ఓటీటీలోకి వచ్చేసిన పెద్ద సినిమాలు, స్ట్రీమింగ్‌ అక్కడే! | Leo, Bhagavanth Kesari, The Village Streaming on This OTT Platforms | Sakshi
Sakshi News home page

OTT: ఓటీటీలో హిట్‌ సినిమాలు, హారర్‌ సిరీస్‌.. ఏవి ఎక్కడ స్ట్రీమింగ్‌ అవుతున్నాయంటే?

Published Fri, Nov 24 2023 8:31 AM | Last Updated on Fri, Nov 24 2023 9:08 AM

Leo, Bhagavanth Kesari, The Village Streaming on This OTT Platforms - Sakshi

థియేటర్‌లో సినిమాల సందడి ఎలా ఉన్నా ఓటీటీలు మాత్రం ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, కొత్త వెబ్‌ సిరీస్‌లతో కళకళలాడుతున్నాయి. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ సరికొత్త కంటెంట్‌ను అందించడంలో ఒకదానితో మరొకటి పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో ఓటీటీ ఆడియన్స్‌కు కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్నాయి. సినీప్రేమికుల కోసం ప్రతివారం కొత్త సినిమాలను మోసుకొస్తుంది ఓటీటీ. మరీ ముఖ్యంగా సినిమాలకు సెంటిమెండ్‌ డేగా చెప్పుకునే ఫ్రైడే రోజు భారీ చిత్రాలను రిలీజ్‌ చేస్తుంది. అలా ఈరోజు (నవంబర్‌ 24) నాలుగు పెద్ద సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. అవేంటో చూసేద్దాం..

లియో
దళపతి విజయ్‌, త్రిష ప్రధాన పాత్రలో నటించిన చిత్రం లియో. బాక్సాఫీస్‌ దగ్గర రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని అభిమానులు తెగ ఎదురుచూశారు. అదిగో.. ఇదిగో.. అంటూ ఊరించిన లియో ఎట్టకేలకు నేడు ఓటీటీలో అడుగుపెట్టింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

భగవంత్‌ కేసరి
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం భగవంత్‌ కేసరి. హీరోయిన్‌ శ్రీలీల బాలయ్య కూతురిగా నటించింది. యాక్టింగ్‌తో పాటు యాక్షన్‌ సీన్స్‌లోనూ అదరగొట్టింది. దసరాకు రిలీజైన ఈ మూవీ ఓటీటీ డేట్‌ గురించి అనేక పుకార్లు వచ్చాయి. అయితే అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఈ మూవీ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో తెలుగు, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

ది విలేజ్‌
తమిళ స్టార్‌ ఆర్య తొలిసారి ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ది విలేజ్‌ అనే హారర్‌ వెబ్‌ సిరీస్‌ చేశాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ ప్రేక్షకులను బాగానే భయపెట్టింది. ఈ సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నేటి నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది.

చదవండి: ‘సౌండ్‌ పార్టీ’ మూవీ రివ్యూ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement