'పదేళ్ల పనిని వారంలో చేశారు'.. ఆ డైలాగ్‌పై నటుడి ప్రశంసలు! | Rahul Ravindran Tweet Goes Viral On Bhagavanth Kesari Movie | Sakshi
Sakshi News home page

Bhagavanth Kesari: 'వారికైతే పదేళ్లు పట్టేది.. కానీ ఒక్క డైలాగ్‌తో'.. నటుడి ట్వీట్ వైరల్!

Published Wed, Oct 25 2023 7:37 AM | Last Updated on Wed, Oct 25 2023 7:57 AM

Rahul Ravindran Tweet Goes Viral On Bhagavanth Kesari Movie - Sakshi

నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి చిత్రంపై ప్రశంసలు కురుస్తున్నాయి. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కించిన ఈ చిత్రం దసరా కానుకగా థియేటర్లలో సందడి చేసింది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా కనిపించగా.. పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల ప్రత్యేక పాత్రలో కనిపించింది. అయితే ఈ మూవీలోని ఓ డైలాగ్‌ అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రబృందాన్ని నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. సినిమాలోని గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌ డైలాగ్‌పై నటుడు రాహుల్ రవీంద్రన్ ట్వీట్‌ చేశారు. ఆ ఒక్క డైలాగ్‌తో ప్రజలకు మంచి సందేశాన్ని ఇచ్చారని కొనియాడారు. ఈ ట్వీట్‌కు అనసూయ రిప్ కూడా ఇచ్చింది.

రాహుల్ తన ట్వీట్‌లో రాస్తూ.. 'ఈ చిత్రంలో ఒక్క డైలాగ్‌తో  ప్రజలను చైతన్యవంతులను చేశారు. ఒక్క వారంలోనే మెసేజ్ అందరికీ చేరేలా చేశారు. మీడియా ద్వారా అయితే  దాదాపు 10 ఏళ్లు పట్టేది. మాస్‌ మసాల సినిమాలో ఇలాంటి గొప్ప అంశాన్ని పెట్టినందుకు చిత్రబృందానికి కృతజ్ఞతలు. బాలకృష్ణ వల్లే ఇది సాధ్యమైంది. అత్యంత ప్రభావవంతంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. బాలయ్య పక్కన శ్రీలీల చూడటం అద్భుతంగా అనిపించింది.' అంటూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అయితే ట్వీట్‌కు అనసూయం సైతం స్పందించింది. ఈ సినిమా గురించి ఇంతకంటే గొప్పగా ఎవరూ చెప్పలేరంటూ రిప్లై ఇచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement