
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్. దీనికంటే ముందు ఆయన భగవంత్ కేసరి సినిమా (Bhagavanth Kesari Movie) చేశాడు. దీనికి అనిల్ రావిపూడి డైరెక్టర్. ఈయన కామెడీని పక్కన పెట్టి మొదటిసారి ఎమోషనల్ డ్రామా పండిచే ప్రయత్నం చేశాడు. తొలి ప్రయత్నంలోనే సక్సెసయ్యాడు. 2023లో వచ్చిన భగవంత్ కేసరి బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది.
ఒకే సినిమాను ఐదుసార్లు చూసిన విజయ్
అయితే ఈ సినిమాపై తమిళ స్టార్ విజయ్ (Vijay) మనసు పారేసుకున్నాడట! ఒకటీరెండు సార్లు కాదు ఏకంగా ఐదుసార్లు చూశాడట! ఈ విషయాన్ని తమిళ నటుడు వీటీవీ గణేశ్.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈవెంట్‌లో వెల్లడించాడు. గతేడాది చెన్నైలో హీరోను విజయ్‌ను కలిశాను. నాకు అనిల్ రావిపూడి ఫ్రెండ్ అని విజయ్‌కు తెలుసు. తన చివరి సినిమాను అనిల్‌ను డైరెక్ట్ చేయమని అడిగాడు. కానీ అందుకు అనిల్ ఒప్పుకోలేదు. భగవంత్ కేసరి సినిమాను విజయ్ ఐదుసార్లు చూశాడు.

పెద్ద డైరెక్టర్లు క్యూలో ఉన్నా..
తనకు ఈ మూవీ చాలా బాగా నచ్చింది. తనకోసం తమిళంలో ఈ సినిమా తీస్తావా? అని అనిల్ రావిపూడి (Anil Ravipudi)ని పిలిచి అడిగాడు. కానీ అందుకు అనిల్ ఒప్పుకోలేదు. తాను రీమేక్ చేయనని ముఖం చెప్పి వచ్చేశాడు. నలుగురైదుగురు పెద్ద డైరెక్టర్లు విజయ్ చివరి సినిమా చేసేందుకు లైన్‌లో నిల్చుంటే అనిల్ మాత్రం చేయనని చెప్పి వచ్చేశాడు అని చెప్పుకొచ్చాడు. ఇంతలో అనిల్ రావిపూడి మధ్యలో కలుగజేసుకుంటూ సినిమానే చేయను అనలేదు, రీమేక్ చేయనన్నాను అని క్లారిటీ ఇచ్చాడు.
అప్పుడు నేనూ చూశా
గణేశ్ మళ్లీ మాట్లాడుతూ.. విజయ్ ఆ సినిమాను అయిదుసార్లు ఎందుకు చూశాడా? అని నేనూ భగవంత్ కేసరి చూశాను. అప్పుడు నాకు.. అనిల్ బానే తీశాడనిపించింది అని చెప్పుకొచ్చాడు. దీంతో విజయ్ చివరి సినిమా ఏదై ఉంటుందన్న చర్చ మొదలైంది. అనిల్ రావిపూడి వద్దన్నప్పటికీ మరో డైరెక్టర్‌తో భగవంత్ కేసరి రీమేక్ చేస్తాడా? లేదా? ఇంత మంచి ఆఫర్‌ను అనిల్ ఎందుకు వదులుకున్నాడు? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే విజయ్ 69 వ సినిమాయే చివరి చిత్రమని అందరూ భావిస్తున్నారు. దీని తర్వాత విజయ్ పూర్తిగా రాజకీయాలకే పరిమితం కానున్నాడు.
చదవండి: గేమ్ ఛేంజర్‌కు ఊహించని కలెక్షన్స్ .. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
Comments
Please login to add a commentAdd a comment