ప్రస్తుతం టాలీవుడ్‌లో శ్రీలీల హవా కొనసాగుతుంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరి హీరోలతో నటిస్తూ కెరీర్ పరంగా దూసుకెళ్తోంది. తాజాగా ఈ బ్యూటీ నటించిన ‘భగవంత్ కేసరి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇన్నాళ్లు హీరోయిన్‌గా అలరించిన శ్రీలీల.. ఈ చిత్రంలో కూతురు పాత్ర పోషించి మెప్పించింది. సినిమాకు మిశ్రమ స్పందన లభించినప్పటికీ.. ప్రతి ఒక్కరు శ్రీలీల నటనను మాత్రం పొగిడేస్తున్నారు. డ్యాన్స్ మాత్రమే కాదు యాక్షన్ కూడా ఇరగదీసిందని ప్రశంసలు కురిపిస్తున్నారు.
శ్రీలీల ప్రయోగం ఫలించింది
శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్‌లో బిజియెస్ట్ హీరోయిన్. ఆమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. డేట్స్ కుదరక చాలా సినిమాలు వదులుకుంది కూడా. అలాంటి శ్రీలీల భగవంత్ కేసరి లాంటి చిత్రం ఒప్పుకొని పెద్ద సాహసమే చేసింది. ఎందుకంటే హీరోయిన్‌గా రాణిస్తున్న తరుణంలో కూతురు లాంటి క్యారెక్టర్ చేయడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ శ్రీలీల ఆ ప్రయోగం చేసి సక్సెస్ సాధించింది. భగవంత్ కేసరిలో బాలయ్య తరువాత శ్రీలీల అభినయమే హైలెట్ అని పలు వెబ్‌సైట్లు తమ రివ్యూల్లో రాసుకొచ్చాయి. విజ్జీ పాప పాత్రలో ఆమె ఒదిగిపోయిందని, శ్రీలీలలోని రెండో కోణం ఈ సినిమా ద్వారా బయటకు వచ్చిందని అంటున్నారు.
భారీ రెమ్యునరేషన్
భగవంత్ కేసరి కోసం శ్రీలీల భారీ రెమ్యునరేషనే పుచ్చుకుందంట. హీరోయిన్‌గా నటించిన కాజల్ కంటే ఎక్కువ పారితోషికం వసూలు చేసిందని టాక్ నడుస్తోంది. పెళ్లి తర్వాత అవకాశాలు తగ్గడంతో కాజల్ తన రెమ్యునరేషన్‌ని భారీగా తగ్గించిందట. భగవంత్ కేసరి కోసం రూ. 1.5 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీలీల మాత్రం రూ. 1.8 కోట్లు పారితోషికంగా పుచ్చుకున్నట్లు సమాచారం. కెరీర్ ప్రారంభంలో కేవలం ఐదు లక్షల రూపాలయలు మాత్రమే తీసుకున్న శ్రీలీల..ఇప్పుడు కోటిన్నరకు పైగా తీసుకుంటుందంటే ఈ అమ్మడు క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
(చదవండి: భగవంత్ కేసరి మూవీ రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment