
ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాటెండ్ హీరోయిన్ ఎవరని అంటే అందరు చెప్పే ఒకే ఒక పేరు శ్రీలీల. తనదైన అందం, అభినయంతో ఈ తెలుగు బ్యూటీ దూసుకెళ్తోంది. తొలి సినిమా పెళ్లి సందD బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోయినా.. శ్రీలీలకు మాత్రం యమ క్రేజీ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘ధమాకా’ తో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అరడజన్‌కు పైగా తెలుగు సినిమాలు ఉన్నాయి. అందులో బాలయ్యతో కలిసి నటించిన భగవంత్ కేసరీ అక్టోబర్ 19న విడుదల కాబోతుంది. ఆ తర్వాత వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’, మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’.. ఇలా రాబోయే 5 నెలల్లో నెలకో సినిమా శ్రీలీల నుంచి రాబోతుంది.
ఇలా యాక్టర్‌గా ఇంత బిజీగా ఉన్న ఈ భామ త్వరలోనే డాక్టర్ కాబోతుంది. ప్రస్తుతం మెడిసిన్ చదువుతోంది. ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు చదువులోనూ రాణిస్తుంది. అంతేకాదు డాక్టర్ కావాలనేదే తన డ్రీమ్ అంటోంది. భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా శ్రీలీల మీడియాతో మాట్లాడుతూ.. తన స్టడీ, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది..
యాక్టింగ్ స్కూల్‌ని వెళ్లలేదు
మాములుగా నేను భరతనాట్యం మాత్రమే చేసేదాన్ని. యాక్టింగ్‌పై అవగాహన కూడా లేదు. భరత నాట్యం చేసేటప్పుడు నా డ్యాన్స్‌తో కథ చెప్పాల్సి వస్తుంది. ఎలాంటి డైలాగులు లేకుండా కథ చెప్పడం చాలా కష్టం. భరతనాట్యంలో అనుభవం ఉండడం వల్లే నాకు యాక్టింగ్ చేయడం పెద్ద కష్టమనించలేదు. నేను ఏ యాక్టింగ్ స్కూల్‌కి వెళ్లలేదు. రాఘవేంద్రరావు దయ వల్ల ‘పెళ్లి సందD’ లో అవకాశం రావడం..ఆ తర్వాత తెలుగు ప్రేక్షకుల ప్రేమతో నన్ను దగ్గరకు చేర్చుకోవడంతో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. నటిగా ఎంత బిజీగా ఉన్నా చదువును మాత్రం వదులుకోను. డాక్టర్ కావడమే నా లక్ష్యం.
ఆ ఇన్సిడెంట్ నా మైండ్‌ని మార్చేసింది
నేను డాక్టర్ అవ్వాలని నిర్ణయం తీసుకోవడానికి వెనక ఓ స్టోరీ ఉంది. మా ఇంట్లో అమ్మతో పాటు అన్నయ్య కూడా డాక్టరే. ఓ సారి నేను అమ్మమ్మ గారి ఇంటికి వెళ్లాను. అది మారుమూల గ్రామం. ఓ రోజు అమ్మమ్మ సడెన్‌గా కిందపడిపోయింది. ఏం చేయాలో తెలియదు. అందరితో పాటు నేను కూడా అక్కడే నిల్చోని చూస్తున్నా. కానీ అన్నయ్య వెంటనే వచ్చి అమ్మమ్మను పైకిఎత్తి వీపు భాగాన్ని పుష్ చేశాడు.
దీంతో అమ్మమ్మ ప్రమాదం నుంచి బయటపడింది. అన్నయ్య మెడిసిన్ చదవుతున్నాడు కాబట్టి.. ఆ సమయంలో ఏం చేయాలో అది చేశాడు. కానీ నాకు సహాయం చేయాలని అనిపించినప్పటికీ ఎలా చేయాలో తెలియదు. ఆ రోజే ఫిక్సయ్యా.. నేను ఎప్పటికైనా డాక్టర్ అవ్వాలని. అందుకే మెడిసిన్ కోర్సు తీసుకున్నాను. యాక్టింగ్‌తో పాటు మెడిసిన్ కోర్స్ కూడా పూర్తి చేస్తాను. షూటింగ్స్‌తో బిజీగా ఉన్నా.. పరీక్షలు ఉంటే రాత్రివేళల్లో చదువుకుంటాను. ఇప్పటికీ ఒక సినిమా ఒప్పుకుంటే..దాని ఎఫెక్ట్ నా చదువుపై ఉంటుందని తెలుసు.కానీ మంచి పాత్రలు ఇప్పుడే వస్తున్నాయి. అందుకే కొంచెం కష్టమైనా ఒప్పుకుంటున్నాను. రాత్రివేళల్లో చదువుకుంటున్నాను’ అని శ్రీలీల చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment