దసరా పండుగ వచ్చిందంటే చాలు టాలీవుడ్‌లో ఆ సందడి, జోష్ వేరేలా ఉంటుంది. ఈ సీజన్ కోసం స్టార్ హీరోలందరూ ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ప్రతి దసరాకి కనీసం ఒకటి, రెండు బడా సినిమాలు అయినా బాక్సాఫీస్ బరిలోకి దిగుతాయి. కానీ ఈ సారి మాత్రం ఏకంగా ముగ్గురు స్టార్ హీరోలు దసరా బరిలోకి దిగారు. ఒకవైపు బాలకృష్ణ, మరోవైపు రవితేజ, ఇంకొక వైపు దళపతి విజయ్ .. ఎవరికి వాళ్లు తమ సినిమాలతో బాక్సాఫీస్‌పై దండయాత్ర ప్రారంభించారు. ఒక సినిమాలో తండ్రి కన్న కూతుర్ని నరబలి ఇస్తే.. మరో సినిమాలో తండ్రి తలను కన్న కొడుకు నరికేస్తాడు. ఇంకో సినిమాలో కూతుర్ని బలోపేతం చేస్తూనే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పాఠాలు చెబుతాడు. ఆ సినిమాలేంటి? ఎలా ఉన్నాయో? చదివేయండి
కూతర్ని నరబలి ఇచ్చిన తండ్రి
దళపతి’విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లియో’. ‘విక్రమ్’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన చిత్రమిది. అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. ఈ చిత్రంలో సొంత కూతుర్నే నరబలి ఇస్తాడు విలన్ ఆంటోని దాస్(సంజయ్ దత్). దీంతో అతని కొడుకు లియో(విజయ్) తండ్రిని ఎదురించి.. అతను నెలకొల్పిన పొగాకు ఫ్యాక్టరీని ధ్వంసం చేస్తాడు. లియో కూడా మరణిస్తాడు. కట్ చేస్తే.. 20 ఏళ్ల తర్వాత లియో పోలికలతో పార్తిబన్(విజయ్) కనిపిస్తాడు. అతని కోసం ఆంటోని హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ సినిమా ఎలా ఉంది? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
తండ్రి తల నరికిన ‘టైగర్’
రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. స్టువర్ట్‌పురం గజ దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ఇది. ఎదిమిదేళ్ల వయసులోనే తండ్రి తలను నరికేస్తాడు టైగర్. అతను ఎందుకలా చేశాడు? నాగేశ్వరరావు దొంగలా ఎలా మారాడు? ఈ సినిమా కొత్తగా చూపించిందేంటి? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
‘బ్యాడ్ టచ్’ పాఠం చెప్పిన కేసరి
నందమూరి బాలకృష్ణ- అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన ‘భగవంత్ కేసరి’ అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందకు వచ్చింది. ఇందులో శ్రీలీల కీలక పాత్ర పోషించింది. ఆడ పిల్లలను సింహంలా పెంచాలనే సందేశంతో ఈ సినిమాను తెరకెక్కించాడు అనిల్ రావిపూడి. ఓ సన్నివేశంలో బాలయ్యతో స్కూల్ పిల్లలకు ‘గుడ్ టచ్-బ్యాడ్ టచ్’ పాఠం చెప్పించాడు. ఆ సీన్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఓవరాల్‌గా ఈ సినిమా ఎలా ఉంది? ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది?(పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment