స్టార్ హీరోయిన్ శ్రీలీల వరుసగా స్టార్ హీరోలతో నటించే అవకాశాలు దక్కించుకోవడమే కాకుండా తన టాలెంట్‌తో డ్యాన్స్,నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావు అనే మాటకు చెక్ పెడుతూ టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా నేడు నిలిచింది. ఓ వైపు యంగ్ హీరోలతో ఆడిపాడుతూనే మరోవైపు 'భగవంత్ కేసరి'లో సీనియర్ హీరో బాలకృష్ణకు కుమార్తెగా నటించింది. ఇదొక్కటి చాలు ఆమె తీసుకునే నిర్ణయాలు ఎంత పర్‌ఫెక్ట్‌గా ఉంటాయో చెప్పడానికి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 'భగవంత్ కేసరి'లో బాలకృష్ణకు ఏమాత్రం తగ్గకుండా తను నటించిదని ట్రైలర్‌లోనే అర్థం అవుతుంది.
(ఇదీ చదవండి: ప్రేక్షకుల గుండెల్ని తాకిన నయని పావని.. ఈ కారణంతో నో రీ ఎంట్రీ)
తాజాగా శ్రీలీల, అనిల్ రావిపూడి ఒక ఇంటర్వ్యూలో వారిద్దరి మధ్య ఉన్న బంధుత్వం ఎలాంటిదో రివీల్ చేశాడు. మొట్టమొదటిసారిగా, దర్శకుడు అనిల్ రావిపుడు తాను ఎప్పుడూ అందరితో పంచుకోని విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. స్టార్ హీరోయిన్ శ్రీలీల కుటుంబంతో ఆయనకు ఉన్న రిలేషన్‌షిప్‌ను మొదటిసారి బయటపెట్టాడు. శ్రీలీల అమ్మగారు డాక్టర్ స్వర్ణ సొంతూరు ఒంగోలు దగ్గరలో ఉన్న పొంగులూరు అని అదే ఊరు తన అమ్మమ్మగారిదని అనిల్ తెలిపాడు.
శ్రీలీల తల్లి స్వర్ణ తనకు సిస్టర్ వరుస అవుతుందని ఆయన పేర్కొన్నాడు. ఆ లెక్కన అనిల్‌కు శ్రీలీల కోడలు అవుతుంది. భగవంత్ కేసరి సెట్స్‌లో అందరి ముందూ అనిల్‌ణు డైరెక్టర్ గారు అని పిలిచే శ్రీలీల.. ఎవరూ లేనప్పుడు మాత్రం 'మామయ్య' అంటూ ఆట పట్టించేదట. శ్రీలీల పుట్టింది తెలుగు గడ్డపైనే అయినా ఆమె పెరిగింది, చదువుకున్నదంతా బెంగళూరు, అమెరికాలోనే కానీ తన అమ్మమ్మ ఊరు అయిన పొంగులూరుకు ప్రతి ఏటా వస్తూనే ఉంటుందని అనిల్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment