విజయ్ దెబ్బకు వెనకబడిపోయిన బాలకృష్ణ! | Leo Movie Advance Booking Beat Bhagavanth Kesari Movie | Sakshi
Sakshi News home page

ఆ విషయంలో బాలయ్యపై విజయ్ ప్యూర్ డామినేషన్!

Oct 17 2023 7:34 PM | Updated on Oct 17 2023 7:58 PM

Leo Movie Advance Booking Beat Bhagavanth Kesari Movie - Sakshi

ఈసారి దసరా బరిలో మూడు పెద్ద సినిమాలు. వీటిలో ఏది హిట్ అయినాసరే బాక్సాఫీస్ కళకళాలాడిపోవడం గ్యారంటీ. అందుకు తగ్గట్లే ఏ మూవీకి ఆ మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచారు. తమ సినిమాపై హైప్ తీసుకొచ్చేందుకు ఫుల్ బిజీగా ఉన్నారు. కానీ ఓ విషయంలో మాత్రం తమిళ హీరో విజయ్ కంటే తెలుగు హీరో బాలయ్య వెనకబడిపోయారు. ఇంతకీ ఏంటా విషయం?

(ఇదీ చదవండి: 'లియో' మూవీ.. రెమ్యునరేషన్ ఎవరికెంత ఇచ్చారు?)

ఈ శుక్రవారం రిలీజయ్యే సినిమాలు 'లియో', 'భగవంత్ కేసరి', 'టైగర్ నాగేశ్వరరావు'. ఈ మూడింటిలో మీరు ఏ సినిమాక వెళ్తారని అడిగితే దాదాపుగా 'లియో' అనే చెప్తారు. ఇదేదో మేం కల్పించి చెబుతున్న మాట అయితే కాదు. ఎందుకంటే విజయ్, బాలయ్య సినిమా టికెట్ల బుకింగ్స్ ఆన్‌లైన్‌లో ఓపెన్ చేశారు. అయితే అనుహ్యాంగా 'భగవంత్ కేసరి' కంటే 'లియో' బుకింగ్స్ ఎక్కువగా ఉన్నాయి.

హైదరాబాద్‌లోని మల్టీప్లెక్స్‌ల్లో 'లియో', 'భగవంత్ కేసరి' సినిమాలకు సమంగా స్క్రీన్స్ లభించాయి. కానీ లోకేశ్ కనగరాజ్ క్రేజ్ దృష్ట్యా 'లియో' వైపు ప్రేక్షకులు మొగ్గుచూపుతున్నట్లు అనిపిస్తుంది. అదే టైంలో బాలయ్య సినిమా బుకింగ్స్ మాత్రం కాస్త నెమ్మదిగా సాగుతున్నాయి. ఇక 'టైగర్ నాగేశ్వరరావు' బుకింగ్స్ అయితే ఓకే అనిపిస్తుంది. మరి ఈ మూడింట్లో ఏది హిట్ అవుతుందో? ఏది ఫట్ అవుతుందో తెలియాలంటే వెయిట్ అండ్ సీ.

(ఇదీ చదవండి: హీరో ప్రభాస్‌ పెళ్లి.. పెద్దమ్మ శ్యామలాదేవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement