భగవంత్‌ కేసరి మూవీ సక్సెస్.. దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్! | Sunshine Screens Gifted To Bhagavanth Kesari Director Anil Ravipudi | Sakshi
Sakshi News home page

Bhagavanth Kesari: అనిల్ రావిపూడికి ఖరీదైన కారు గిఫ్ట్!

Published Tue, Nov 28 2023 8:59 AM | Last Updated on Tue, Nov 28 2023 9:48 AM

Sunshine Screens Gifted To Bhagavanth Kesari Director Anil Ravipudi - Sakshi

నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల కీలక పాత్రలో కనిపించింది. దసరా కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. థియేటర్ల అలరించిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. ‍అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోన్న ఈ మూవీకి ఆడియన్స్‌ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

ఈ మూవీకి దక్కుతున్న ఆదరణతో చిత్రబృందం సంతోషంలో మునిగిపోయింది. తాజాగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ షైన్​ స్క్రీన్స్​ దర్శకుడికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. సినిమా సూపర్ హిట్ కావడంతో దర్శకుడు అనిల్ రావిపూడికి ఖరీదైన టొయోటా​ కారును బహుమతిగా అందించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ విషయాన్ని నిర్మాణసంస్థ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement