానంతో స్టేజీలపై ఇలా చిల్లర వ్యాఖ్యలు చేసుకుంటూ కాలం గడిపేస్తున్నాడు. -
బాలకృష్ణ.. నీ గ్రౌండ్ ఫ్లోర్ సంగతేంటి..?
ఒక ఎమ్మెల్యేగా ఉన్న నందమూరి బాలకృష్ణకు ఆమాత్రం ఉచ్చంనీచం తెలియదా..? ఎక్కడ ఎలా మాట్లాడాలో కూడా తెలియదా..? నాన్సెన్స్, బాలయ్యకు సంస్కారం లేదా..? అనే కామెంట్లు కొన్ని వేల సంఖ్యలో సోషల్‌మీడియాలో కనిపిస్తుంటాయి. ఆయన చిల్లర వ్యాఖ్యలు చేసిన ప్రతిసారి బాలయ్యను తప్పుపట్టడమే తప్పు. ఎక్కడ ఏం మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో, ఎంత పరిపక్వంగా మాట్లాడాలో తెలిస్తే తను బాలయ్య ఎందుకవుతాడు? బాలయ్య సక్కనోడయితే బాబు చేతిలోకి టీడీపీ వెళ్లేది కాదు, ఆయన సీఎం అయ్యేవాడు కాదు. ఇదీ అందరికీ తెలిసిన సత్యం. బాలకృష్ణ తాజా చిత్రం భగవంత్ కేసరి అక్టోబర్ 19న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో తన కూతురుగా యంగ్ హీరోయిన్ శ్రీలీల నటించడం విశేషం. కానీ ఈ విషయంలో బాలయ్య కొంతమేరకు బాగా హర్ట్ అయినట్లు ఉన్నాడు. ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిన శ్రీలీలకు తండ్రిగా నటించడం బాలయ్యకు నచ్చినట్లు లేదు. అందుకే తన మనుసులోని మాటను బహిరంగంగానే ఇలా చెప్పాడు. 'ఈరోజు పొద్దున్నే శ్రీలీలతో ఓ మాట అన్నాను. ఇద్దరం కలిసి నటించాం సరే. నువ్వు చిచ్చా...చిచ్చా అని నన్ను టార్చర్ పెట్టావ్. నెక్ట్స్ సినిమాలో మనం హీరోహీరోయిన్లుగా నటిద్దామని చెప్పాను. ఇదే మాట ఇంటికెళ్లి మా కుటుంబ సభ్యులతో చెప్పాను. నా కొడుకు మోక్షజ్ఞకు కోపమొచ్చింది. ఏం డాడీ, నేను హీరోగా రాబోతున్నాను, నువ్వు ఆవిడకు ఆఫర్ ఇస్తానంటావేంటి? నీకు గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా డాడీ అన్నాడు. నాకు కాసేపు అర్థంకాలేదు. నన్ను అంత మాట అన్నాడేంటని ఉండిపోయాను.' అని స్టేజీమీదే బాలయ్య అన్నాడు. చివరకు కుటుంబ పరువు తీస్తున్న బాలయ్య తను ఒక ఎమ్మెల్యే, సీనియర్ హీరో అనే విషయాన్ని బాలయ్య మరిచిపోయి చాలా కాలం అయింది. నోటికి ఏదొస్తే అది మాట్లాడటం ఇదేం ఆయనకు కొత్త కాదు. వేదికలపై ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేయడం ఆ తర్వాత నవ్వులపాలవడం ఆయనకు సహజమేనని తెలిసిందే. మా బ్లడ్ వేరు.. బ్రీడు వేరు అని ఎప్పుడూ చెప్పుకు తిరిగే బాలయ్య ఎప్పటి లాగే భగవంత్ కేసరి సినిమా వేదికపై తన స్పీచ్‌లో 'నాన్నగారు' చుట్టూ తిరిగి తిరిగి ఆఖరికి కుటుంబం పరువు తీసే వ్యాఖ్యలతో ముగిసింది. దీంతో ట్రోలర్స్ కు కావాల్సినంత స్టప్ను ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ అందించాడు. నీ గ్రౌండ్ ఫ్లోర్ సంగతి ఏంటి? ఏ కార్యక్రమంలో చూసినా బాలకృష్ణ తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ గురించి కనీసం రెండు మాటలు అయినా మాట్లాడుతాడు. ఎందుకంటే ఆ పేరు మాత్రమే బాలయ్యకు గౌరవం తెస్తుంది. అందుకే చంద్రబాబు నుంచి బాలయ్య వరకు నేటికీ అన్నగారి పేరు పదేపదే జపిస్తుంటారు. ఇలాంటి నేపథ్యంలో తన కొడుకు మోక్షజ్ఙ తనను 'ఏం గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా' అని తిట్టాడని బాలయ్య చెప్పడం ఒక విధంగా తన కొడుకు పరువుతో పాటు నందమూరి కుటుంబం పరువును తీయడమేనని పలువురు కామెంట్లు చేస్తున్నారు. బాలయ్యకు కొడుకు ఇచ్చే గౌరవం ఇదా..? అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. తండ్రిని పట్టుకుని ఏం గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా..? అని అడిగేంత సంస్కార హీనుడు బాలయ్య కొడుకు అని జనం నవ్వుకోరా అని కోందరు తప్పుబడుతున్నారు. తండ్రి బాటలోనే కుమారుడు కూడా రెడీ అవుతున్నాడా..? అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. -
జాతకాల పిచ్చికి నా బిడ్డ బలయ్యాడు
భర్త, అత్తమామలపై మోక్షజ్ఞతేజ తల్లి విమలప్రియ ఆరోపణలు నా బిడ్డ పుట్టగానే జాతకం బాగాలేదంటూ పూజలు చేశారని ఆవేదన బిడ్డ కనిపించకపోతే రోజంతా నాకు చెప్పలేదని మండిపాటు నా కడుపున పుట్టడమే వాడు చేసిన నేరమా అంటూ సూటిప్రశ్న ఎవరి పనో తేల్చాలంటూ ఎస్పీకి వినతి కొత్త మలుపు తిరిగిన బాలుడి హత్యకేసు గుంటూరు : బాబాయి చేతుల్లో హతమైనట్లుగా చెబుతున్న చిన్నారి మోక్షజ్ఞతేజ వ్యవహారం అనూహ్య మలుపుతిరిగింది. బాబు మృతికి జాతకాల పిచ్చే కారణమని తల్లి విమలప్రియ ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు రావడంతో సరికొత్త ఆలోచనలకు తెరలేచింది. బాబాయి హరిహరణ్ కావాలని చంపాడని కొందరు, అతనికి మతిస్థిమితం బాగాలేక చంపాడని మరికొందరు చెబుతుండగా తన బిడ్డ మృతికి అత్తింటి వారి జాతకాల పిచ్చే కారణమంటూ తల్లి విమలప్రియ చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. బిడ్డను కోల్పోయిన షాక్‌తో విమలప్రియ అలా మాట్లాడుతోందని, బాలుడి మృతికి తమకు ఎటువంటి సంబంధం లేదని విమలప్రియ భర్త, అత్తమామలు చెబుతున్నారు. విమలప్రియ ఎస్పీ కార్యాలయంలో విలేకర్లతో మాటాడిన విషయాలు ఆమె మాటల్లోనే... ‘జాతకాల పిచ్చికి నా బిడ్డ బలయ్యాడు.. నా కడుపున పుట్టడమే వాడు చేసిన నేరమా.. బిడ్డ పుట్టగానే జాతకం బాగాలేదంటూ పూజలు చేశారు.. నా బిడ్డ జాతకంలో తండ్రికి ప్రాణహాని ఉందని ఎవరో సిద్ధాంతి చెప్పారట.. నా బిడ్డ కనిపించకుండా పోతే ఒక రోజంతా నాకు తెలియకుండా చేశారు.. నేను తెనాలి వచ్చి చూసేంత వరకూ ఆ విషయాన్ని దాచారు.. నేను, నా బిడ్డ వారికి అడ్డుగా ఉన్నామని చెబితే వారి జీవితాల్లోంచి వెళ్ళిపోయేదాన్ని.. అంతేగాని ఇంత ఘాతుకానికి తెగబడి నాకు కడుపుకోత మిగులుస్తారా.. నా బిడ్డ ఎలా చనిపోయాడు.. ఎవరు చంపారనే విషయాలు బయటకు రావాలి’ అంటూ ఈ నెల 25వ తేదీన బాబాయి చేతిలో హతమైన ఏడాదిన్నర చిన్నారి మోక్షజ్ఞతేజ తల్లి విమలప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి గుంటూరు నగరంలోని ఎస్పీ కార్యాలయంలో ఆమె విలేకర్లతో మాట్లాడుతూ తనకు భాస్కరరావుతో పెళ్ళైనప్పటి నుంచి ఆయన జాతకాల పిచ్చికి ఎన్నోసార్లు గొడవలు జరిగాయని ఆమె చెప్పారు. పెళ్లయిన కొత్తలో మామకు ప్రమాదం జరిగితే తనను పెళ్లి చేసుకోవడం వల్లే ఇలా జరిగిందంటూ వేధించాడనీ, అయినా పట్టించుకోకుండా ఇన్నాళ్లూ కాపురం చేశానని తెలిపారు. తాను, తన భర్త ఇద్దరం ఉద్యోగాలు చేస్తుండటంతో రెండు నెలలుగా తెనాలిలోని తమ అత్తగారింటిలో బిడ్డను ఉంచి వారంవారం వచ్చి చూసి వెళ్తుంటామని చెప్పారు. బిడ్డకు ఎప్పుడు ఒంట్లో బాగాలేకపోయినా ఫోన్‌చేసి ఏ మందులు వాడాలని అడిగేవారని వారం రోజులుగా తన బిడ్డకు జ్వరం వస్తున్నా కనీసం ఫోన్ కూడా చేయలేదని ఆమె వాపోయారు. మోక్షజ్ఞతేజ హత్యకు గురయ్యే రెండు రోజుల ముందే కనిపించకుండా పోయినప్పటికీ తెనాలి వచ్చే వరకూ తనకు చెప్పలేదని, పైగా బిడ్డ ఎక్కడ ఉన్నాడనే విషయం కూడా సిద్ధాంతిని అడిగారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ వైపున బతికే ఉన్నాడని సిద్ధాంతి చెప్పడంతో తన పెద్ద మరిది చంద్రశేఖర్ వెతకడానికి వెళ్లగా తన భర్త మాత్రం ఇంటిలోనే ఉండిపోయాడని చెప్పారు. బిడ్డపై మమకారం ఉంటే ఇంటిలో ఎందుకు ఉంటారంటూ ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విమలప్రియ తల్లిదండ్రులు మీరయ్య, చంద్రకుమారి మాట్లాడుతూ జాతకాల పిచ్చితో తన మనవడిని నిర్ధాక్షిణ్యంగా హతమార్చారని వాపోయారు. ముక్కుపచ్చలారని ఏడాదిన్నర బిడ్డను చంపడానికి వారికి చేతులు ఎలా వచ్చాయంటూ బోరున విలపించాడు. అసలు తన బిడ్డ ఎలా చనిపోయాడో.. ఎవరు చంపారో తేల్చాలంటూ మోక్షజ్ఞతేజ తల్లి విమలప్రియ ఎస్పీకి వినతిపత్రం సమర్పించారు. బాధితుల సమస్య విన్న ఎస్పీ మాట్లాడుతూ ఈ కేసును ప్రత్యేకంగా పరిగణించి దర్యాప్తు కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. షాక్‌లో ఉండి అలా మాట్లాడి ఉంటుంది. కన్న బిడ్డ చనిపోవడ ంతో మా కోడలు షాక్‌కు గురైంది. షాక్వల్లే అలా మాట్లాడి ఉంటుందని అనుకుంటున్నాం. మా కోడలు విమలప్రియ మంచిదే. ఆమె అలా మాట్లాడినందువల్ల నేనేమీ బాధపడటం లేదు. నా కొడుకు హరిహరణ్‌పై కేసు నమోదు చేయమని పోలీసులకు నిజాయతీగా చెప్పాను. - గోడపాటి రాంబాబు, మోక్షజ్ఞ తేజ తాత, తెనాలి -
పసి ప్రాణంపై కసి
*కనకదుర్గమ్మ వారధి వద్ద ఘోరం *నదిలోకి విసిరేసి అన్న కుమారుడిని అంతం చేసిన బాబాయి *తాతయ్య, నానమ్మల వద్దకు వచ్చి బాబాయి చేతికి చిక్కిన చిన్నారి *ఇంటికి రాలేదని వెతుకుతూ వస్తుండగా కనిపించిన మృతదేహం * గుండెలు పగిలేలా రోదిస్తున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ముద్దుముద్దు మాటలు మూగబోయాయి.. బుడిబుడి అడుగులు ఆగిపోయాయి.. ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న చిన్నారి ఇక లేడని తెలిసిన ఆ తల్లిదండ్రుల హృదయాలు తల్లడిల్లాయి. హైదరాబాద్‌కు చెందిన ఏడాదిన్నర చిన్నారి మోక్షజ్ఞ తేజను సొంత బాబారుు హరిహరన్ బుధవారం అర్ధరాత్రి దాటాక కనకదుర్గమ్మ వారిధి పై నుంచి కృష్ణానదిలోకి విసిరి కసిగా ఉసురు తీశాడని తేలడంతో గుండెలు పగిలేలా ఆ దంపతులు రోదిస్తున్న తీరు కంటతడి పెట్టించింది. తాడేపల్లి రూరల్(గుంటూరు) : అసూయ ఓ చిన్నారి ప్రాణం తీసింది. ఘాతుకానికి కారకుడైన నిందితుడూ కనిపించకుండా పోయాడు. అసూయతో ఏడాదిన్నర వయస్సుగల చిన్నారిని సొంత బాబాయే కాలయముడై కృష్ణానదిలోకి విసిరి హత్య చేయడం సంచలనం కలిగించింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగినట్టుగా భావిస్తున్న ఈ సంఘటనలో మృతి చెందిన చిన్నారిని గురువారం తాడేపల్లి పోలీసులు కనుగొన్నారు. కనకదుర్గమ్మ వారధి 28, 29 ఖానాల మధ్య నదిలో తేలియాడుతున్న మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన చిన్నారి మోక్షజ్ఞతేజ(18 నెలలు)ను తెనాలిలో ఉంటున్న సొంత బాబాయి గోడపాటి హరిహరణ్ వారధిపై నుంచి నదిలోకి విసిరి చంపినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు, కుటుంబీకులు బంధువుల కథనం మేరకు మోక్షజ్ఞతేజ హత్యోదంతానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తెనాలి బాలాజీరావుపేటలోని మహేంద్రకాలనీకి చెందిన గోడపాటి రాంబాబు పొన్నూరులో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. అతని ముగ్గురు కుమారుల్లో పెద్దవాడైన భాస్కరరావు భార్య విమలప్రియతో కలిసి ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న వీరిద్దరూ తమ కుమారుడైన చిన్నారి మోక్షజ్ఞ తేజను ఆరు నెలల కిందట తెనాలిలో ఉంటున్న తాతయ్య, నానమ్మ రాంబాబు, జానకిల వద్ద వదిలి వెళ్లారు. ఏఎస్ఐ రాంబాబు రెండో కుమారుడు చంద్రశేఖర్ కూడా ఉద్యోగంలో స్థిరపడగా, మూడవ కుమారుడు, ఈ సంఘటనలో నిందితుడైన హరిహరణ్ ఇంజినీరింగ్ చదివినప్పటికీ జులాయిగా తిరుగుతుండేవాడని బంధువులు తెలిపారు.ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం చిన్నారి మోక్షజ్ఞతేజ తండ్రి భాస్కరరావు తెనాలి వచ్చి పద్ధతి మార్చుకోవాలని తమ్ముడైన హరిహరణ్‌కు హితబోధ చేసి వెళ్లారు. దీనిని మనసులో పెట్టుకున్న హరిహరణ్.. బుధవారం సాయంత్రం ఆ చిన్నారిని బయటకు తీసుకెళ్లాడు. రాత్రికి ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు వెతకనారంభించారు. ఈ క్రమంలో కృష్ణానది వద్దకు చేరుకున్న రాంబాబు రెండో కుమారుడు చంద్రశేఖర్‌కు కనకదుర్గమ్మవారధి వద్ద పెద్ద సంఖ్యలో జనం ఉండడంతో కంగారుపడి వెళ్లి చూడగా చిన్నారి మోక్షజ్ఞ నదిలో శవంగా కనిపించాడు. దీంతో ఒక్కసారిగా చంద్రశేఖర్ ‘బాబాయి చేతిలో బలైపోయావా నాన్నా’ అంటూ బోరున విలపించాడు. అనంతరం అక్కడకు చేరుకున్న మంగళగిరి రూరల్ సీఐ చిట్టెం కోటేశ్వరరావు, తాడేపల్లి ఎస్ఐ దుర్గాసి వినోద్‌కుమార్‌లకు జరిగిన విషయాన్ని చంద్రశేఖర్ వివరించారు. చిన్నారిని తీసుకువచ్చిన బాబాయి హరిహరణ్ వారధిపై నుంచి విసిరి నదిలో పడేసి ఉంటాడనే నిర్ధారణకు వచ్చారు. వారధిపై ఇంటి నుంచి నిందితుడు తెచ్చిన పంచను పోలీసులు కనుగొని ఇక్కడ నుంచే హత్య చేసి ఉంటాడని భావించారు. చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని మంగళగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.