‘ఇప్పటి వరకు నేను ఆరు సినిమాలు చేశాను. అంటే ఒక ఓవర్ అయిపోయింది. ఇకపై కొత్తగా ట్రై చేద్దామని అనుకున్నాను. కంప్లీట్ హానెస్ట్ ఇంటెన్స్ డ్రామా తో ఓ సినిమా చేయాలనిపించి..భగవంత్ కేసరి చేశాను. ఈ చిత్రం చాలా ఏళ్లు గుర్తిండిపోతుంది’ అని అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘భగవంత్ కేసరి’. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్ర పోషిస్తున్నారు. అక్టోబర్ 19న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా అనిల్ రావిపూడి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
► నా గత సినిమాకు పూర్తి భిన్నంగా భగవంత్ కేసరి ఉంటుంది. కొత్తగా ఓ సినిమా ట్రై చేద్దామని ఇది చేశాను. దానికి బాలకృష్ణ రూపంలో నాకు సరైన ఆయుధం దొరికింది. కథ అద్భుతంగా కుదరడంతో పాటు మంచి స్టార్ కాస్ట్ దొరికింది. ఈ చిత్రం కచ్చితంగా చాలా ఏళ్లు గుర్తిండిపోతుంది.
► ‘సరిలేరు నీకెవ్వరు’ మహేష్ బాబు గారితో ఒక ఆర్మీ కథ చేయాలని ఫిక్స్ అయి చేశాం. ‘భగవంత్ కేసరి' లో చాలా గోల్స్ వున్నాయి, ఆర్మీకి పంపడంతో పాటు అమ్మాయిని స్ట్రాంగ్ ఎలా చేయాలనే క్యారెక్టరైజేషన్ కూడా వుంటుంది. అమ్మాయి కి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఎలా వీక్ అయ్యింది? ఎలా స్ట్రాంగ్ చేయాలి ? దాని బ్యాక్ డ్రాప్ గోల్ ఆర్మీని తీసుకున్నాం. 'అమ్మాయిని ఒక సింహంలా పెంచాలి' అనే అండర్ లైన్ బ్యూటీఫుల్ కంటెంట్ ఉంది.
► ఈ చిత్రానికి బ్రో ఐ డోంట్ కేర్ అనే టైటిల్ ని పరిశీలించాం. అయితే బాలయ్య బాబు టైటిల్ అంటే ఒక ఫోర్స్ ఉండాలి. బ్రో ఐ డోంట్ కేర్ కంటే ఏదైనా ఒక పేరు వుంటే ఎక్కువ కాలం గుర్తుండిపోతుంది. సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు ఇలా పేర్లు వునప్పుడు ఎక్కువ రోజులు ప్రేక్షకులతో సినిమా ట్రావెల్ అవుతుందని భగవంత్ కేసరి అని పెట్టాం. దీనికి నేలకొండ అనే పేరు చేర్చి ఎన్ బికే గా కాయిన్ చేయడంతో మరింత ఆకర్షణ వచ్చింది.
► భగవంత్ కేసరి లో ఎంటర్ టైన్మెంట్ చాలా సెటిల్ గా ఉంటుంది. ట్రీట్మెంట్ కూడా చాలా సహజంగా చేశాం. లార్జర్ దేన్ లైఫ్ యాక్షన్ సీక్వెన్స్ లు కూడా చాలా రియలిస్టిక్ గా చేశాం. అలాగే నా మార్క్ ఫన్ టింజ్ సినిమాలో అక్కడక్కడ టచ్ అవుతూనే ఉంటుంది.
► ఈ చిత్రంలో అర్జున్ రామ్ పాల్ విలన్‌గా చేశాడు. బాలయ్యకు ఎదురుగా నిలబడే పాత్ర అది. అర్జున్ రాం పాల్ గారిని ఓ శాంతి ఓం లో చూసిననప్పటినుంచి ఇష్టం. ఆయన వాయిస్, ప్రజన్స్ చాలా బావుటుంది. తెలుగులోకి తీసుకొస్తే బావుటుందని ఆయన కలవడం జరిగింది. ఆయన కూడా చాలా ఎక్సయిట్ అయ్యారు. అయితే ఆయన ముందే భాష విషయంలో ఒక నిర్ణయంతో ఉన్నారు. ప్రామ్టింగ్ చేయను నేర్చుకొని చెప్తా అన్నారు. ముందే డైలాగ్స్ ఇవ్వమని చెప్పారు. ప్రతి డైలాగుని బట్టిపట్టారు. ఆయనే స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పారు.
► ప్రస్తుతం నా దృష్టి మొత్తం భగవంత్ కేసరి విడుదల పైనే ఉంది. విడుదలైన తర్వాతే మరో సినిమా గురించి ఆలోచిస్తా. ఐతే ఏది చేసినా డిఫరెంట్ గా ఛాలెంజింగ్ గా చేయాలని ఉంది.
Comments
Please login to add a commentAdd a comment